అన్వేషించండి

Mohanlal: మలయాళ 'బాహుబలి'ని ఓటీటీకి ఇచ్చేశారుగా.. 

మోహన్ లాల్ నటించిన భారీ సినిమా 'మరక్కార్'ను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి కారణమేంటంటే..?

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన భారీ బడ్జెట్ సినిమా 'మరక్కార్'. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన ఈ సినిమాను మొదలుపెట్టినప్పటి నుంచి మలయాళ 'బాహుబలి'గా అభివర్ణిస్తున్నారు. అదే రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేశారు. ఈ సినిమా విజువల్స్, టీజర్స్ చూస్తుంటే మాత్రం పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ స్టయిల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అనిపించింది. నిజానికి ఈ సినిమా మొదలై చాలా కాలమవుతుంది. ఏడాదిన్నర క్రితమే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. 

Also Read: కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన మాజీ మిస్ కేరళ, రన్నరప్..

2020లో ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేయమని చాలా మందిదర్శకనిర్మాతలను సంప్రదించారు. కొన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ భారీ డీల్ ను ఆఫర్ చేశాయి. కానీ చిత్రబృందం మాత్రం అసలు టెంప్ట్ అవ్వలేదు. ఇంతటి భారీ సినిమాను థియేటర్లలో చూస్తేనే కిక్కుంటుందని ఎదురుచూశారు. ఈ ఏడాది మార్చిలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. కానీ అదే సమయంలో కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువయ్యాయి. అప్పటినుంచి మళ్లీ థియేటర్లు పూర్తి స్థాయిలో నడిచేవరకు ఎదురుచూశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి సినిమాను ఓటీటీకి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. 

మలయాళంలో థియేటర్లు తెరుచుకున్న కొన్ని రోజుల్లోనే వంద శాతం ఆక్యుపెన్సీ వస్తుందని అనుకున్నారు. అలాంటి సమాచారం 'మరక్కార్ను అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చేయడంతో అభిమానులు షాకయ్యారు. అయితే మంచి లాభాలకే సినిమాను అమ్మేసినట్లు తెలుస్తోంది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా ప్రభావం కేరళపై చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. కానీ మళ్లీ కరోనా ముప్పు ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వస్తారనే నమ్మకం పోయింది. ఒకవేళ వచ్చినా.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ వస్తాయనే ఆశలు లేక.. సినిమాను ఓటీటీకి అమ్మేసి ఉంటారనిపిస్తుంది. 

Also Read:కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!

Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?

Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గ‌మ‌నించారా!?

Also Read: నరాలు తెగే ఉత్కంఠ.. చూపు తిప్పుకోలేని విజువల్ వండర్

Also Read: ఆ పద్దెనిమిది వందల మందిని నేను చదివిస్తా.. పునీత్ కి మాటిచ్చిన విశాల్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget