Bigg Boss Telugu 5: ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ట్విస్ట్.. సరయు ఔట్..
బిగ్ బాస్ గేమ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. బిగ్ బాస్ తనకు నచ్చినట్లుగా కంటెస్టెంట్స్ ను ఆటాడిస్తుంటారు.
![Bigg Boss Telugu 5: ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ట్విస్ట్.. సరయు ఔట్.. Bigg Boss 5 Telugu Latest News Updates : Sarayu Gets Evicted Bigg Boss Telugu 5: ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ట్విస్ట్.. సరయు ఔట్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/12/7ecac6bea43dfdab5624c3b001c647f4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బిగ్ బాస్ గేమ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. బిగ్ బాస్ తనకు నచ్చినట్లుగా కంటెస్టెంట్స్ ను ఆటాడిస్తుంటారు. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ పై అందరికీ అనుమానాలు ఉన్నాయి. అసలు ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతుందా లేక బిగ్ బాస్ సొంత నిర్ణయం తీసుకుంటారా..? అనే సందేహాలు గత నాలుగు సీజన్లుగా ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే చోటుచేసుకుంటుంది.
బిగ్ బాస్ సీజన్ 5 మొదలై వారం రోజులు గడుస్తుండగా.. ఈ వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. బిగ్ బాస్ లెక్కల ప్రకారం ఈ వారం యూట్యూబ్ సంచలనం సరయుని ఎలిమినేట్ చేయబోతున్నారు. నిజానికి అందరూ జెస్సీ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు. పోల్స్ రిజల్ట్స్ కూడా అలానే వచ్చాయి. అయితే జెస్సీ కాకుండా తొలివారంలో సరయు ఎలిమినేట్ అవుతుందనే లీకులు బయటకు వచ్చాయి.
ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో యాంకర్ రవి, హమీదాలు శనివారం నాటి ఎపిసోడ్ లో సేవ్ అయ్యారు. ఇక మిగిలిన వారు మానస్, సరయు, కాజల్, జెస్సీలు. వీరిలో ముందుగా మానస్, కాజల్ ని సేవ్ చేసి.. ఆ తరువాత జెస్సీ, సరయులను టెన్షన్ పెట్టి.. ఫైనల్ గా సరయుని ఇంటి నుంచి బయటకు పంపించబోతున్నట్లు సమాచారం. సోషల్ మీడియా పోల్స్ ప్రకారమైతే జెస్సీ ఎలిమినేట్ అవుతాడనే వస్తుంది. అయితే అతడికి బదులుగా సరయుని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ షాక్ ఇవ్వబోతున్నాడు.
Also Read : Sai Dharam Tej Accident: బైక్ రైడింగ్ వద్దని ఎన్నో సార్లు చెప్పా.... సీనియర్ నటుడు నరేష్
Also Read : Sai Dharam Tej Accident: అంతా విషాదంలో ఉంటే రాజకీయాలేంటి? నరేష్‌పై మండిపడుతున్న సినీ ప్రముఖులు..
Also Read : Sai Dharam Tej Medical Bulletin: తేజ్ ఇంకా అపస్మారక స్థితిలో ఉండటానికి కారణం ఇదేనా? వైద్యులు ఏమన్నారు?
Also read: సాయి ధరమ్ తేజ్‌ను కాపాడిన పవన్ కళ్యాణ్ సలహా.. ఆ వీడియో వైరల్
Also read: 'ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్' సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై మంచు లక్ష్మీ కామెంట్స్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)