X
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Super 12 - Match 14 - 23 Oct 2021, Sat up next
ENG
vs
WI
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Bigg Boss 5 Telugu : ఈ వారం వారిద్దరూ సేఫ్.. కాజల్ నటిస్తూనే ఉందన్న ఉమాదేవి.. గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పిన షణ్ముఖ్..

బిగ్ బాస్ సీజన్ 5 మొదలై వారం రోజులు అవుతోంది. శనివారం ఎపిసోడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున.

FOLLOW US: 
బిగ్ బాస్ సీజన్ 5 మొదలై వారం రోజులు అవుతోంది. శనివారం ఎపిసోడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. శుక్రవారం నాడు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూపించారు. 

 

ఫ్రైడే హైలైట్స్.. 

 

ఇందులో ప్రియాంక-ఉమాదేవిల మధ్య జరిగిన గొడవ గురించి ప్రియాంకతో చర్చించాడు విశ్వ. ఫ్లోలో తప్పు చేశావ్ అన్నట్లుగా చెబితే.. ఇంకెప్పుడు మిస్టేక్ చేయనని ప్రియాంక.. విశ్వతో చెప్పింది. మరోపక్క యాంకర్ రవి, యానీ మాస్టర్ లు కలిసి జెస్సీ గురించి మాట్లాడుకున్నారు. 

 

అనంతరం ఉమాదేవిని కూర్చోబెట్టి ప్రియాంక క్షమించమని కోరింది. ఇంకెప్పుడు అలా మాట్లాడనని ఉమాదేవిని కౌగిలించుకుంది. 

 

అందరూ కార్నర్ చేస్తున్నారు.. 

 

జైల్లో ఉన్న జెస్సీని పరామర్శించడానికి కాజల్, సిరి వెళ్లారు. వాళ్లతో మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు జెస్సీ. సరయు తనతో బూతులు మాట్లాడుతుందని, తన మీద అబద్దాలు చెబుతుందని.. తీరా నేను తప్పు చేశానన్నట్లుగా  మాట్లాడిందని జెస్సీ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అందరూ కావాలనే కార్నర్ చేస్తున్నారంటూ ఏడ్చేశాడు. యానీ మాస్టర్ విషయంలో కూడా కావాలనే పెద్ద ఇష్యూ చేశారని అన్నాడు. కాసేపటికి సరయు.. జెస్సీ దగ్గరకు వచ్చి గొడవను సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేసింది. 

 

మానస్ హస్బెండ్ మెటీరియల్.. 

 

ప్రియా, ప్రియాంక సింగ్ కలిసి హౌస్ మేట్స్ లో ఉన్న అబ్బాయిల గురించి మాట్లాడుకున్నారు. మానస్ హస్బెండ్ మెటీరియల్ అని కితాబిచ్చింది ప్రియాంక. దానికి ప్రియా కూడా 'ఊ' కొడుతూ మానస్ చాలా డీసెంట్ అని చెప్పింది. ఈ సీజన్ లో అబ్బాయిలందరూ చాలా డీసెంట్ గా ఉన్నారని.. బ్రదర్లీ ఫీలింగ్ వస్తుందని చెప్పుకొచ్చింది ప్రియా. 

 

బాత్రూమ్ లో ఉమాదేవితో కలిసి ముచ్చట్లు పెట్టాడు లోబో. వైజాగ్ లో ట్యాంక్ బండ్, హైదరాబాద్ లో బీచ్ అంటూ ఇద్దరూ కాసేపు నవ్వించే ప్రయత్నం చేశారు. 

 

ఇక శనివారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ తో ముచ్చటించారు నాగ్. ముందుగా యానీ మాస్టర్ తో మాట్లాడారు. 'మీకు కోపం వస్తుందని నాకు ఇప్పటివరకు తెలియదు' అని నాగ్ అన్నారు. తన 18 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ కోపాన్ని ప్రదర్శించలేదని యానీ మాస్టర్ అన్నారు. 

 

ప్రియాంకతో మాట్లాడుతూ.. 'గొడవ జరిగిన తరువాత సార్ట్ అవుట్ చేసుకొని హగ్ చేసుకున్నావ్ చూడు.. నాకు బాగా నచ్చింది.. మెచ్యూర్డ్ గా అనిపించింది' అని కాంప్లిమెంట్ ఇచ్చారు

 

ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ సిరికి శుభాకాంక్షలు చెప్పారు నాగార్జున. 'అందరికంటే సిరి చాలా స్ట్రాంగ్ గా ఆడిందని.. దెబ్బలు కూడా తగిలాయని' సన్నీ ఆమెకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేయగా.. 'సిరి చూపించిన ఉత్సాహం నువ్వు కూడా చూపించొచ్చుగా' అంటూ నాగార్జున కౌంటర్ వేశారు. 

 

ప్రియా కిచెన్ బాగా మేనేజ్ చేస్తుందని కాంప్లిమెంట్ ఇచ్చారు నాగ్. అనంతరం 'ఏంటి ఎక్కడా బూతులు వినిపించలేదని' సరయుని ఉద్దేశించి అనగా.. సరయు నవ్వేసింది.. దానికి నాగ్ 'నువ్ నీలా ఉండు' అన్నారు. 

 

ఉమాదేవిని గొడవ పెట్టుకున్నా.. పర్లేదు కానీ.. కళ్లలో నీళ్లు పెట్టుకోవద్దని అన్నారు. 

 

లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో విశ్వ, శ్రీరామచంద్ర పెర్ఫార్మన్స్ లను కొనియాడారు. 'పాటలతో పాటు ఈ టాలెంట్ కూడా ఉందని ఇప్పుడే తెలిసింది' అంటూ నాగ్ చెప్పగా.. ఇంతలో ప్రియా కల్పించుకొని.. 'సర్.. ఇంకా హిడెన్ టాలెంట్స్ చాలా ఉన్నాయ్' అని అనగా.. 'ఏంటవి?' అని నాగ్ ప్రశ్నించారు. దానికి ప్రియా.. 'ట్రాక్స్ నడుస్తున్నాయి సర్ మల్టిపుల్ ట్రాక్స్' అంటూ కౌంటర్ వేసింది. 

 

హమీదకి హాయ్ చెప్పిన నాగ్.. నటరాజ్ మాస్టర్ ని ఎందుకంత ఎమోషనల్ అవుతారని ప్రశ్నించాడు. దానికి ఆయన ఒక్కోసారి అలా జరుగుతుంటుంది అన్నారు. 

 

ఆ తరువాత షణ్ముఖ్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు నాగ్. షణ్ముఖ్ ఫేమస్ డైలాగ్ ని వాడుతూ.. 'అరే ఏంట్రా ఇది.. కొంచెం కనపడరా.. వన్ వీక్ అయిపోయింది ఆట మొదలుపెట్టరా..' అంటూ కౌంటర్ వేశారు.

 

హౌస్ లో మోస్ట్ ఎంటర్టైనర్ గా నిలిచిన లోబోని పొగడ్తలతో ముంచెత్తారు నాగ్. 

 

హౌస్ లో గొడవలు లేకుండా చూస్తున్నావ్ గ్రేట్ అంటూ మానస్ ను పొగిడారు. చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్నావ్ అని మానస్ కి కాంప్లిమెంట్ ఇచ్చారు. శ్వేతాను అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలని సూచించాలి. 

 

జెస్సీని బాగా ఆడుతున్నావ్ అని చెప్పారు. 

 

ఎవరితో సెట్.. ఎవరితో కట్.. 

 

హౌస్ మేట్స్ కి ఎవరితో సెట్ అయిందో వాళ్లకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టాలి. ఎవరితో కట్ అయిందో.. వాళ్ల ఫోటో చించేసి చెత్త బుట్టలో వేయాలి. 

 

విశ్వ - తనకు మానస్ తో సెట్ అయినట్లు అతడికి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టాడు. కాజల్ ఫోటోను చించి చెత్త కుండీలో వేశాడు. అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుందని.. పని విషయంలో మాత్రం తప్పించుకుంటుందని కాజల్ విషయంలో రీజన్ ఇచ్చాడు. 

 

జెస్సీ - సన్నీకి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి, సరయు ఫోటోను చించి చెత్తకుండీలో వేశాడు. 

 

లహరి - ప్రియాకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి.. కాజల్ తో సరిగ్గా జెల్ అవ్వడం లేదని ఆమె ఫోటోని చించేసింది. 

 

లోబో - షణ్ముఖ్ కి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టాడు. హౌస్ లోకి వచ్చిన తరువాత షణ్ముఖ్ తో పరిచయం ఏర్పడిందని.. కొన్ని విషయాలను చాలా బాగా చెబుతుంటాడని ఎమోషనల్ అయ్యాడు. ఇక కాజల్ ఫోటోని చించుతూ.. ఆమె ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయిపోతుంటుందని రీజన్ చెప్పాడు.

 

సరయు - తనకు ఎవరూ సెట్ కాలేదని.. తనకు తనే ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టుకుంది. ఆ తరువాత సిరి ఫోటోను చించుతూ.. 'కోఆపరేషన్ ఇస్తే ఆడడం చాలా ఈజీ.. కానీ ఎవరి సపోర్ట్ లేకుండా ఆడగలగాలి. ఆడి చూపించు' అంటూ ఘాటు కామెంట్స్ చేసింది. 

 

శ్వేతా - యానీ మాస్టర్ కి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కడుతూ.. తన తల్లిని గుర్తుచేసుకొని ఏడ్చేసింది. ఇక ఉమాదేవితో వైబ్స్ సెట్ అవ్వడం లేదని ఆమె ఫోటోను చించేసింది. 

 

శ్రీరామచంద్ర - శ్వేతాకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కడుతూ.. లైఫ్ లాంగ్ తనకు మంచిగా ఫ్రెండ్ గా ఉంటానని చెప్పాడు. ఆమె కోసం 'ముస్తఫా ముస్తఫా' పాటను పాడాడు. హౌస్ లోకి వచ్చిన కొత్తలో కాజల్ తో చాలా క్లోజ్ అయ్యాయని.. కానీ తరువాత నెగెటివ్ వైబ్స్ వచ్చాయని ఆమె ఫోటోను చించేశాడు. 

 

సిరి - షణ్ముఖ్ కి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కడుతూ.. బయట మా ఇద్దరికీ పడదు కానీ ఇప్పుడు తన కారణంగా ఇంట్లో వాళ్లను మిస్ అవుతున్న ఫీలింగ్ రావడం లేదని చెప్పింది. తరువాత సరయుతో కట్  ఏ రోజైనా గెలిపించమని చెప్పానా? అని ప్రశ్నిస్తూనే కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కంటతడికి కరిగిపోని సరయూ.. 'మీరాడే ఆటలకు నేనూ రోజు ఏడవాలి' అని తిరిగి బదులిచ్చింది.

 

సన్నీ - హమీదకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి.. రవి ఫోటోను చించేశాడు. 

 

రవి సేఫ్.. 

 

నామినేషన్స్ లో ఉన్న వాళ్లను గార్డెన్ ఏరియాకు పిలిపించి.. చెత్త బుట్టలో వాళ్ల ఫొటోలతో ఉన్న చెత్త బుట్టలను తీసుకోమని చెప్పారు. ముందుగా సరయు తన కవర్ ఓపెన్ చేయగా.. 'అన్ సేఫ్' అని వచ్చింది. కాజల్, మానస్, జెస్సీ, హమీద లకు కూడా 'అన్ సేఫ్' వచ్చింది. యాంకర్ రవికి మాత్రమే సేఫ్ కార్డు వచ్చింది. 

 

టాస్క్ కంటిన్యూ.. 

 

నటరాజ్ - లోబో ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి.. కాజల్ ఫోటోను చించేశారు. 

 

మానస్ - రవికి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి.. కొన్ని విషయాల్లో అతడితో బాగా కనెక్ట్ అయ్యానని చెప్పారు. జెస్సీ ఫోటోను చించేశారు. 

 

రవి - ప్రియాంకకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి.. జెస్సీ ఫోటోను చించేశారు. 

 

ఉమాదేవి - ప్రియాంకకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి.. కాజల్ ఫోటోను చాలా కోపంగా చించేసింది. ఆమె హౌస్ లో నటిస్తుందని.. ప్రతి చిన్న విషయానికి నటించడం తప్ప ఏం చేయడం లేదని మండిపడింది. 

 

హమీద - సరయుకి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి.. షణ్ముఖ్ ఫోటోను చించేసింది. 

 

ప్రియా - యానీ మాస్టర్ కి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి.. హమీద ఫోటోను చించేసింది. 

 

ప్రియాంక సింగ్ - ప్రియాకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి.. ఎవరో ఒకరి ఫోటో చించాలని నటరాజ్ ఫోటోను చించేసింది. 

 

కాజల్ - శ్రీరామచంద్రకి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి.. ఉమాదేవి ఫోటోను చించేసింది. ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఆమెతో అసలు సెట్ అవ్వడం లేదని చెప్పింది. 

 

యానీ మాస్టర్ - శ్వేతాకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టారు. కాజల్ ఫోటోను చించేశారు. 

 

షణ్ముఖ్ - రవికి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి.. హమీద ఫోటోను చించేశాడు. 

 

ఆ తరువాత షణ్ముఖ్ తన గర్ల్ ఫ్రెండ్ పేరుని పిల్లో మీద రాసుకున్నాడని.. లహరి చెప్పగా.. ఆ గర్ల్ ఫ్రెండ్ పేరేంటో చెప్పమని నాగార్జున అడిగారు. దానికి షణ్ముఖ్ దీప్తి సునయన పేరుని చెప్పాడు. 

 

హామీద సేఫ్.. 

 

ఇక నామినేషన్స్ లో సేవ్ అవ్వని మిగిలిన ఐదుగురిని గార్డెన్ ఏరియాకు పిలిపించి..వారి పేర్లు రాసి ఉన్న పోడియమ్స్ ముందు వాళ్లను నుంచోబెట్టారు. వారి ముందున్న పోడియం మీద బోర్లించి ఉన్న కప్ లో ఎవరి కప్ లో బాల్ ఉంటుందో వాళ్లు సేఫ్ అయినట్లే. కాజల్, జెస్సీ, సరయు, మానస్ లకు 'అన్ సేఫ్' వచ్చింది. హమీద కప్ కింద బాల్ ఉండడంతో ఆమె సేఫ్ అయ్యారు. 

 
Tags: Kajal nagarjuna Bigg Boss 5 Telugu Bigg Boss 5 anchor ravi Hamida Umadevi

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: 'సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేయదు కానీ ఇంగ్లీష్ కిస్ పెట్టేవాడిని..' యానీ మాస్టర్ తో సన్నీ ఫన్.. 

Bigg Boss 5 Telugu: 'సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేయదు కానీ ఇంగ్లీష్ కిస్ పెట్టేవాడిని..' యానీ మాస్టర్ తో సన్నీ ఫన్.. 

Bigg Boss 5 Telugu: 'మగాడు.. గిగాడని మాట్లాడొద్దు..' ప్రియాంకపై విరుచుకుపడ్డ విశ్వ.. 

Bigg Boss 5 Telugu: 'మగాడు.. గిగాడని మాట్లాడొద్దు..' ప్రియాంకపై విరుచుకుపడ్డ విశ్వ.. 

Biggboss5: ప్రియకు ఆర్ధిక కష్టాలు, పద్ధతిగానే పెరిగానంటున్న సిరి... బరువైన జ్జాపకాలను చిరునవ్వుతో పంచుకున్న హౌస్‌మేట్స్

Biggboss5: ప్రియకు ఆర్ధిక కష్టాలు, పద్ధతిగానే పెరిగానంటున్న సిరి... బరువైన జ్జాపకాలను చిరునవ్వుతో పంచుకున్న హౌస్‌మేట్స్

Bigg Boss 5 Telugu: దీన్నే వాడుకోవడమంటారు.. సిరిని తిడుతూ ఏడ్చేసిన షణ్ముఖ్..

Bigg Boss 5 Telugu: దీన్నే వాడుకోవడమంటారు.. సిరిని తిడుతూ ఏడ్చేసిన షణ్ముఖ్..

Bigg Boss 5 Telugu: ప్రియా చేసిన పనికి సిగ్గుపడుతూ.. నవ్వేసిన సన్నీ

Bigg Boss 5 Telugu: ప్రియా చేసిన పనికి సిగ్గుపడుతూ.. నవ్వేసిన సన్నీ
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

Babu Delhi : చంద్రబాబు ఢిల్లీ టూర్‌ బీజేపీకి దగ్గరవడానికా ? ఏపీలో రాజకీయాలు మారుతున్నాయా ?

Babu Delhi : చంద్రబాబు ఢిల్లీ టూర్‌ బీజేపీకి దగ్గరవడానికా ? ఏపీలో రాజకీయాలు మారుతున్నాయా ?

Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం