Bigg Boss 5 Telug: షణ్ముక్ 'చిక్కుముడులు', ఇంటి సభ్యులు ఫైర్
రచ్చకి కేరాఫ్ అడ్రస్ గా మారిన బిగ్ బాస్ హౌజ్ లో తొమ్మిదోవారం కూడా కొత్తగా ఏముందిలే అన్నట్టు మారింది. ఇక ''జీవితమే ఒక ఆట'' టాస్క్ లో భాగంగా నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ ఎవరికి లభించిందంటే...
సరదా టాస్క్ అయినా, సీరియస్ టాస్క్ అయినా... సింగిల్ అయినా గ్రూప్ అయినా గొడవల విషయంలో అస్సలు తగ్గడం లేదు బిగ్ బాస్ ఇంటిసభ్యులు. ఎంజాయ్ చేస్తూ ఆడాల్సిన టాస్క్ లో కూడా ఓ రేంజ్ లో అరుచుకుంటున్నారు. మొదటి నాలుగు సీజన్లు చూశారో ఏమో స్ట్రాటజీలు ఒకర్ని మించి మరొకరు ప్లే చేస్తున్నారు. ఇక తొమ్మిదోవారం నామినేషన్లో ఉన్న సభ్యులు మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, ఆనీ మాస్టర్, విశ్వ. అంటే కేవలం కెప్టెన్ షణ్ముక్ మినహా మిగిలిన పదిమందీ నామినేషన్లో ఉన్నారు. ఈ మేరకు నామినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు 'జీవితమే ఒక ఆట' అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ఎలా సాగిందో కింద ప్రోమోలో చూడండి.
Immunity evariki vastundi?? Evaru safe avtharu?? #BiggBossTelugu5 tomorrow at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/1PlrkxMuJ6
— starmaa (@StarMaa) November 1, 2021
'జీవితమే ఒక ఆట' టాస్క్ లో భాగంగా ఏ సభ్యులైతే చివరిగా సేఫ్ జోన్ డోర్ కి వెళతారో వాళ్లు, వారి దగ్గరున్న బ్యాగ్ పై ఫొటో ఉన్న వారు కూడా డేంజర్ జోన్లోకి వెళతారు. అప్పుడు సేఫ్ జోన్లో ఉన్న నామినేటెడ్ సభ్యులు ఎవరిని సేఫ్ జోన్లోకి తీసుకురావాలో నిర్ణయించాల్సి ఉంటుంది. కాజల్ బ్యాగ్ పట్టుకున్న శ్రీరామ్ కావాలనే సేఫ్ జోన్లోకి వెళ్లకుండా బయటే ఉండిపోయాడు. ఇదేంటని అడిగిన సన్నీ-మానస్ కి ఇది నా స్ట్రాటజీ అని సమాధానం చెప్పాడు. ప్రియ, శ్వేత...కాజల్ వల్లే వెళ్లిపోయారని శ్రీరామ్ చెప్పడంతో మరి విమెన్ కార్డ్ ఎలా వాడతావని కాజల్ ని యానీ మాస్టర్ ప్రశ్నించింది. ఇంతలో రూమ్ లోకి వెళ్లి షణ్ముక్ బ్యాగ్స్ కి ముడులు వేశాడు. ఇది తప్పైతే పిలవండి బిగ్ బాస్ అని చెప్పాడు. ఈ లోగా బజర్ మోగడంతో స్టోర్ రూమ్ కి వెళ్లిన ఇంటి సభ్యులు బ్యాగుల కోసం పోటాపోటీగా లాక్కున్నారు. అసలు ముడులు ఎవరేయమన్నారని షణ్ముక్ పై... ప్రియాంక సింగ్ మండిపడింది. తన ఆలోచన సరైనది కాకుంటే స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ కాదన్నాడు షణ్ముక్.
మొత్తంగా చూస్తే ఈ టాస్క్ లో కూడా హౌజ్ మేట్స్ తమ విశ్వరూపం చూపించారనే అర్థమవుతోంది. అయితే ఈ టాస్క్ లో భాగంగా మానస్, యానీ మాస్టర్ కి ఇమ్యూనిటీ వచ్చినట్టు తెలుస్తోంది. అంటే ఈ వారం ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు నామినేషన్లో ఉన్న సభ్యులు సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, విశ్వ. వీరిలో సన్నీ, శ్రీరామ్, రవి, సిరి టాప్ 5 లో ఉండే ఛాన్సుందంటున్నారు బిగ్ బాస్ అభిమానులు. మిగిలిన కాజల్, ప్రియాంక, జెస్సీ, విశ్వ ఈ నలుగురిలో విశ్వ-జెస్సీ ఇద్దరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవొచ్చంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
Also Read: ప్రజెంట్ 'గాడ్ ఫాదర్'... 15 నుంచి 'భోళా శంకర్'... మెగాస్టార్ స్పీడు మామూలుగా లేదుగా!
Also Read: సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'... యాంగ్రీ స్టార్ తగ్గేదే లే!
Also Read: సాయి పల్లవి కోరిక... కామెడీ చేస్తానంటోంది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి