By: ABP Desam | Updated at : 03 Oct 2021 12:17 PM (IST)
రెహమాన్ (Image credit: Instagram/arrahman)
తెలంగాణాలో పెద్ద పండుగంటే బతుకమ్మే. ఊరువాడా ఏకమై ప్రతి ఏడాది ధూ..ధాం...గా ఈ పండుగను నిర్వహిస్తారు. ప్రవాస తెలంగాణ ప్రజలు కూడా చాలా అట్టహాసంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. ప్రతి ఏడాది బతుకమ్మ పై ప్రత్యేక గీతాలు విడుదలవుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ పాటలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈసారి బతుకమ్మ సాంగ్ అదిరిపోయే రేంజ్లో సిద్ధమయిందట. ఈ పాట కోసం ఆస్కార్ విజేత రెహామాన్ రంగంలోకి దిగారు. ఆయన సంగీత దర్శకత్వంలోనే ఈసారి పాట రాబోతోంది. ఈ పాట చిత్రీకరణ బాధ్యతను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తీసుకున్నారు. ఇక పాడింది కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఉన్ని క్రిష్ణన్ అని తెలుస్తోంది. ఇక పాటను రాసింది తెలంగాణాకు చెందిన మిట్టపల్లి సురేందర్. పాట షూటింగ్ భూదాన్ పోచం పల్లి ఏరియాలో రెండు రోజుల పాటూ సాగింది. నాలుగు నిమిషాల పాటూ అలరించే ఈ సాంగ్ ను అక్టోబర్ 6న విడుదల చేయనున్నారు. రెహమాన్ సంగీతంలో పాట వస్తుండడంతో ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బిఏ రాజు టీమ్ ట్విట్టర్ ఖాతాలో బతుకమ్మ సాంగ్ కు సంబంధించిన విషయాలను పోస్టు చేశారు. కవిత కల్వకుంట్ల ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ కోసం ఈ బతుకమ్మ పాటను రూపొందించినట్టు ట్వీట్ ద్వారా తెలుస్తోంది. ఏఆర్ రెహామాన్, గౌతమ్ మీనన్ వంటి దిగ్గజాలతో బతుకమ్మ సాంగ్ ను చేయాలన్న ఆలోచన, కృషి కల్వకుంట్ల కవితదే. ఈ పాట బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలను ఉర్రూతలూపడం ఖాయం.
A Moment of Pride for all the Bathukamma Festive Admirers!💥
Oscar Winning Musician @arrahman & Cult Filmmaker @menongautham has worked for the most Celebrating @TJagruthi's Bathukamma song!
Wonderful initiative from @RaoKavitha pic.twitter.com/Xk67MvqEiI — BA Raju's Team (@baraju_SuperHit) October 2, 2021
Also read: ఇవి తింటే గుండె సేఫ్... పక్షవాతం వచ్చే అవకాశం తగ్గిపోతుంది
Also read: గర్భిణుల్లో హఠాత్తుగా వచ్చే డయాబెటిస్... జాగ్రత్త పడక తప్పదు
Also read: చివరికి గెలిచేది ప్రేమే... వారికి తప్పదు పతనం, సామ్ భావోద్వేగం
Also read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్
F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్
Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం