Chaitanya-Samantha: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..
నాగచైతన్య-సమంత విడాకులు తీసకోవడానికి అమీర్ ఖాన్ కారణమా...కంగనా అలా ఎందుకంది..అసలేం జరిగింది. చై-సామ్ విడాకులకు అమీర్ ఖాన్ కి ఏంటి సంబంధం...
'బోడిగుండుకి మోకాలుకి ముడిపెట్టడం' ఈ సామెత మీరు వినేఉంటారు. ఇప్పుడీ సామెత బీటౌన్ కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ కి సరిగ్గా సరిపోతుంది. కెరీర్ ఆరంభం నుంచి వివాదాలకు కేరాఫ్ అయిన కంగనా..హృతిక్ రోషన్ తో ప్రేమ వ్యవహారంతో హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తర్వాత చెలరేగిపోయింది. ఇండస్ట్రీ ఏకంగా రెండు వర్గాలుగా చీలిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకోవడం తప్ప ఆమెతో కలసి పనిచేసేందుకు ఏ హీరో కూడా సిద్ధంగా లేరన్నది బీటౌన్ టాక్ . అయితే ఎక్కడ ఏం జరిగినా తానున్నానని ముందుకొచ్చే కంగనా టాలీవుడ్ హీరో-హీరోయిన్స్ నాగచైతన్య-సమంత విడాకుల ఘటనపై కూడా స్పందించింది. అయ్యో అనుంటే కంగనా ఎందుకవుతుంది...ఈ ఇష్యూలోకి అమీర్ ఖాన్ ని లాక్కొచ్చింది.
ఆమె లాజిక్ ఏంటంటే...తాజాగా విడాకులిచ్చిన ఈ సౌత్ హీరో, కొన్ని రోజుల కిందట ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ ను కలిశాడని, ఆ వెంటనే తన భార్యకు విడాకులిచ్చాడని పేర్కొంది. సదరు బాలీవుడ్ సూపర్ స్టార్ కు బాలీవుడ్ లో విడాకుల స్పెషలిస్ట్ గా పేరుందని, ఎంతోమంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడంటూ పరోక్షంగా అమీర్ పై సెటైర్లు వేసింది కంగన. పదేళ్లు రిలేషన్ షిప్ లో ఉండి, నాలుగేళ్లు వైవాహిక జీవితాన్ని గడిపిన హీరో విడాకుల స్పెషలిస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ ను కలిసిన వెంటనే, ఆయన సూచనలు-సలహాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ రాసుకొచ్చింది.
అమీర్-చైతూ కలసి లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటించారు. ఈ మధ్య లవ్ స్టోరీ సినిమా వేడుకకు అమీర్ ఖాన్ హాజరయ్యాడు..ఆ తర్వాత అక్కినేని కుటుంబంతో సంబరాల్లో పాల్గొన్నాడు. చై-సామ్ వ్యవహరంలోకి అమీర్ ని లాక్కురావడంతోనే విషయం వదిలేయలేదు...మగాళ్లందరిపై ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. సమాజంలో విడాకుల వ్యవహారం ఎప్పుడు తెరపైకొచ్చినా అందులో మగాడిదే తప్పంటోంది. దేవుడు అలా సృష్టిని తయారుచేశాడని మగాళ్లు వేటగాళ్లుగా, మహిళలు బలిపశువులుగా మారడం ఆనవాయితీ అని చెప్పుకొచ్చింది. దుస్తులు మార్చినంత ఈజీగా ఆడవాళ్లను మార్చేసే పురుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మహిళా లోకానికి హితబోధ చేసింది. నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై ఎప్పటి నుంచో వార్తలొచ్చినా శనివారం అధికారికంగా బయటకొచ్చింది. చైతూ, సమంతతో పాటు నాగార్జున కూడా ఈ విషయాన్ని నిర్థారించారు. ఇటీవల అమీర్ కూడా 15 సంవత్సరాల వివాహం తర్వాత కిరణ్ రావుతో విడిపోతున్నట్లు ప్రకటించాడు.ఈ వ్యవహారాన్ని కంగనా ఇలా వాడుకుందన్నమాట.
కంగనా పోస్ట్ ఇక్కడ చూడొచ్చు
Also Read:భరణంగా రూ.200 కోట్లు.. రిజెక్ట్ చేసిన సమంత..
Also Read: అక్కినేని ఫ్యామిలీ.. బ్రేకప్ స్టోరీలకు కేరాఫ్ అడ్రెస్
Also read: విడిపోయిన చైతు-సమంత.. రియాక్ట్ అయిన నాగార్జున..
Also Read: ప్రేమగా దగ్గరై.. పెళ్లితో ఒక్కటై.. చివరకు దూరమై..