'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 10వ తేదీ నుంచి స్టార్ మా టీవీలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా కొనసాగనుంది.
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
Bigg Boss 10 Telugu Contestants: 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10లో సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఒక్కొక్కరినీ ఫైనలైజ్ చేస్తున్నారు. అందులో విలన్ రోల్స్ చేసిన టాలీవుడ్ ఆర్టిస్ట్ ఒకరు ఉన్నారని టాక్.

- సెప్టెంబర్ 10న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం.
- నాగార్జున హోస్ట్‌గా, సామాన్యుల ఎంపికపై వివాదాలు కొనసాగాయి.
- 'టెంపర్' వంశీ కంటెస్టెంట్‌గా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.
- విలన్ పాత్రలతో ప్రసిద్ధి పొందిన వంశీపై ఆసక్తి నెలకొంది.
Bigg Boss 10 Telugu Confirmed Contestant 2026: సెప్టెంబర్‌లో 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 ప్రారంభం కానుంది. బిగ్ బాస్ ఇంటిలోకి సామాన్యులను పంపడం కోసం మొదలైన 'బిగ్ బాస్' అగ్నిపరీక్షను వరుస వివాదాలను వెంటాడుతున్నాయి. తనను రిజెక్ట్ చేయడం కంటే ట్రాన్స్ అని బిందు మాధవి అడగటం, మిమ్మల్ని పంపిస్తే సమాజానికి ఎటువంటి మెసేజ్ వెళుతుందని నవదీప్ అడగటంపై ఉప్పల్ బాలు రచ్చ రచ్చ చేస్తున్నారు. బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్ళే సామాన్యులు ఎవరనేది పక్కన పెడితే... విలన్ రోల్స్ చేస్తూ పాపులరైన టాలీవుడ్ ఆర్టిస్ట్ ఒకరిని ఫైనలైజ్ చేశారట. అతను ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..
'బిగ్ బాస్ 10'లోకి టెంపర్ వంశీ
Temper Vamsi Set To Enter Bigg Boss 10 Telugu: 'టెంపర్' వంశీ... మన తెలుగు వెండితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'టెంపర్'లో ఓ అమ్మాయిపై హత్యాచారానికి పాల్పడిన వ్యక్తిగా వంశీ నటించారు. ప్రకాష్ రాజ్ తమ్ముడి పాత్రలో వంశీ విలనిజానికి, ఆయన నటనకు మంచి పేరు వచ్చింది.

'టెంపర్' తర్వాత పలు సినిమాలు చేశారు వంశీ. 'అత్తారింటికి దారేది', 'భరత్ అనే నేను', 'సాహో', 'భీష్మ', 'వకీల్ సాబ్', 'హిట్ 2', 'దేవర' వంటి సినిమాలు చేశారు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', రీసెంట్ వరుణ్ తేజ్ సినిమా 'కొరియన్ కనకరాజు'లోనూ వంశీ నటించారు. 'టెంపర్'తో ఆయన గుర్తింపు వచ్చింది కనుక అందరూ ఆయన్ను 'టెంపర్' వంశీ అని పిలుస్తున్నారు. ఇప్పుడు 'బిగ్ బాస్ 10' ఇంటిలోకి వంశీ ఫైనల్ అయ్యారని టాక్.

రీల్ లైఫ్ విలన్... రియల్‌గా ఎలా ఉంటారో!?
'బిగ్ బాస్ 10'లోకి కంటెస్టెంట్‌గా వంశీ వెళితే... స్టార్ మా తీసుకున్న బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. రీల్ లైఫ్ విలన్ రోల్స్ చేసిన వ్యక్తి... రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు? బిగ్ బాస్ ఇంటిలో ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి కలిగించే అంశమే. 'బిగ్ బాస్' 10 ఇంటిలోకి వెళ్ళడం లేదని, అది ఫేక్ న్యూస్ అని యంగ్ ఫిమేల్ యాంకర్ ఛర్మిల స్పష్టత ఇచ్చారు. మరి టెంపర్ వంశీ కాకుండా ఇంకెవరు ఆ ఇంటిలో అడుగు పెడతారో చూడాలి.
'స్టార్ మా' టీవీలో సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 మొదలు కానుంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్ చేయనున్నారు. ఉప్పల్ బాలు రచ్చ, ఆ ఇష్యూపై కొందరు రియాక్ట్ కావడంతో కార్యక్రమానికి కావాల్సినంత ప్రచారం తీసుకొచ్చింది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Frequently Asked Questions
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 ఎప్పుడు ప్రారంభమవుతుంది?
'బిగ్ బాస్ 10'లోకి ఏ టాలీవుడ్ ఆర్టిస్ట్ కంటెస్టెంట్‌గా ఫైనల్ అయ్యారని టాక్?
విలన్ రోల్స్ చేస్తూ పాపులరైన టాలీవుడ్ ఆర్టిస్ట్ 'టెంపర్' వంశీ 'బిగ్ బాస్ 10' ఇంటిలోకి ఫైనల్ అయ్యారని టాక్. అతను తన విలనిజానికి మంచి పేరు పొందారు.
'టెంపర్' వంశీ ఎవరు?
'టెంపర్' వంశీ ఎన్టీఆర్ 'టెంపర్' సినిమాలో విలన్ పాత్రలో నటించి గుర్తింపు పొందారు. ఆ చిత్రం తర్వాత ఆయనను 'టెంపర్' వంశీ అని పిలుస్తున్నారు.
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10కి హోస్ట్ ఎవరు?
కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10కి హోస్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమం స్టార్ మా టీవీలో ప్రసారం కానుంది.
ట్రెండింగ్ వార్తలు





















