News
News
వీడియోలు ఆటలు
X

South Indian Celebrities: ప్రేమగా దగ్గరై.. పెళ్లితో ఒక్కటై.. చివరకు దూరమై..

ఏళ్లకు ఏళ్లు ప్రేమించుకొని.. ఆ తరువాత పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే దూరమైన తారలు మన ఇండస్ట్రీలో ఉన్నారు.

FOLLOW US: 
Share:

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్ లు చాలా కామన్ అయిపోయాయి. డ్రెస్ మార్చినంత ఈజీగా భార్య/భర్తలను మార్చేస్తున్నారు మన తారలు. ఏళ్లకు ఏళ్లు ప్రేమించుకొని.. ఆ తరువాత పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే దూరమైన తారలు మన ఇండస్ట్రీలో ఉన్నారు. కొందరికి పిల్లలున్నా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విడిపోయారు. ఈ మధ్యనే కిచ్చ సుదీప్ తన భార్యతో విడాకులు కోరుకొని తన కూతురు కోసం మళ్లీ విడాకులు రద్దు చేసుకొని భార్యతో కలిసి జీవించడం విశేషంగా చెప్పుకోవచ్చు. కానీ సుదీప్ అడుగుజాడల్లో నడిచేవారు ఇండస్ట్రీలో పెద్దగా లేరనే చెప్పాలి. తమ పార్ట్నర్ తో అడ్జస్ట్ అవ్వలేక విడిపోయినవారే ఉన్నారు. ఆ జంటలేవో ఇప్పుడు చూద్దాం!

Also Read: ఎంగేజ్మెంట్ కి 'ఎస్'.. పెళ్లికి 'నో'!

నాగచైతన్య.. 
అక్కినేని నాగచైతన్య-సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఏ మాయ చేసావె' సినిమాతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడగా.. కొన్నాళ్లకు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి.. 2017లో ఇరు కుటుంబ సభ్యుల సహకారంగా పెళ్లి చేసుకున్నారు. గోవాలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ తో వీరిద్దరూ ఒక్కటయ్యారు. దాదాపు నాలుగేళ్ల పాటు కలిసున్న ఈ జంట విడిపోతున్నట్లు అనౌన్స్ చేసి పెద్ద షాకిచ్చింది. 

Also Read:సమంతతో విడాకులు - నాగచైతన్య అధికారిక ప్రకటన !

పవన్ కళ్యాణ్.. 
టాలీవుడ్ లో అగ్ర హీరోగా వెలుగొందుతోన్న పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి పెటాకులైంది. ఆ తరువాత రేణుదేశాయ్ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమెతో కూడా డివోర్స్ తీసుకున్నారు పవన్. ఆ తరువాత 2013లో రష్యాకు చెందిన నటి.. అన్నా లెజ్నావెని పెళ్లి చేసుకున్నాడు. 

నాగార్జున.. 
1984లో దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీ దగ్గుబాటిని పెళ్లి చేసుకున్నారు నాగార్జున. ఆ తరువాత కొన్ని కారణాల వలన 1990లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆ తర్వాత అమలను పెళ్లి చేసుకున్నాడు నాగ్. 

కమల్ హాసన్.. 
1988లో సారికాను పెళ్లి చేసుకున్నారు కమల్. ఇది కమల్ కి రెండో పెళ్లి.. అంతకు ముందు డ్యాన్సర్ వాణి గణపతిని పెళ్లి చేసుకుని పదేళ్ల తర్వాత విడాకులు ఇచ్చారు. 

మంచు మనోజ్.. 
మంచు మనోజ్ చాలా ఏళ్లపాటు ప్రేమించి మరీ ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేది. కానీ పెళ్లైన మూడేళ్లకే విడిపోతున్నట్లు అనౌన్స్ చేసి షాకిచ్చారు. 

ప్రకాష్ కోవెలమూడి.. 
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ 2014లో కనికా థిల్లాన్ ను పెళ్లి చేసుకున్నారు. ఆమె మంచి రైటర్. వీరిద్దరూ కలిసి సినిమాలు కూడా చేశారు. కానీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 

సుమంత్.. 
నటి కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుమంత్. కానీ వీరిద్దరూ కలిసి ఎక్కువకాలం ఉండలేకపోయారు. దీంతో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కీర్తి వేరే పెళ్లి చేసుకున్నప్పటికీ.. సుమంత్ మాత్రం ఇంకా సింగిల్ గానే ఉండిపోయారు. 

ప్రకాష్ రాజ్.. 
లలిత కుమారి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్. పదిహేనేళ్ల తరువాత 2009లో ఆమెకి విడాకులు ఇచ్చారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తరువాత పోనీ వర్మను వివాహం చేసుకున్నారు ప్రకాష్ రాజ్. 

అమలాపాల్.. 
దర్శకుడు విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలాపాల్. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2017లో విడిపోయారు. అప్పట్లో వీరి విడాకులు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. 

ఇలా తెరపై తమ అద్భుత నటనతో అలరించే మన తారలు వ్యక్తిగత జీవితాల్లో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 

Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Oct 2021 05:13 PM (IST) Tags: samantha pawan kalyan nagarjuna Sumanth Nagachaitanya Manchu Manoj South Indian Celebrities

సంబంధిత కథనాలు

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !