By: ABP Desam | Updated at : 02 Oct 2021 10:38 AM (IST)
pushpa
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న 'పుష్ప' సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత బన్నీ- సుకుమార్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'పుష్ప' పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నట్లుగా గతంలోనే ప్రకటించారు మేకర్స్. ఫస్టు పార్టుకు సంబంధించిన చిత్రీకరణ 90 శాతం వరకూ పూర్తి చేశారు. మిగతా 10 శాతం చిత్రీకరణలో ఈ సినిమా టీమ్ బిజీగా ఉంది. వాస్తవానికి సెప్టెంబర్లోనే అదికూడా పూర్తికావాల్సి ఉన్నప్పటికీ ఇటీవల వర్షాల కారణంగా ఆలస్యమైంది. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందేమో అనే చర్చ జరిగింది. దీంతో సినిమా విడుదల విషయంలో స్పష్టత ఇచ్చేందుకు రంగంలోకి దిగిన మేకర్స్ డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ఒక అధికారిక ప్రకటన చేస్తూ రిలీజ్ డేట్ తో కూడిన ఒక పోస్టర్ వదిలారు.
This December, Theatres will go Wild with the arrival of #PushpaRaj 🔥#PushpaTheRise will hit the Big Screens on DEC 17th.#PushpaTheRiseOnDec17#ThaggedheLe 🤙@alluarjun @iamRashmika #FahadhFaasil @Dhananjayaka @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/qkDSOM41G9
— Pushpa (@PushpaMovie) October 2, 2021
'పుష్ప' సినిమాకి సంబంధించి బన్నీ ఫస్ట్ లుక్ తోనే అందరిలోనూ ఓ రకమైన ఉత్కంఠ రేకెత్తించారు. ఫస్ట్ లుక్, సాంగ్స్, పోస్టర్స్ అన్నీ సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన రష్మిక లుక్ ఆకట్టుకుంది. రష్మిక శ్రీవల్లి అనే పాత్రలో కనిపించనుంది. అమ్మడు డీ గ్లామర్ రోల్ పోషిస్తోందని తెలిసినప్పటికీ పోస్టర్ తో మరింత క్లారిటీ ఇచ్చింది మూవీ యూనిట్. పట్టు చీర కట్టుకుని చెవులకు దిద్దులు పెట్టుకుంటున్న లుక్.. పల్లె పడుచు భంగిమలో భలే ఉంది.
#Srivalli song release works in progress! More details soon ❤️🎶😍#SoulmateOfPushpa#PushpaTheRise#ThaggedheLe#Pushpa @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie pic.twitter.com/sigDgenvxY
— Mythri Movie Makers (@MythriOfficial) September 29, 2021
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశాడనేది మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. జగపతిబాబు , ప్రకాశ్ రాజ్, అనసూయ ప్రత్యేక పాత్రల్లో నటించారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా వసూళ్లు ఎలా ఉండబోతున్నాయో అనే చర్చ ఇప్పుడే ఊపందుకుంది.
దాక్కో దాక్కో మేక సాంగ్
Also Read: ప్రియాంక విషయంలో నోరు జారిన షణ్ముఖ్.. హామీదను ఎత్తుకొని మరీ శ్రీరామ్ డాన్స్..
Also Read: 'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలవాలి.. ఆ విషయాలన్నీ బయటపెడతా.. పూనమ్ వ్యాఖ్యలు
Also Read: పరదాల చాటున అదా శర్మను అలా చూస్తే 'హార్ట్ ఎటాక్' రాదా మరి..
మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్ను అక్కడి నుంచి లేపేశాడా?
ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!
షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!
విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీబాయ్ లవ్లీ రిప్లై
జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !