Bigg Boss 5 Telugu: ప్రియాంక విషయంలో నోరు జారిన షణ్ముఖ్.. హామీదను ఎత్తుకొని మరీ శ్రీరామ్ డాన్స్..
ఈరోజు జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో షణ్ముఖ్.. ప్రియాంకను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. అవేంటంటే..?
బిగ్ బాస్ సీజన్ 5 నాల్గో వారం పూర్తిచేసుకోబోతుంది. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో కాజల్ తనకు చెప్పిన రీజన్ సరిగ్గా లేదని శ్వేతా ఆమెతో డిస్కషన్ పెట్టింది. ఆ తరువాత నటరాజ్ మాస్టర్.. రవిని నత్తతో పోలుస్తూ లోబో ముందు కామెంట్ చేస్తుండగా.. రవి అక్కడకి వచ్చాడు. అప్పుడు లోబో విషయం చెప్పగా.. 'ఏంటో ఉన్న జంతువులన్నీ ఈయన నాకే ఇస్తున్నాడు' అని ఫన్నీగా అనేసి వెళ్లిపోయాడు.
Also Read: 'రిపబ్లిక్' మూవీ క్లైమాక్స్.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్..
ఆ తరువాత హౌస్ మేట్స్ దగ్గర ఫీల్ అయ్యాడు రవి. 'నటరాజ్ మాస్టర్ చాలా ఇరిటేట్ చేస్తున్నాడు.. యానిమల్ పేర్లు పెట్టి మాట్లాడుతున్నాడు' అని అనగా.. లోబో 'నేను ఆయనతో మాట్లాడతా' అని చెప్పాడు. వెంటనే రవి 'నా జోలికి రావొద్దని చెప్పు.. నా పేరు తీయొద్దని చెప్పు.. ఏదైనా చెప్పాలనుకుంటే ఎదురుగా వచ్చి చెప్పమను' అంటూ ఫైర్ అయ్యాడు. అనంతరం ప్రియాంక చీర కట్టుకొని రాగానే.. శ్రీరామచంద్ర 'వాలు కనుల దానా' అంటూ పాట అందుకున్నాడు.
లగ్జరీ బడ్జెట్ టాస్క్.. 'హోలాలా లాలా'..
ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు హోలా లూప్ నడుముపై పెట్టుకొని ముప్పై సెకన్లు స్ప్రింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఈ వారం హౌస్ లో బెస్ట్ పెర్ఫార్మర్, వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో ఏకాభిప్రాయంతో చెప్పమని అడిగారు బిగ్ బాస్. శ్వేతా వరస్ట్ పెర్ఫార్మర్ గా కాజల్ పేరు చెప్పి.. డబుల్ స్టాండర్డ్స్ అని రీజన్ చెప్పగా.. అది గేమ్ స్ట్రాటజీ అండ్ ప్లాన్ అని చెప్పింది కాజల్. ఓవరాల్ గా హౌస్ మేట్స్ అందరూ కలిసి బెస్ట్ పెర్ఫార్మర్ గా మానస్ ని ఎంపిక చేయగా.. వరస్ట్ పెర్ఫార్మర్ గా జెస్సీ, లోబోలకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో జెస్సీ, లోబోలలో ఎవరో ఒకరిని వరస్ట్ పెర్ఫార్మర్ గా సెలెక్ట్ చేసి జైల్లో పెట్టమని కెప్టెన్ శ్రీరామచంద్రకి బిగ్ బాస్ చెప్పగా.. జెస్సీ పేరుని ఫైనల్ చేసి అతడిని జైల్లో పెట్టారు.
నోరు జారిన షణ్ముఖ్..
జైల్లోకి వెళ్లిన జెస్సీ.. 'తప్పు చేసింది వాళ్లు కానీ ప్రతీసారి నన్నే పంపిస్తారు..' అని షణ్ముఖ్ చెప్పి ఫీల్ అవ్వగా.. 'కార్నర్ అయ్యావ్' అని షణ్ముఖ్ అన్నాడు. ఆ తరువాత శ్వేతాతో కూర్చొని షణ్ముఖ్ మీటింగ్ పెట్టాడు. లోబోని జైల్లోకి పంపించకుండా ప్రతీసారి జెస్సీని టార్గెట్ చేస్తున్నారని అన్నాడు. ప్రియాంకను లోబో తప్పుగా పట్టుకున్నా.. ఆ విషయం ఎవరూ మాట్లాడలేదని.. నిజానికి ఆమె(ప్రియాంక) మాట్లాడాలి కానీ ఆమె అసలు మాట్లాడలేదు.. బహుశా తనకు కూడా ఓకేనెమో అంటూ నోరు జారారు.
బిగ్ బాస్ ఫ్రైడే నైట్ విత్ సన్నీ..
ఈ షోలో భాగంగా సన్నీ వీజేగా వ్యవహరిస్తూ శ్రీరామ్ ని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. హౌస్ మేట్స్ ని ఆడియెన్స్ గా కనిపించమని చెప్పారు బిగ్ బాస్. ఈ క్రమంలో సన్నీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా 'బాలు గారి సాంగ్స్ వింటూ పెరిగాను.. ఆయన పాడిన పాటలు నాకు పాడడం చాలా ఇష్టం' అని చెప్పాడు శ్రీరామ్. ఆ తరువాత కాజల్.. 'సిరి ఆర్ హమీద??' ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయమని అడగ్గా.. లంచ్ టీమ్ లో సిరి, డిన్నర్ టీమ్ లో హమీద అని చెప్పాడు శ్రీరామ్. 'లంచ్, డిన్నర్ ఓకే మరి టిఫిన్స్ ఎవరు సర్' అని సన్నీ ఫన్ చేసే ప్రయత్నం చేశాడు.
తనకు ఎలాంటి అమ్మాయి కావాలనే విషయంలో కొన్ని క్వాలిటీస్ చెప్పాడు శ్రీరామ్. ''ప్రియా గారిలో ఉన్న బార్బీ డాల్ లాంటి ఎలిగెన్స్.. పింకీకి ఉన్న సెన్సిటివి, బాగా వంట చేసే టాలెంట్.. యానీ మాస్టర్ కి ఉన్న మెచ్యూరిటీ.. హమీద లాంటి ఇంటెన్స్.. శ్వేతాలో ఉన్న ఫ్రెండ్లీనెస్.. కాజల్ లో ఉన్న ప్రేమ.. సిరిలో ఉన్న అల్లరితనం కావాలని' చెప్పారు. వెంటనే 'నేను సిరికి కూడా చెప్పాను.. ఆమె కమిటెడ్ కాకపోయి ఉంటే కచ్చితంగా ట్రై చేసేవాడ్ని' అని అనగా.. సిరి తెగ సిగ్గుపడిపోయింది. వెంటనే రవి.. 'అన్నా.. నీ టేస్ట్ ఇంత బ్యాడా' అని కామెంట్ వేయగా.. అందరూ నవ్వేశారు.
'నీ గుండెలో ఎవరైనా అమ్మాయ్ ఉందా..?' అని శ్రీరామ్ ని ప్రశ్నించింది ప్రియా. పదేళ్లుగా సంగీతమే ఉంది. నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎవరు వస్తారా అని.. ఆ అమ్మాయి కోసం 'యువర్ మై ఎవ్రిథింగ్' పాట పాడాడు శ్రీరామ్. ఆ తరువాత శ్వేతా.. 'ఇక్కడున్న ఎవరైనా ఒక అమ్మాయిని డేట్ కి తీసుకువెళ్లాలనుకుంటే ఎవరిని తీసుకెళ్తావ్' అని అడిగింది. దానికి శ్రీరామ్.. హమీద అని బదులిచ్చాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. హమీదను ఎత్తుకొని మరీ డాన్స్ చేశాడు శ్రీరామ్. ఆ తరువాత లోబో, సన్నీ కలిసి హౌస్ మేట్స్ అందరినీ ఇమిటేట్ చేశారు.
Also Read:ఆ రోజు నాకు వైద్యం చేసింది అల్లు రామలింగయ్యే.. రాజమండ్రిలో చిరు చిట్‌చాట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి