By: ABP Desam | Updated at : 01 Oct 2021 03:19 PM (IST)
Image Credit: Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం రాజమండ్రి పర్యటించారు. ప్రముఖ హాస్య నటులు అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా రాజమండ్రిలోని హోమియోపతి వైద్య కళాశాలలో ఆయన కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. అనంతరం కళాశాలలో రూ.2 కోట్లతో నిర్మించిన కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. రాజమండ్రితో తనకు ఉన్న మధురానుభూతులను గుర్తు తెచ్చుకున్నారు. అల్లు రామలింగయ్యకు హోమియోపతి వైద్యంపై ఉన్న మక్కువ గురించి చెప్పారు.
రాజమండ్రితో అనుబంధం: చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘రాజమండ్రి ఎప్పుడు వచ్చినా.. గత స్మృతులు వెంటాడుతూ ఉంటాయి. రాజమండ్రితో నాకు ఎంతో అనుబంధం ఉంది. నేను తొలి మేకప్ వేసుకున్నదే రాజమండ్రిలో. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నటించిన పునాది రాళ్లు, ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు తదితర సినిమాలన్నీ రాజమండ్రిలోనే షూటింగ్ జరుపుకున్నాయి. ఇందుకు నేను రాజమండ్రికి థాంక్యూ చెప్పకుండా ఉండలేను. అల్లు రామలింగయ్యతో నాకు ఉన్నది కేవలం మామ-అల్లుళ్ల బంధమే కాదు.. గురుశిష్యుల అనుబందం. చిన్నప్పుడు ఆయన హాస్యాన్ని చూసి నవ్వకొనేవాడిని. అయితే, ఆయన నిజం జీవితంలో మాత్రం జీవితాన్ని హాస్యంగా తీసుకోలేదు. ఆయన చెప్పిన మాటలు విజ్ఞాన గుళికలు. ఆయన ఎందరో మహనీయుల గురించి చెబుతుంటూ.. అలా వింటూ శ్రోతనై ఉండిపోయాను’’ అని తెలిపారు.
హోమియో పతిని.. ఉమాపతి అనేవాడిని: అల్లు రామలింగయ్యగారు హోమియోపతి వైద్యం చేయడానికి ముందే తనకు దానిపై అవగాహన ఉందని చిరంజీవి తెలిపారు. ‘‘బాల్యంలో పొన్నూరులో ఉన్నప్పుడు ఓ ప్రముఖ హోమియో వైద్యుడి వద్ద అమ్మ వైద్యం చేయించేది. అప్పట్లో ‘ఉమాపతి’ మందులు ఇవ్వు అమ్మా అనేవాడిని. అంటే.. ‘హోమియోపతి’ మందని అర్థం’’ అని చిరు అనేగానే అంతా నవ్వేశారు. ‘‘రామలింగయ్యగారు సినిమాల్లో నటిస్తూనే హోమియోపతిలో శిక్షణ పొందారు. ఎంతో పట్టదలగా దానిపై పట్టు సాధించారు. సమయానికి తినకపోవడం వల్ల నిత్యం కడుపు మంటతో బాధపడేవాడిని. ఎన్ని మందులు వాడినా తగ్గేది కాదు. ఓ రోజు ఈ విషయం అల్లు రామలింగయ్యగారికి చెబితే.. అన్నం తినక ముందు వచ్చేదా.. తర్వాత వచ్చేదా అని చాలా ప్రశ్నలు అడిగారు. సమాధానం చెప్పాక.. ఓ మాత్ర ఇచ్చారు. అది తీసుకున్న తర్వాత.. చేతితో తీసేసినట్లుగా మంట మాయమైపోయింది’’ అని తెలిపారు.
Also Read: రిపబ్లిక్ సమీక్ష: ఆలోచింపజేసే అరుదైన సినిమా.. అయితే?
అబ్బాయి బాగున్నాడని.. నొక్కేద్దాం అనుకున్నారేమో: ‘‘అల్లు రామలింగయ్యను నేను తొలిసారి కలిసింది కూడా రాజమండ్రిలోనే. ‘మన ఊరి పాండవులు’ సినిమాలో ఆయన్ని కలిశాను. అప్పుడే అబ్బాయి బాగున్నాడు.. నొక్కేసి ఇంట్లో ఉంచుకుందామని అనుకున్నారో ఏమో తెలీదు. షూటింగ్ ముగించుకుని వెళ్తున్న సమయంలో అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు రాత్రి 9 గంటలకు చిన్న సమావేశం పెట్టుకున్నారు. అక్కడ నా గుణాలపై చర్చ జరిగింది. అంతా నాకు టిక్ మార్క్ వేశారు. అక్కడ తీసుకున్న నిర్ణయంతో సురేఖతో అనుబంధం ఏర్పడింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
అప్పట్లోనే టూపీస్ బికినీ - అప్పుడు ఎంతో కష్టపడ్డాం, మాధవికి రాధ ప్రశంసలు
ఐదు లక్షల కోసం రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన
Guppedanta Manasu March 22nd: శ్రీవారికి ప్రేమగా వండి వడ్డించిన వసుధార, తాళి గురించి కొనసాగుతున్న రచ్చ
నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా