Samantha Divorce: చివరికి గెలిచేది ప్రేమే... వారికి తప్పదు పతనం, సామ్ భావోద్వేగం
అక్కినేని అభిమానులను తీవ్ర విచారంలో ముంచిన విషయం చై-సామ్ విడాకుల వివాదం. ఈ సమయంలో సమంత తన స్టాటస్ లో పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది.

టాలీవుడ్లో ముచ్చటైన జంట సమంత, నాగ చైతన్య. పదేళ్ల ప్రేమ ప్రయాణం అనంతరం పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లయిన నాలుగేళ్లకే విడిపోయారు. అది కూడా నాలుగో పెళ్లి రోజుకు సరిగ్గా అయిదు రోజుల ముందే తమ విడాకుల విషయాన్ని బయటపెట్టారు. ముందుగా నాగచైతన్య, ఆ తరువాత సమంత, ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రపంచానికి తాము ఇకపై సింగిల్ అనే విషయాన్ని తేల్చి చెప్పారు. ఆ తరువాత నాగ చైతన్య పెద్దగా స్పందించలేదు. కానీ సమంత భావోద్వేగాలతో ఓ పోస్టు స్టాటస్ లో పెట్టింది. ఆ పోస్టులో ఉన్న ఆమె బాధ చూస్తుంటే... విడాకులకు ఎవరైనా కారణమా అని అనుమానం రాక మానదు.
ఆ పోస్టులో గర్భంతో ఉన్న ఓ మహిళ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోపై మా అమ్మ చెప్పింది అన్న హెడ్డింగ్ తో రాసుకొచ్చింది. ‘నేను బాధలో ఉన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాటలే గుర్తొస్తాయి. చరిత్రను చూస్తే అర్థమవుతుంది చివరకు గెలిచేది ప్రేమ, సత్యం మాత్రమేనని. ఆ చరిత్రలో కనిపించకుండా కుట్రలు చేసే నియంతలు, హంతకులు ఉంటూనే ఉన్నారు కానీ వారికి చివరికి పతనం తప్పదు. ఈ విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి’ అని ఆమె పెట్టిన పోస్టు సారాంశం. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టిందో తెలియదు కానీ, ఆమె అభిమానులను చాలా బాధ పెట్టింది. అక్కినేని కుటుంబ సభ్యులలో ఎవరినైనా ఉద్దేశించి ఆ పోస్టు పెట్టిందా అని కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి.
సమంత- నాగ చైతన్య విడాకులు ప్రకటించిన కాసేపటికే హీరో సిద్ధార్ధ పెట్టిన పోస్టు కూడా వైరల్ అయింది. ‘మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు’ అంటూ అతను పెట్టిన పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టాడో అని చర్చలు మొదలయ్యాయి. చాలా మంది సమంత గురించే అయ్యుంటుంది అని బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే నాగ చైతన్య కన్నా ముందు సామ్ సిద్ధార్థతోనే ప్రేమలో ఉంది. తరువాత అతనితో విడిపోయి చైకు దగ్గరైంది. అందుకే సమంతను ఉద్దేశించే అతను అలా స్పందించి ఉంటాడని భావిస్తున్నారు నెటిజన్లు.
Also read: 'మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు'.. సిద్ధార్థ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించో..?
Also read: అక్కినేని ఫ్యామిలీ.. బ్రేకప్ స్టోరీలకు కేరాఫ్ అడ్రెస్
Also read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















