Rajinikanth Annaatthe first look : పంచెకట్టుతో రజినీ.. లుక్ అదుర్స్ కదూ..
సూపర్ స్టార్ రజినీకాంత్.. మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'అన్నాత్తే'. దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్.. మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'అన్నాత్తే'. దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అజిత్ ను మాస్ యాంగిల్ లో చూపించిన శివ ఇప్పుడు రజినీకాంత్ ను వేరే లెవెల్ లో చూపించబోతున్నారు. ఈ సినిమాలో తారాగణం కూడా భారీగా ఉంది. హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా.. మరికొన్ని ముఖ్య పాత్రల్లో కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ ఇలా చాలా మంది కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు హైదరాబాద్ లోనే జరిగింది.
Also Read : Tuck Jagadish Review: ‘టక్ జగదీష్’ రివ్యూ: మరీ ఇంత సీరియస్‌గా ఉంటే ఎలా నాని?
నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది. షూటింగ్ లకు కరోనా అంతరాయం కలిగిస్తుండడంతో వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో రజినీకాంత్ పంచెకట్టుకొని.. గాగుల్స్ పెట్టుకొని ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
#AnnaattheFirstLook @rajinikanth @directorsiva #Nayanthara @KeerthyOfficial @immancomposer @khushsundar #Meena @sooriofficial @AntonyLRuben @dhilipaction @vetrivisuals#AnnaattheDeepavali pic.twitter.com/pkXGE022di
— Sun Pictures (@sunpictures) September 10, 2021
ఆయన నిల్చున్న తీరు.. నవ్వే విధానం అన్నీ కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ లుక్ తెగ వైరల్ అవుతోంది. ఈరోజు సాయంత్రం మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. దానికి ఫ్యాన్స్ ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి. ఈ సినిమాను దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నారు. అప్పటికి పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఈ సినిమా దీపావళికి రావడం ఖాయం. ఇక ఈ ఫస్ట్ లుక్ మీద టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.
Also Read: బిగ్ బాస్.. ఈ లేడీస్‌కు కాస్త పూలు చూపించు.. అబ్బాయిలు క్లాస్, అమ్మాయిలు ఊర మాస్!
Ram Charan Watch: రామ్ చరణ్ పెట్టుకున్న ఈ వాచ్ దొరికితే కోటీశ్వరులు కావచ్చు.. ధర ఎంతో తెలుసా?
AP Tollywood : సర్కారు వారి బుకింగ్స్‌పై టాలీవుడ్ సైలెన్స్ ! వారికి ఆమోదమేనా..?
బిగ్ బాస్ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ