అన్వేషించండి

Bigg Boss Telugu 5: బిగ్ బాస్.. ఈ లేడీస్‌కు కాస్త పూలు చూపించు.. అబ్బాయిలు క్లాస్, అమ్మాయిలు ఊర మాస్!

బిగ్ బాస్ 5లో ఎక్కువగా గొడవపడుతున్నది ఎవరు? అమ్మాయిలా? అబ్బాయిలా? ఇందుకు నెటిజనులు ఏమంటున్నారో చూడండి.

‘బిగ్ బాస్’ అంటే అందరికీ ఇష్టమే. అందులో గొడవలను కూడా చాలామంది ఇష్టపడతారు. కానీ, ఆ ఇంట్లోకి ఎంటరైన తర్వాతి రోజు నుంచి అరవీర భయంకరమైన ఇగోలతో రెచ్చిపోతే.. కాస్త అతిగానే అనిపిస్తుంది. ప్రస్తుతం ‘బిగ్ బాస్-5’ చూస్తున్నవారికి ఇలాగే అనిపిస్తుందట. ఈ షో చూస్తున్న ప్రేక్షకులు, నెటిజనుల అభిప్రాయం ప్రకారం.. బిగ్ బాస్ హౌస్‌లో అమ్మాయిలే ఎక్కువ పోట్లాడుకుంటున్నారు, ఇగోలతో రగిలిపోతున్నారు. వీరి గొడవల మధ్యలో కలుగజేసుకోడానికి మేల్ కంటెస్టెంట్లు సైతం హడలిపోతున్నారు. 

ఆడదానికి ఆడదే శత్రువని మన పెద్దలు చెబుతుండేవారు. అది నిజమే అనిపించేలా బిగ్ బాస్ హౌస్‌లోని మహిళ కంటెస్టెంట్ల తీరు ఉందని నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్‌లో ఇప్పటివరకు ప్రసారమైన ఎపిసోడ్స్‌లో ఎక్కువగా అమ్మాయిల గొడవలే కనిపిస్తున్నాయి. ముందుగా.. హమీదా తన ఇంట్లోని పిల్లలు తనని అమ్మా అని పిలుస్తాయని జస్సీకి చెప్పడం.. మీ ఇంట్లో కుక్కలు నిన్ను డాడీ అంటాయా అని కౌంటర్ వేయడం.. ఇందుకు ఆమె అలిగి.. మిగతా సభ్యుల వద్ద దాన్ని పెద్ద ఇష్యూ చేయడం వాగ్వాదానికి దారి తీసింది. ఆ తర్వాత హౌస్‌మేట్స్ అంతా గ్రూపులుగా విడిపోయారు. 

ఇక ఈ హౌస్‌లో ‘అర్జున్ రెడ్డి’ భామ.. లహరీ బిగ్ బాస్ తర్వాత మరో బిగ్ బాస్‌‌లా వ్యవహరిస్తోందని నెటిజనులు అంటున్నారు. కాజల్ అత్యుత్సాహంతో కష్టాలు కొని తెచ్చుకుంటోంది. ఆమెకు ‘బిగ్ బాస్’ గురించి బాగా తెలియడం వల్ల.. ఎప్పుడూ కంటెంట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుందనే భావన హౌస్ మేట్స్‌లో కలిగింది. ఇదే విషయాన్ని లహరీ ప్రస్తావిస్తూ.. కాజల్‌తో గొడవకు దిగింది. అయితే, లహరీ చిన్న విషయాన్ని తెగే వరకు లాగుతున్నట్లుగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఇందుకు హమీదాతో జరిగిన గొడవేనని అంటున్నారు. ఆమెతో లహరీ అనవసరంగా గొడవ పడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే యాని మాస్టర్.. జస్సీపై విరుచుకుపడటం కూడా చర్చనీయమైంది. అలాగే సీరియల్ నటి ఉమా ఆలూ కర్రీ కోసం గొడవ పడుతున్న సమయంలో.. ఆమె బాడీ లాంగ్వేజ్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. స్కూల్‌లో ప్రిన్సిపల్ తరహాలో ఆమె వ్యవహరిస్తోందని అంటున్నారు. ఒక్కోసారి అమ్మాయిల గొడవలను చూస్తుంటే.. చేపల మార్గెట్లో ఉన్నామేమో అనిపిస్తోందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఇలా అమ్మాయిలంతా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం.. వీలైనప్పుడు అబ్బాయిలను కూడా టార్గెట్ చేసుకోవడం వంటివి చూస్తుంటే.. అబ్బాయిలు మాత్రం కూల్‌గా తమ పనులు తాము చేసుకుని వెళ్లిపోతున్నారు. అమ్మాయిల్లో సిరి చాలా బెటర్ అని నెటిజనులు అంటున్నారు. ట్రాన్స్‌జెండర్ ప్రియాంక కూడా చాలా హూందాగా వ్యవహరిస్తోంది. శ్వేత, ప్రియ, సరయు వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, హమీదా, ఆర్జే కాజల్‌లు.. తమని తాము కన్‌ఫ్యూజ్ చేసుకోవడమే కాకుండా ఇతరులను కూడా గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. కొన్ని గొడవలకు కేంద్ర బిందువులు అవుతున్నారు. 

Also Read: ఎంత పనిచేశావ్ హమీదా.. జస్సీకి ఎలిమినేషన్ గండం.. ప్రియాకు కెప్టెన్సీ ఛాన్స్ పాయే!

అయితే.. ఈ సీజన్‌లోనే కాదు.. గత సీజన్లలో కూడా బిగ్ బాస్ హౌస్‌లో అమ్మాయిల మధ్యే గొడవలు ఎక్కువ జరిగేవి. అబ్బాయిలు.. వీలైనంత కూల్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అబ్బాయిలో మానస్, శ్రీరామ చంద్ర, షణ్ముఖ్‌లు కూల్‌గా ఆకట్టుకుంటున్నారు. విజే సన్నీ, రవి కూడా సరదాగా కలిసిపోతూ గేమ్ ప్లాన్‌తో వెళ్తున్నాడు. విశ్వ కూడా వీలైనంత మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. లోబో లేకపోతే.. బిగ్ బాస్ బోర్ కొట్టేదేమో. నటరాజ్ మాస్టర్ పెద్ద మనిషిలా వ్యవహరిస్తున్నాడు. జస్సీ మాత్రం సిరితోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అయితే, బిగ్ బాస్ హౌస్‌లో లేడీస్ మాత్రం చాలా వయొలెంట్‌గా ఉన్నారని.. వారికి కాస్త ‘పువ్వులు’ లేదా కూల్‌గా ఉన్న అబ్బాయిలను చూపించండని నెటిజనులు అంటున్నారు. 

Also Read: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!

Also Read: బిగ్ బాస్‌ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget