X

Hamida Cat: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!

హమీద తన ఇంట్లోని పిల్లి మ్యావ్ అనదని, అమ్మా అంటుందని చెప్పడంతో.. జెస్సీ కౌంటర్ వేశాడు. చివరికి ఈ వ్యాఖ్యలు జెస్సీని నామినేషన్‌కు వెళ్లేలా చేశాయి.

FOLLOW US: 

పిల్లలు ‘‘మ్యావ్.. మ్యావ్’’ అని అంటాయి. కానీ, అమ్మా అని పిలుస్తాయా? కానీ.. హమీదా ఇంట్లోని పెంపుడు పిల్లి అలాగే పిలుస్తుందట. చిత్రంగా ఉంది కదూ. సూపర్ మోడల్ జెస్పీకి కూడా అదే అనిపించింది. దీంతో ఆమెకు కౌంటర్ కూడా ఇచ్చాడు. దాని వల్ల బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద రచ్చే జరిగింది. ఇది నామినేషన్లకు కూడా దారి తీసింది. చివరికి.. ఈ పిల్లి గోల జెస్సీ, హమీదాలను కన్నీళ్లు పెట్టుకొనేలా చేసింది. ఇంతకీ ఏమైంది? ఆ పిల్లి ప్రస్తావన గొడవకు ఎందుకు దారి తీసిందో మీకు తెలుసుకోవాలని ఉందా?

బిగ్ బాస్ 2వ ఎపిసోడ్ చూసినవారికి.. నామినేషన్లలో వారు ఎందుకలా తిట్టుకుంటున్నారో సరిగా అర్థమై ఉండదు. ముఖ్యంగా జెస్సీ-హమీద మధ్య జరిగిన గొడవ నామినేషన్ల ప్రక్రియను గందరగోళంగా మార్చింది. సోమవారం రాత్రి ప్రసారమైన ఎపిసోడ్‌లో జెస్సీ, శ్వేతా వర్మలతో కలిసి హమీదా గార్డెన్ ఏరియాలో కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేసింది. ఈ సందర్భంగా ఆమె తాను పెంచుకుంటున్న పిల్లి గురించి చెప్పింది. ఆ పిల్లి ‘మ్యావ్’ అనదని, ‘మా..’ అంటుందని చెప్పడంతో కాసేపు జెస్సీకి నోట మాటరాలేదు. ఆ షాక్ నుంచి తేరుకొనే లోపు.. తన వద్ద కుక్క కూడా ఉందని హమీదా చెప్పడంతో.. వెంటనే జెస్సీ కౌంటర్ వేశాడు. అవి డాడీ అని పిలుస్తాయా అని వ్యంగ్యంగా అన్నాడు. 

Also Read: బిగ్ బాస్‌ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ

అప్పుడు ఆ విషయాన్ని సరదాగానే తీసుకున్నా హమీదా ఆ తర్వాత అవమానంగా ఫీలైంది. మిగతా హౌస్‌మేట్స్‌కు ఈ విషయాన్ని చెబుతూ సీన్ క్రియేట్ చేసింది. దీంతో జెస్సీ ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. దీన్ని కారణంగా చూపిస్తూ యాని మాస్టర్, విశ్వ అతడిని నామినేట్ చేశారు. నామినేషన్ల సమయంలో అంతా తనని టార్గెట్ చేసుకున్నారనే కారణంతో జెస్పీ కంటతడి పెట్టుకున్నాడు. ఇది అతడి మీద సింపథీ క్రియేట్ చేసింది. దీంతో అతడు బయటకు వెళ్తాడా లేదా అనేది అనుమానమే. అయితే, ఈ వారం సభ్యుల ప్రవర్తనపైనే ఎలిమినేషన్ ఆధారపడి ఉంటుంది. ఈ వారాంతంలో అంచనాలు తారుమారు అవుతాయి. ప్రస్తుతం నామినేషన్లలో యాంకర్ రవి, కాజల్, జెస్సీ, సరయు, హమీద, మానస్ ఉన్నారు. ఒక వేళ జెస్సీ ఈ వారం నామినేట్ అయితే.. బిగ్ బాస్ చరిత్రలో పిల్లి వల్ల నామినేట్ అయిన ఏకైక హౌస్‌మేట్‌గా జెస్సీ నిలిచిపోతాడు.

Tags: Bigg Boss Telugu season 5 Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు Hamida Hamida Cat Swetha Jassi Jassi Cat బిగ్ బాస్ తెలుగు

సంబంధిత కథనాలు

Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...

Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...

Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..

Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

The wrong swipe: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది

The wrong swipe: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది

Prabhas: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్.. 

Prabhas: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్.. 
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Foods for Cancer: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి

Foods for Cancer: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి

Weather Updates: అల్పపీడనంగా మారిన వాయుగుండం.. ఏపీలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు

Weather Updates: అల్పపీడనంగా మారిన వాయుగుండం.. ఏపీలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు

Spirituality: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..

Spirituality: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..

Gold-Silver Price: నేడు స్థిరంగా బంగారం ధర.. వెండి స్వల్పంగా పెరుగుదల.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..

Gold-Silver Price: నేడు స్థిరంగా బంగారం ధర.. వెండి స్వల్పంగా పెరుగుదల.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..