News
News
X

Big Boss 5 Votes: ఎంత పనిచేశావ్ హమీదా.. జస్సీకి ఎలిమినేషన్ గండం.. ప్రియాకు కెప్టెన్సీ ఛాన్స్ పాయే!

సీతాకోక చిలుక రెక్కలు ఆడించడం వల్ల ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో తుఫాన్ ఏర్పడినట్లు.. హమీదా వల్ల హౌస్ మేట్స్ చిక్కుల్లో పడుతున్నారు. ఇదిగో ఇలా..

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ హౌస్‌లో ఎంతమంది ఉన్నా.. బిగ్ బాస్ ఎపిసోడ్స్‌లో మాత్రం అందరి ఫోకస్ హమీదా మీదే పడుతోంది. ఇంట్లోకి అడుగు పెట్టిన రోజు నుంచి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఆమె వల్ల అనవరమైన గొడవలు జరుగుతున్నాయి. ఆమె వల్ల ఇప్పటికే జస్వంత్ పడాల (జస్సీ) నామినేషన్లోకి వెళ్లి చిక్కుల్లో పడ్డాడు. తాజాగా సీరియల్ నటి ప్రియాకు కూడా హమీద గండంలా మారింది. బిగ్ బాస్‌లో అత్యంత కీలకమైన ‘కెప్టెన్సీ’ పదవికే హమీదా ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. 

బిగ్ బాస్ హౌస్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ‘పవర్ హౌస్’ టాస్కులు ఇప్పటివరకు ఫన్నీగానే సాగాయి. విశ్వ, మానస్, సిరిలకు లభించిన టాస్కులు కాస్త వినోదాన్ని పంచాయి. విశ్వకు వచ్చిన టాస్కులో రవి, ప్రియ తమ దుస్తులను బిగ్ బాస్‌కు ఇచ్చేయడం.. రవి అమ్మాయిలా, ప్రియా అబ్బాయిలా దుస్తులు ధరించి వినోదాన్ని పంచారు. ఆ తర్వాత మానస్ పవర్ హౌస్ ద్వారా సంపాదించిన పవర్‌తో కాజల్‌కు టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులంతా నిద్రపోయిన తర్వాతే ఆమె నిద్రపోవాలి. కానీ, అది సీక్రెట్ టాస్క్ అని భావించిన ఇంటి సభ్యులు అతి తెలివి ప్రదర్శించి రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేశారు. దీంతో ఆ టాస్క్ పెద్దగా రక్తి కట్టించలేదు. అంతకు ముందు సిరికి లభించిన టాస్క్ కాస్త వినోదాన్ని పంచింది. షణ్ముఖ్ జస్వంత్ యజమానిగా, లోపో అతడికి సేవకుడిగా వినోదాన్ని పంచాడు. హౌస్‌లోని సభ్యులను ఇమిటేట్ చేస్తూ నవ్వించాడు. అయితే, ఈ రోజు టెలికాస్ట్ కాబోయే బిగ్ బాస్‌‌లో ‘పవర్ హౌస్’లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం హమీదాకు లభించింది. 

ఈ సందర్భంగా బిగ్ బాస్.. హమీదా నెత్తిన పెద్ద బాంబే వేశాడు. ఆమె ఎంపిక చేసే హౌస్‌మేట్ మరెప్పుడు.. కెప్టెన్ కాలేరనేది టాస్క్. ఈ నేపథ్యంలో ఆమె ఎవరిని ఎంపిక చేసుకుందనేది సస్పెన్స్. విస్వసనీయ సమాచారం ప్రకారం.. ఆమె హౌస్‌లో స్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరైన ప్రియాను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. అనే నిజమైతే.. ప్రియ ఈ సీజన్ మొత్తం కెప్టెన్ కాలేదు. అయితే, ఆమె రవిని ఎంపిక చేసుకుందనే సమాచారం కూడా వస్తోంది. అయితే, ఇవన్నీ ఎంతవరకు నిజమనేది ఈ రోజు ఎపిసోడ్‌ను చూస్తేనే తెలుస్తుంది. హమీదా వల్ల లహరీకి కూడా భవిష్యత్తులో తిప్పలు తప్పేలా లేవు. లహరీ తన ఫ్రస్ట్రేషన్ మొత్తం హమీదాపై చూపించింది. అయితే, హమీదా అమాయకమైన చూపులతో మిగతా హౌస్‌మేట్స్ వద్ద సింపథీ కొట్టేస్తోంది. ఫలితంగా వచ్చే వారం నామినేషన్లలో లహరీ పేరు ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. 

అయితే.. హమీదా వల్ల బలి పసువు కాబోతున్న మరో హౌస్ ‌మేట్ జస్సీ అనే చెప్పుకోవాలి. ఆమె పిల్లి తనని అమ్మా అంటుందని జస్సీకి చెప్పడం, అతడు మీ ఇంట్లో కుక్కలు నిన్ను డాడీ అంటాయా అని కౌంటర్ ఇవ్వడం.. దీన్ని సీరియస్‌గా తీసుకుని మిగతా ఇంటి సభ్యులకు ఆ విషయం చెప్పుకుని బాధపడటం.. చివరికి నామినేషన్లలో ఆ విషయాన్ని హైలెట్ చేస్తూ జస్సీని నామినేట్ చేయడం జరిగిపోయింది. పోనీ.. ఈ వారం అతడు మంచితనంలో ఎలిమేనేషన్ నుంచి తప్పించుకుంటాడని భావించినా.. అందుకు అవకాశాలు లేవని తేలిపోయింది. తాజాగా యానీ మాస్టర్‌తో గొడవపడటం, ఏడుస్తూ ఆమెను క్షమాపణలు కోరడం ప్రేక్షకులకు ఎక్కలేదు. దీంతో అతడిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పలు పోల్స్‌లో కూడా ఇదే స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఎలిమినేషన్‌లో ఉన్న రవి, సరయు, జస్సి, ఆర్జే కాజల్, హమీద, మానస్‌లలో బయటకు వెళ్లిపోయే ఛాన్స్ జస్సీకే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కాజల్, రవి, మానస్‌లకు ప్రేక్షకుల సపోర్ట్ బాగానే ఉంది. జస్సీని లక్ వరిస్తే.. అతడి తర్వాత బయటకు వెళ్లిపోయే ఛాన్సులు హమీదాకే ఉన్నాయి. ఆ తర్వాత సరయు ఉంది. కానీ, అత్యధిక పోల్స్.. జస్సీనే బయటకు వెళ్తాడని చెబుతున్నాయి. మరి, ఎవరు బయటకు వెళ్తారో తెలియాలంటే.. ఆదివారం వరకు ఆగాల్సిందే. 

Also Read: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!

Also Read: బిగ్ బాస్‌ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ 

Also Read: ముఖం పగిలిపోద్ది.. లోబోకి సిరి వార్నింగ్.. ఏడ్చేసిన ఆర్జే కాజల్.. 

Published at : 09 Sep 2021 05:24 PM (IST) Tags: Sarayu Hamida Ravi manas Jassi Priya Bigg Boss 5 Telugu Voting బిగ్ బాస్ 5 ఓటింగ్ హమీద Bigg Boss 5 Telugu Elimination

సంబంధిత కథనాలు

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?