Bigg Boss 5 Telugu : ముఖం పగిలిపోద్ది.. లోబోకి సిరి వార్నింగ్.. ఏడ్చేసిన ఆర్జే కాజల్..
రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 5 మొదలైన సంగతి తెలిసిందే. అయితే ప్రతి రోజు ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేసి మంచి హైప్ ను తీసుకొస్తుంటారు.

రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 5 మొదలైన సంగతి తెలిసిందే. అయితే ప్రతి రోజు ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేసి మంచి హైప్ ను తీసుకొస్తుంటారు. అయితే ఒక్కోసారి ప్రోమోలో చూపించినంత విషయం ఎపిసోడ్ లో కనిపించదు. కానీ తాజా ప్రోమో చూస్తుంటే మాత్రం ఈరోజు ఎపిసోడ్ లో రచ్చ మాములుగా లేదనిపిస్తుంది. సిరికి లోబోకి ఏదో మిస్ కమ్యూనికేషన్ జరిగినట్లు ఉంది. దీంతో సిరి వెళ్లి వేరే హౌస్ మేట్స్ కి జరిగిన విషయం చెప్పబోతుండగా.. లోబో వచ్చి ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే నాతో చెప్పు వేరే వాళ్లతో కాదని అనగా.. సిరి పట్టించుకోకుండా వెళ్లిపోయింది.
Also Read : Bigg Boss Telugu 5 : బట్టలు లాకెళ్లిన బిగ్ బాస్.. అమ్మాయి డ్రెస్ లో రవి అరాచకం..
దీంతో హర్ట్ అయిన లోబో ఏవేవో మాటలంటూ.. 'ముఖం చూస్కో అద్దంలో' అని డైలాగ్ వేశాడు. దానికి సిరి రియాక్ట్ అవుతూ.. 'ముఖం గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది' అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో లోబో మరింత రెచ్చిపోయాడు. 'నువ్ నా ముందు చిన్న చెటాక్ అంత ఉన్నావ్' అంటూ తన భాషలో ఏవో కౌంటర్లు ఇచ్చాడు.
Also Read : Pan India Movies : దిల్ రాజు ప్లానింగ్.. నెక్స్ట్ రెండు నెలల్లో రచ్చ రచ్చే..
అనంతరం ఆర్జే కాజల్ ఏదో విషయం గురించి మాట్లాడుతుండగా.. 'మీరెందుకు అంత హైపర్ అవుతున్నారు.. నాకసలు అర్ధం కావడం లేదని' లహరి అంది. అక్కడితో ఆగకుండా.. 'డోంట్ క్రియేట్ కంటెంట్ ఆల్వేస్.. ఓకే.. మీరొక పెర్సన్ ను ఎటాక్ చేస్తున్నారు' అంటూ కాజల్ పై ఫైర్ అయింది. దీంతో కాజల్ ఏడ్చుకుంటూ అక్కడ నుండి దూరంగా వెళ్లిపోయింది. ఆమెని మానస్ ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తుండగా.. 'నా కూతురు చూస్తే ఏడుస్తాది' అంటూ కాజల్ తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
#5MuchDrama between #Lobo & #Siri also between #Kajal & #Lahari ... Let's wait & watch#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa#FiveMuchFun pic.twitter.com/pp4PDcmHGl
— starmaa (@StarMaa) September 7, 2021
Also Read: బిగ్ బాస్ హౌస్లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!
Also Read: బిగ్ బాస్ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
ట్రెండింగ్ వార్తలు





















