Ram Charan Watch: రామ్ చరణ్ పెట్టుకున్న ఈ వాచ్ దొరికితే కోటీశ్వరులు కావచ్చు.. ధర ఎంతో తెలుసా?
ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న శంకర్ సినిమా కంటే.. అతడు పెట్టుకున్న వాచ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇంతకీ దాని ప్రత్యేకత ఏమిటీ?
మీకు గుర్తుందా? కొన్నేళ్ల కిందట జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ గురించి పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు హీరో రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెర్రీ చేతికి ఉన్న ఆ వాచ్ దొరికితే చాలు.. కోటీశ్వరులం అయిపోవచ్చుని నెటిజనులు అంటున్నారు. ఇంతకీ చరణ్ చేతికి ఉన్న ఆ వాచ్ అంత ఖరీదైనదా.. అందరి చూపూ ఇప్పుడు ఆ వాచ్ మీదే ఎందుకు పడింది? ఇంతకీ దాని ధర ఎంత?
సెలబ్రిటీలు ఏం చేసినా.. ఏం ధరించినా వార్తే. బుధవారం రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో ‘RC 15’ చిత్రీకరణ మొదలైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిరంజీవితోపాటు దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కూడా హాజరయ్యాడు. చిరంజీవి మొదటి షాట్‌ను క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ నటిస్తోంది.
అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో అందరి చూపు రామ్ చరణ్ మీద కాకుండా అతడు పెట్టుకున్న వాచ్ మీద పడింది. ఎందుకంటే అది సాదాసీదా వాచ్ కాదు. రిచర్డ్ మిల్లె RM 61-01 యోహన్ బ్లేక్ మోడల్ వాచ్ అది. ఆ వాచ్‌ను అలా చూశారో లేదో.. చరణ్ అభిమానులు గూగుల్‌లో దాని ధర తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. మొత్తానికి దాని దాని రేటును వెతికి పట్టుకున్నారు. ఆ తర్వాత గుండె పట్టుకున్నారు. ఎందుకంటే.. ఆ వాచ్ ధర రూ.1.02 కోట్లు. ఔనండి.. మీరు చదివింది కరెక్టే.. అక్షరాల రూ.కోటి చిల్లరన్నమాట.
ఒలంపిక్స్‌లో ఫాస్టెస్ రన్నర్‌గా పేరొందిన యొహాన్ బ్లెక్ కోసం రిచర్డ్ మిల్లే కంపెనీ ఈ వాచ్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసిందట. అప్పటి నుంచి సంపన్నులు ఈ వాచ్‌ను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. అందుకే.. చరణ్ చేతికి ఆ వాచ్‌ను చూడగానే నెటిజనులు దాని గురించి సెర్చ్ చేశారు. బ్లాక్ కలర్ బెల్ట్, గ్రీన్, యెల్లో డైల్ కలర్స్‌తో భలే ఆకర్షనీయంగా ఈ వాచ్ ఉంటుంది. అయితే, గతంలో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ దీని కంటే ఖరీదైనది.
Also Read: బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్.. సరయు vs కాజల్.. కొట్టుకొనేలా ఉన్నారే. తొలి కెప్టెన్ అమ్మాయే!
2018 డిసెంబరు, 20న రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లికి హాజరైన ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ అప్పట్లో వైరల్‌గా మారింది. దాని గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. అది కూడా రిచర్డ్ మిల్లే మెక్లారెన్ కంపెనీకి చెందిన వాచ్ కావడం గమనార్హం. ఈ వాచ్‌ను ఎఫ్-1 రేస్‌లో పాల్గొనే క్రీడాకారులు ఎక్కువగా ధరిస్తారట. ఆ వాచ్ విలువ రూ.2.27 కోట్లు ఉన్నట్లు ఆన్లైన్ సెర్చ్‌లో తేలింది. ఈ వాచ్‌లో టైటానియంతో తయారుచేసిన డయల్ ఉంటుంది. రబ్బర్ స్ట్రాప్ కలిగిన ఈ వాచ్ కేస్‌ను కార్బన్ టీపీటీ మిశ్రమంతో రూపొందించారు. వివిధ దేశాల కాలాన్ని ఈ వాచ్‌లో ఒకేసారి చూడొచ్చట. మొత్తానికి RRR స్టార్లు ఇద్దరు తమ ఖరీదైన వాచ్‌లతో అబ్బో అనిపిస్తున్నారు.
Also Read: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!
Also Read: బిగ్ బాస్ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ
Also Read: ముఖం పగిలిపోద్ది.. లోబోకి సిరి వార్నింగ్.. ఏడ్చేసిన ఆర్జే కాజల్..