Bigg Boss 5 Telugu Promo: బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్.. సరయు vs కాజల్.. కొట్టుకొనేలా ఉన్నారే. తొలి కెప్టెన్ అమ్మాయే!
ఈ వారం కెప్టెన్ అయ్యేది ఎవరు? కాజల్.. సరయు ఎవరి వైపు? ఆ ఇద్దరు ఎందుకు గొడవ పడ్డారు?
ఈ రోజు (గురువారం) 5వ ఎపిసోడ్‌లో సైకిలింగ్ టాస్క్‌తో బిగ్ బాస్.. హౌస్‌మేట్స్ మధ్య పుల్లలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హౌస్‌మేట్స్ మధ్య వాడీవేడీ వార్ నెలకొంది. ప్రోమో ప్రకారం.. ఆర్జీ కాజల్, యూట్యూబ్ స్టార్ సరయు మధ్య వాగ్వాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సరయు కన్నీళ్లు పెట్టుకోవడం.. మిగతా సభ్యులు ఆమెను ఓదార్జడాన్ని చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఒక ఎపిసోడ్‌లో ఆడియాన్స్‌కు డబుల్ మజా లభించే అవకాశాలు ఉన్నాయి. ఒకటి.. హమీదా పేల్చనున్న ‘కెప్టెన్సీ బాంబ్’, ఇంకొకటి ఈ సైకిల్ టాస్క్. ఇది కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ పెట్టిన టాస్క్. పవర్ హౌస్‌లోకి వెళ్లిన విశ్వ, సిరి, మానస్, హమీదాలకు కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొనే అవకాశం లభించింది.
కొన్ని గంటల కిందట విడుదల చేసిన ప్రోమో ప్రకారం.. ‘శక్తి చూపరా ఢింబకా’ పవర్ రూమ్ టాస్క్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా హమీదాకు ఎంట్రీ ఇచ్చే అవకాశం లభించింది. లోపలకు వెళ్లిన ఆమెని బిగ్ బాస్ ఒకరి పేరు చెప్పమన్నారు. ఆ ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పటికీ కెప్టెన్ కాలేరని చెప్పారు. దీంతో హమీద ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ నాటకీయపరిణామంలో హమీద ఎవర్ని ఎంచుకుంటుంది అనేది వ్యూవర్స్ లో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే.. హమీదా ఇందుకు ప్రియాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. ఈ సిజన్లో ప్రియకు కెప్టెన్ అయ్యే అవకాశమే ఉండదు. దానివల్ల ఆమెకు ఇమ్యునిటీ కూడా లభించకపోవచ్చు.
Also Read: ఎంత పనిచేశావ్ హమీదా.. జస్సీకి ఎలిమినేషన్ గండం.. ప్రియాకు కెప్టెన్సీ ఛాన్స్ పాయే!
ఇక తాజాగా కెప్టెన్సీ టాస్క్‌లో హౌస్ మేట్స్ గ్రూపులుగా విడిపోయినట్లు తెలుస్తోంది. తమకు నచ్చిన హౌస్‌మేట్ కెప్టెన్‌గా ఎంపికయ్యేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు ప్రోమోలో తెలుస్తోంది. ఈ సందర్భంగా కాజల్, సరయు మధ్య వాగ్వాదం నెలకొన్నట్లు ప్రోమోలో చూపించారు. అలాగే.. యాంకర్ రవి, సన్నీ మధ్య కూడా మాటల యుద్ధం జరిగుతున్నట్లు చూపించారు. అయితే, ప్రోమోకు.. ఒరిజినల్ ఎపిసోడ్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అసలు ఏం జరిగిందనేది 5వ ఎపిసోడ్ ప్రసారమైన తర్వాతే తెలుస్తోంది. ఈ పోటీలో విశ్వ, హమీద, మానస్‌లను ఓడించి సిరి కెప్టెన్‌గా ఎంపికైనట్లు సమాచారం.
బిగ్ బాస్ ఎపిసోడ్ 5 ప్రోమో:
Also Read: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!
Also Read: బిగ్ బాస్ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ
Also Read: ముఖం పగిలిపోద్ది.. లోబోకి సిరి వార్నింగ్.. ఏడ్చేసిన ఆర్జే కాజల్..