అన్వేషించండి

Sangareddy News: సంగారెడ్డి జిల్లాలో దారుణం - చోరీ చేస్తుంటే పట్టించాడని బాలుడి హత్య, అనంతరం నిందితుడి ఆత్మహత్య

Telangana News: తాను చోరీ చేస్తుంటే పట్టించాడని ఓ బాలుడిని దారుణంగా హతమార్చిన నిందితుడు అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Man Forceful Death After Killing Boy Who Cuaght him While Stealing: తాను దొంగతనం చేస్తుండగా పట్టించాడని బాలుడిని  పగతో హతమార్చిన వ్యక్తి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందు తానే బాలుడిని చంపినట్లు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ (Andole) మండలం జోగిపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం పరిధిలోని జోగిపేటకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఓ దుకాణంలో కేబుల్ వైర్లు దొంగతనం చేస్తుండగా శేఖర్ (13) అనే బాలుడు చూసి స్థానికులకు పట్టించాడు. ఈ క్రమంలో బాలుడిపై పగ పెంచుకున్న నాగరాజు శనివారం రాత్రి మాట్లాడాలని బాలుడినీ తీసుకెళ్లి హత్య చేసి బావిలో పడేశాడు. అనంతరం ఆదివారం ఉదయం పోలీసులకు ఫోన్ చేసి తానే బాలుడిని చంపినట్లు చెప్పాడు. డబ్బులు అడిగితే ఇవ్వలేదని శనివారం రాత్రి ఓ వ్యాపారిపైనా కత్తితో దాడికి పాల్పడ్డాడు.

నిందితుడి ఆత్మహత్య

నాగరాజును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆదివారం ఉదయం గ్రామానికి వెళ్లగా భయపడి సెల్ టవర్ ఎక్కాడు. ఈ క్రమంలోనే ఇద్దరిపై కత్తితో దాడి కూడా చేశాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో బాలుడు శేఖర్ (13) మృతదేహాన్ని బావిలో నుంచి పోలీసులు బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సెల్ టవర్ ఎక్కిన నాగరాజు ఉదయం నుంచీ అక్కడే ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా ఉండడంతో డ్రోన్ కెమెరాతో అతని కదలికలను గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడు కేబుల్ వైర్లతో ఉరేసుకుని వేలాడుతున్న దృశ్యం కనిపించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. కాగా, నాగరాజుపై గతంలో చాలా కేసులు ఉన్నాయి. వ్యాపారులు, దుకాణదారులపై దాడులకు పాల్పడుతూ డబ్బులు తీసుకునేవాడని స్థానికులు చెబుతున్నారు.

Also Read: Hyderabad News: షాకింగ్ ఘటన - రిమాండ్ ఖైదీ కడుపులో మేకులు, శ్రమించి బయటకు తీసిన వైద్యులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Delimitation JAC Meeting in Chennai:మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Delimitation JAC Meeting in Chennai:మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో  తీర్మానించిన పార్టీలు 
KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
Stalin On Delimitation:  జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను అడ్డుకుందాం, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను అడ్డుకుందాం, దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలని స్టాలిన్ పిలుపు
Grama Palana officers: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
Sharmila on Delimitation:  సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
సొమ్ము సౌత్ ది.. సోకు నార్త్ ది, డీలిమిటేషన్ అన్యాయంపై చంద్రబాబు, జగన్ నోరు విప్పాలి: షర్మిల
KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Embed widget