Warangal Crime: వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి, భర్తపై బంధువుల అనుమానాలు!
వరంగల్ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇది కచ్చితంగా భర్త పనేనంటూ ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Warangal Women constable suicide: వరంగల్ పట్టణంలో ఓ మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మౌనిక మహబూబాబాద్‌లో రైటర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ లోని తన నివాసంలో శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కానిస్టేబుల్ మౌనిక కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుందని, ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు.
కేసు నమోదు చేసి మౌనిక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబుసభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. ఆమె తరఫు వారు మృతురాలు మౌనిక భర్త శ్రీధర్ పై అనుమానం వ్యక్తం చేశారు. భర్త వల్లే ఆమె చనిపోయిందని ఆరోపిస్తున్నారు. మౌనికది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యే అయి ఉంటుందని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మౌనిక ఇంటికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.