అన్వేషించండి
Crime News: విజయవాడలో విషాదం, బెంజ్ సర్కిల్‌లో కరెంట్ షాక్‌తో ముగ్గురి మృతి
Andhra Pradesh News | విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలో శనివారం (మే 24న) ఉదయం విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ కొట్టడంతో ముగ్గురు మృతిచెందారు.

విజయవాడలో విషాదం, బెంజ్ సర్కిల్‌లో కరెంట్ షాక్‌తో ముగ్గురి మృతి
Vijayawada Crime News: విజయవాడ: విజయవాడలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. నగరంలోని బెంజ్ సర్కిల్ సమీపంలోని ఓ బిల్డింగ్‌లో కరెంట్ షాక్ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఒకరికి కరెంట్ షాక్ కొట్టడంతో కాపాడబోయి మిగతావారు సైతం విద్యుదాఘాతానికి గురయ్యారా.. లేక ముగ్గురికి అనుకోకుండా విద్యుత్ తీగలు తగలడంతో ప్రాణాలు కోల్పోయారా తెలియాల్సి ఉంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుల్లో ఒకరి పేరు ముత్యాలమ్మ అని పోలీసులు గుర్తించారు. ముగ్గురు చనిపోయిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్






















