Kodali Nani: లుకౌట్ నోటీసుల ఎఫెక్ట్, హార్ట్ సర్జరీ తరువాత బయటకొచ్చిన కొడాలి నాని..
Kodali Nani Lookout Notice| ముంబైలో హార్ట్ సర్జరీ అనంతరం ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తొలిసారి బయటికి వచ్చారు. హైదరాబాదులో ఓ ఫంక్షన్కు హాజరయ్యారు.హాజరయ్యారు

YSRCP leader Kodali Nani in Hyderabad, అమరావతి: కొన్ని నెలల కిందట ముంబైలో గుండె ఆపరేషన్ చేపించుకున్న తరువాత ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తొలిసారి బయటికొచ్చారు. YSRCP నేత కొడాలి నానికి ఇటీవల ముంబైలో హార్ట్ సర్జరీ జరిగింది. అనంతరం ఆయన ఎక్కడా కనిపించలేదు. హైదరాబాద్ లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి కొడాలి నాని హాజరయ్యారు. దేశం విడిచి వెళ్తున్నారని లుక్ అవుట్ నోటిసులు జారీ చేసిన సమయంలో కొడాలి నాని హఠాత్తుగా ఓ వివాహ వేడుకలో కనిపించారు.
కొడాలి నానిపై కేంద్రం లుక్ ఔట్ నోటీసులు
అమరావతి: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ లుకౌట్ నోటీసులు (Lookout Notice) జారీ చేసింది. దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో కొడాలి నానిపై పూర్తి స్థాయి నిఘా పెట్టాలనీ లుక్ ఔట్ నోటీసులలో పేర్కొన్నారు. కొడాలి నానిపై పలు కేసులు నమోదు కావడం, ఆ కేసుల విచారణ పెండింగ్ ఉన్నందున ఈమేరకు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. వివిధ కేసుల్లోని నిందితులు దేశం విడిచి వెళ్ళిపోయే అవకాశం ఉందని భావిస్తే, కేంద్ర హోం శాఖ ఈ తరహాలో లుకౌట్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే.






















