అన్వేషించండి

Gajwel Hit and Run Case: గజ్వేల్ లో విషాదం - హిట్ అండ్ రన్ ఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు మృతి

Gajwel Hit and Run Case : గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు జరిగింది. గుర్తుతెలియని వాహనం ఒకటి ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.

Gajwel Accident : మనల్ని  24 గంటలూ రక్షిస్తున్న పోలీసుల ప్రాణాలు తీశారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో హిట్ అండ్ రన్ ఘటన చూపరులకు కంటతడి పెట్టిస్తోంది. గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు జరిగింది. వాహనం ఢీకొన్న కొన్ని నిమిషాల్లోనే కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. 

స్పాడ్ డెడ్

వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు జరిగింది. గుర్తుతెలియని వాహనం ఒకటి ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను పరంధాములు(43), పూస వేంకటేశ్వర్లు(42) గా పోలీసులు గుర్తించారు. పరంధాములు సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్‌ లో విధులు నిర్వహిస్తుండగా.. దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌ లో పూస వేంకటేశ్వర్లు కానిస్టేబుల్‌‎గా పని చేస్తున్నారు. జాలిగామ బైపాస్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్‌ ను ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఇరువురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, అనుమానిత వాహనం, దానిని నడిపింది ఎవరన్న వివరాలు తెలియాల్సి ఉంది.  

Also Read : Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి

సీసీటీవీలో నమోదు

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మరణించిన వారి వివరాలను సేకరించారు. మృతి చెందిన వారిని పోలీస్ కానిస్టేబుళ్లు వెంకటేష్, పరంధాములుగా వారు గుర్తించారు. మృతులది సిద్దిపేట జిల్లా పెద్దాకోడూరు, గాడిచర్లపల్లి గ్రామమని తెలిపారు. దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. ఇక ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  సీసీ ఫుటేజీ సహాయంతో కానిస్టేబుళ్ల బైక్‎ను ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.  అయితే.. ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి చెందడంతో.. వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 మారథాన్ లో పాల్గొనాల్సి ఉండడంతో.. 
మృతులు పరంధాములు, పూస వేంకటేశ్వర్లు ఈసీఎల్‌ లో జరుగుతున్న మారథాన్ లో ఈ ఇద్దరు పాల్గొనాల్సి ఉంది. అక్కడ నిర్వహిస్తున్న రన్నింగ్‌‎లో వీళ్లు ఇద్దరూ పాల్గొనేందుకు బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.   

పోలీస్ కానిస్టేబుల్స్ మృతి పట్ల హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి

సిద్దిపేటకు చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ పరందాములు (పెద్దకోడూరు), వెంకటేశ్వర్లు (గాడి చెర్ల పల్లి)  రోడ్డు ప్రమాదం లో మృతి చెందడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి మృతిపట్ల సంతాపం తెలిపారు. పోలీస్ ఉద్యోగం లో నిబద్దత కలిగిన యువ కానిస్టేబుల్స్ మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్స్ ఉద్యోగులుగా కాకుండా సామాజిక సేవకులుగా, వీరు యువతలో ఎంతో స్ఫూర్తి నిచ్చారని పేర్కొన్నారు. సిద్దిపేటలో జరిగిన హాఫ్ మారథాన్ లో పాల్గొని ఎంతో చైతన్యం తెచ్చారని, ఇతర సామాజిక సేవల్లో వారు అందించిన సేవలను కొనియాడారు. సమాజానికి సేవ చేస్తున్న కానిస్టేబుల్స్ ఇత చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానాని, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read : Road Accident: అడుగు దూరంలో నిలిచి అందనంత దూరానికి - చిన్నారి ఉసురు తీసిన లారీ, తెలంగాణలో తీవ్ర విషాద ఘటన

 

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget