అన్వేషించండి

Rash Driving: హైదరాబాద్ లో కారు బీభత్సం, ముగ్గురికి తీవ్రగాయాలు

Car Rash Driving: హైదరాబాద్‌లోని  జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. రెండు ద్విచక్రవాహనాలపైకి  స్పోర్ట్స్‌ కారు దూసుకెళ్లడంతో పలువురు గాయపడ్డారు.

Rash Driving Case : హైదరాబాద్‌ లోని  జూబ్లీహిల్స్‌ (Jubilee Hills ) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. రెండు ద్విచక్రవాహనాలపైకి  స్పోర్ట్స్‌ కారు (Sports Car) దూసుకెళ్లడంతో పలువురు గాయపడ్డారు.  అన్నా చెల్లితో పాటు, మరో వాహనదారుడు తీవ్ర గాయాల పాలయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు...క్షతగాత్రులను మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత నిందితుడు కారు ఆపకుండానే స్పీడ్ గా వెళ్లిపోయాడు. సీసీ ఫుటేజ్ ద్వారా కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ పంజాగుట్టలో...
రెండ్రోజుల క్రితం హైదరాబాద్ పంజాగుట్టలో ఓ వ్యక్తి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అడ్డు వచ్చిన వారిని ఢీకొట్టాడు. స్థానికులు కారును అడ్డగించి...డ్రైవర్ కు  దేహశుద్ధి చేశారు. వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో పాదచారులపైకి దూసుకెళ్లింది. స్మార్ట్ బజార్‌కి ఎదురుగా ఉన్న పంజాగుట్ట జంక్షన్‌లో  కొంత దూరం వరకు తన కారు బానెట్‌పై యువకుడ్ని ఈడ్చుకెళ్లాడు. కారును ఆపడానికి స్థానికులు ప్రయత్నించినా...ఆపకుండా వెళ్లిపోయాడు. ఎట్టకేలకు డ్రైవర్‌ను ప్రజలు అడ్డుకుని చితకబాదారు. నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో గాయాల పాలయ్యాడు. పంజాగుట్ట పోలీసులు సుమోటోగా స్వీకరించి, ప్రాణాలకు హాని కలిగించేలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, నంబర్ ప్లేట్ తారుమారు చేసినందుకు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. ఓ కారు బైక్ ను బలంగా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్యే కాలనీలో కారు బీభత్సం

మరోవైపు ఎమ్మెల్యే కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్‌కు చెందిన లైఫ్‌స్పాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఓనర్...రామ్‌ నరేంద్ర బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12లో ఓ ఆస్పత్రికి వెళ్లారు. కారు డ్రైవర్‌ శ్రీనివాసులు...యజమానిని ఆస్పత్రి వద్ద దింపాడు. ఆస్పత్రి వద్ద పార్కింగ్‌ లేకపోవడంతో సమీపంలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ దగ్గర రోడ్డుపక్కన కారును పార్కింగ్ చేశారు. కారులోపలే డ్రైవర్ కూర్చున్నాడు. ఇంతలో అతివేగంతో వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో శ్రీనివాసులుకు గాయమైంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి అరెస్ట్ చేశారు. ఆ కారు వికారాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ గా పోలీసులు గుర్తించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget