Viral News: దారి తప్పిన బ్యాండేజ్ శృంగారం - ఊపిరాడక భార్య మృతి - భర్త కావాలని చేశాడా ?
Tamil Nadu: తమిళనాడులోని ఓ వ్యక్తి బ్యాండేజ్ శృంగారానికి ప్రయత్నించి భార్య మరణానికి కారణం అయ్యాడు.ఈ ఘటన కలకలం రేపుతోంది.

Wife death: తమిళనాడులోని హోసూర్‌లో జరిగిన శశికళ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అందరూ భర్తే చంపేశాడని అనుకున్నారు. కానీ ఆ భర్త మాత్రం తాను చంపలేదు కానీ ఆమె ఎలా చనిపోయిందో చెప్పాడు. దాంతో అందరూ ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది.
తమిళనాడులోని హోసూర్ కు చెందిన భాస్కర్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు జిమ్‌లను నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య శశికళ కూడా జిమ్ ట్రైనరే. మహిళల కోసం ప్రత్యేకంగా జిమ్ నిర్వహిస్తున్నారు. గతంలో బెంగళూరులో ఒక ప్లే స్కూల్‌ను నడిపేవారు ..భాస్కర్ తో ప్రేమ వివాహం తర్వాత హోసూర్ వచ్చారు. 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారిద్దరూ ఆనందంగానే ఉండేవారు. అయితే ఏప్రిల్ 30, 2025 రాత్రి శశికళ అనుమానా స్థితిలో చనిపోయింది. పోలీసులు భాస్కర్ ను అనుమానించారు. కానీ భాస్కర్ మాత్రం తాను ఏం చేయలేదని.. జరిగిందేమిటో చెప్పాడు.
తామిద్దరం రాత్రి మద్యం సేవించి శృంగారానికి ప్రయత్నించామన్నారు. వినూత్నంగా బ్యాండేజ్ శృంగారానికి ప్రయత్నించామని తెలిపారు. ససికల ముక్కు నుంచి రక్తస్రావం అయిందని, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని భాస్కర్ పేర్కొన్నాడు.వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లానని అప్పటికే చనిపోయిందని తెలిపాడు. బ్యాండేజ్ శృంగారం అంటే.. మంచానికి కాళ్లు చేతులు కట్టేసి శృంగారం చేయడం. ఆ సమయంలో గొంతుకు చీర చుట్టుకోవడం.. దాన్ని పట్టించుకోకుండా.. భాస్కర్ శృంగారం చేయడంతో ఆమె చనిపోయిందని చెబుతున్నారు.
అయితే శశికళ కుటుంబం మాత్రం భాస్కర్ వాదనను తోసిపుచ్చుతోంది. ఇది ఇది ప్రమాదం కాదని, హత్య అని అంటున్నారు. భాస్కర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ, ఆమె మరణానికి సంబంధించి పూర్తి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. హోసూర్ పోలీసులు భాస్కర్‌ను అరెస్టు చేశారు . హత్య కేసు నమోదు చేశారు. శవపరీక్ష నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు, ఇది మరణానికి ఖచ్చితమైన కారణాన్ని వెల్లడి అయితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే భాస్కర్ చెబుతున్న దాంట్లోనూ చాలా తేడాలు ఉండటంతో పోలీసులు ఇతర కోణాల్లోనూ కేసును పరిశీలిస్తున్నారు.
సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత అనేక చర్చా ఫోరమ్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత శృంగారాన్ని కొత్త పద్దతుల్లో ఎలా అస్వాదించాలన్న దానిపై యువతరం ఆసక్తి చూపుతోంది. కొత్త కొత్త పద్దుతుల్లో ప్రయత్నిస్తున్నారు.. అయితే చాలా సందర్భాల్లో ఇది అసహజ శృంగారంగా మారుతోంది. దీని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అసహజ శృంగారం కోసం .. సామర్థ్యం కోసం మందులు వాడటం కూడా అప్పుడప్పుడు మరణాలు సంభవిస్తున్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో వెలుగు చూసింది బ్యాండేజ్ శృంగారం వ్యవహారం. ఇలాంటివి బయట చర్చించుకోరు కానీ.. ప్రమాదాలు జరిగినప్పుడు చర్చల్లోకి వస్తాయి. అందుకే ఎవరూ ఇలాంటి అసహజ శృంగారాలను ప్రయత్నించకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది.





















