అన్వేషించండి

Hyderabad Crime News: ఆన్ లైన్ ఆపరేషన్ చేసిన డాక్టర్ - కవల పిల్లలు మృతి - ఎలాంటి శిక్ష వేయాలి?

Twins : హైదరాబాద్ లో వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా కవలలు చనిపోయారు. వాట్సాప్ ద్వారా సూచనలు ఇస్తూ నర్సులతో ఆపరేషన్ చేయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

Hyderabad WhatsApp Doctor:  ఆమె బిడ్డల్ని నవమాసాలు మోసింది. కడుపులో కవల పిల్లలు ఉన్నారని.. వారిని రెండు చేతుల్తో ఎత్తుకునే క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంది. కాన్పు కోసం ఎప్పుడూ తాను చూపించుకునే ఆస్పత్రికే వెళ్లింది. నొప్పులు వస్తూండటంతో  అడ్మిట్ అయింది. అయితే డాక్టర్ లేడు. ఆ డాక్టర్ కు వచ్చే ఉద్దేశం కూడా లేదు. అలాంటప్పుడు వేరే ఆస్పత్రికి అయినా రిఫర్ చేయాలి లేదా..అందుబాటులో ఉన్న నిపుణుడైన వైద్యుడిని అయినా వచ్చేలా చేయాలి. కానీ ఆ డాక్టర్ కక్కుర్తి పడ్డారు. వాట్సాప్ లో ఆపరేషన్ చేశారు. ఇది వికటిచింది. ఫలితంగా ఆ తల్లి గర్భంలో ఉన్న కవలలు భూమి మీదకు రాకుండానే కన్నుమూశారు. ఈ ఘోరం హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నంలో జరిగింది.        

ఇబ్రహీంపట్నం విజయలక్ష్మి ఆస్పత్రిలో దారుణం        

ఇబ్రహీంపట్నంలో విజయలక్ష్మి ఆస్పత్రి ఉంది. అందులో అన్ని విభాగాలకూ వైద్యం చేసే డాక్టర్ ఉన్నారు. ఆయన జనరల్ ఫిజిషియన్ అయినప్పటికీ అన్నీ వైద్యాలూ చేస్తున్నారు. తన ఆస్పత్రిలో  కాన్పులకూ ఏర్పాట్లు చేశారు. కన్సల్టెంట్ డాక్టర్లు ఉన్నారని బోర్జులు పెట్టుకున్నారు కానీ ఎవరు వస్తారో.. ఎవరు రారో రోగులకు తెలియదు. కాస్త దగ్గరగా ఉంటుందని ఆ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకున్న ఓ గర్భిణి మహిళ.. కాన్పు కోసం అక్కడే చేరడం పెను విషాదానికి దారి తీసింది.      

వాట్సాప్ కాల్ చేసి.. నర్సులతో ఆపరేషన్ చేయించిన వైద్యుడు                        

కడుపులో కవల పిల్లలు ఉండటంతో హఠాత్తుగా ఆమెకు నొప్పులు వచ్చాయి. అప్పటికే కాన్పు సమయం దగ్గర పడుతూండటం, నొప్పులు పెరగడంతో కుటచుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అక్కడి నర్సులు డాక్టర్ కు సమాచారం ఇచ్చారు. ఉన్న పళంగా అయితే తాను రాలేనని కానీ తాను చెప్పినట్లుగా చేయాలని నర్సులకు చెప్పారు. నర్సులు ఆమెను ఆపరేషన్ ధియేటర్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ చెప్పినట్లుగా పొట్టకోసి ఆపరేషన్ చేశారు. అయితే వైద్యం అంటే.. అదీ ఆపరేషన్ అంటే.. వాట్సా ప్ లో చేయడం సాధ్యం కాదు. చిన్న తప్పు జరిగినా ప్రాణాలు పోతాయి. అదే జరిగింది. తప్పు జరిగిపోయింది. ఆ కవలలు ఇద్దరూ చనిపోయారు.           

ఆస్పత్రి సీజ్ చేసిన అధికారులు           

ఈ తల్లి తన బిడ్డల్ని కోల్పోవడంతో తీవ్రంగా ఆవేదన చెందింది. చివరికి ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో కలకలం రేగింది. డీఎంహెచ్‌వో ఆస్పత్రిలో విచారణ చేశారు. చివరికి నిజంగానే ఆ డాక్టర్ వాట్సాప్ వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాడని నర్సులకు కొంత ట్రైనింగ్ ఇచ్చి వాట్సాప్ లో ఆపరేషన్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని తేలింది. దాంతో ఆ ఆస్పత్రిని సీజ్ చేశారు. డాక్టర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget