అన్వేషించండి

Tadepalligudem News : మనిషి కాదు మృగం, కూతుళ్లపై కిరాతక తండ్రి దాడి!

Tadepalligudem News : మద్యం మత్తులో ఓ తండ్రి మృగంలా మారిపోయాడు. కన్న కూతుళ్లను అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేశాడు. ఆ వీడియోలను కువైట్ లోని భార్యకు పంపాడు.

Tadepalligudem News : పశ్చిమగోదావరి జిల్లా  పెంటపాడు ఎస్సీ కాలనీలో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో కన్న కూతుళ్లను హత్య చేయడానికి ప్రయత్నించాడో గంజి కసాయి తండ్రి. గంజి దావీదు రాజు (రవి) అనే వ్యక్తి మద్యం మత్తులో ఇద్దరు చిన్నారులపై విచక్షణా రహితంగా దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. చిన్నారులు అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. బిక్కు బిక్కుమంటూ కూర్చొన్న ఇద్దరు చిన్నారులపై మద్యం మత్తులో మృగంలా విరుచుకుపడ్డాడు. చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోయే చిన్నారులపై పిడిగుద్దులు కురిపించారు. ఓ చిన్నారిని కాళ్ల పట్టుకుని పైకి లేపి నేలపై విసిరేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. మృగాలు కూడా తమ పిల్లల్ని ప్రేమిస్తాయే కన్న తండ్రే ఇంత దారుణంగా కొట్టడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

పరారీలో నిందితుడు 

దావీదు రాజు భార్య నిర్మల జీవన ఉపాధి కోసం దుబాయ్ లో పనిచేస్తున్నారు.  భార్య నిర్మలపై అనుమానంతో ఇద్దరు పిల్లలు అమృత, అలేఖ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు దావీదు రాజు.  దుబాయ్ లో ఉన్న భార్య నిర్మలను స్వదేశానికి తీసుకురావాలని పిల్లలను వేధిస్తున్న వీడియోలను భార్యకు పంపుతున్నట్లు తెలుస్తోంది. దావీదు రాజు నిర్మలకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు.  ఈ వీడియో వైరల్ అవ్వడంతో పెంటపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.  పరారీలో ఉన్న దావీదు రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.  నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.  

కూతుళ్లను హింసించి భార్యకు వీడియోలు 

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పెంటపాడులో దారుణం చోటుచేసుకుంది. కువైట్ వెళ్లిన భార్య గంజి నిర్మలను వెనక్కి రాకపోతే ఇద్దరు పిల్లల్ని చంపేస్తా అంటూ భర్త దావీదు రాజు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇద్దరు ఆడపిల్లల్ని చితకబాదుతూ కత్తితో నరికేస్తా అంటూ బెదిరిస్తూ భార్యకు వీడియో మెసేజ్ లు పంపించాడు.  తమను కొట్టవద్దని చిన్నారులు ప్రాధేయపడినా ఆ రాక్షస తండ్రి హృదయం కరగలేదు. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తూ కన్న బిడ్డల్ని గొడ్డుని బాదినట్టు బాదాడు.  ఈ వీడియోలను పెంటపాడు పోలీసులకు పంపింది తల్లి నిర్మల. తన పిల్లల్ని రక్షించాలని పోలీసులను వేడుకుంది.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారులను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. నిందితుడు దావీదు రాజుపై కేసు నమోదు చేశారు. పనిపాట లేకుండా భార్య పంపిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఇంట్లోనే ఉండేవాడు దావీదు రాజు.  ఉపాధి కోసం భార్య గంజి నిర్మలను కువైట్ పంపించాడు. నిత్యం తాగి వచ్చి ఇద్దరు ఆడపిల్లల్ని హింసించడం మొదలుపెట్టాడు. తల్లి కూడా దగ్గర లేకపోవడంతో దావీదు రాజు  ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో పిల్లలపై ప్రతాపం చూపించం మొదలుపెట్టాడు. దుబాయ్ నుంచి తిరిగి రాకుంటే పిల్లల్ని చంపేస్తానంటూ వీడియోలు తీసి నిర్మలకు పంపిస్తున్నాడు. పెంటపాడు పోలీసులు ఇంటికి చేరుకోగా నిందితుడు దావీదు రాజు అక్కడ నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కర్కశుడైన తండ్రిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Also Read : Karimnagar News : కీడు సోకిందని ఊరు ఖాళీ, మూఢ నమ్మకంతో గ్రామస్తుల వింత నిర్ణయం!

Also Read : Nellore: భార్య గొంతు పిసికి చంపిన భర్త! సినిమా రేంజ్‌లో క్రైమ్ సీన్ క్రియేషన్ - పట్టేసిన పోలీసులు!

టాప్ హెడ్ లైన్స్

B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Embed widget