Sangareddy: రాఖీ కట్టించుకోనని మొండికేసిన అన్న.. చెల్లెలు అఘాయిత్యం, కాలనీలో షాకింగ్ ఘటన
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో ఆదివారం రాఖీ పండుగ రోజు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తన అన్న తనతో రాఖీ కట్టించుకోలేదని బాగా మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
రాఖీ పండుగ రోజు సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తన అన్న తనతో రాఖీ కట్టించుకోలేదని బాగా మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే, వారి ఇంట్లో కొద్ది కాలంగా కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి తగాదాలు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో ఆదివారం రాఖీ పండుగ రోజు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, జహీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు వీధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. బొగ్గుల మమత, రమేష్ అన్నా చెల్లెళ్లు. మరో అన్నయ్య వీరికన్నా పెద్దవాడు కావడంతో పెళ్లి చేసుకొని వేరే చోట కాపురం ఉంటున్నాడు. ప్రస్తుతం వారి ఇంట్లో అమ్మానాన్నలతోపాటు చిన్న అన్నయ్య రమేష్, చెల్లెలు మమత మాత్రమే ఉంటున్నారు. ఆదివారం రాఖీ పూర్ణిమ పండుగ కావడంతో ఆదివారం ఉదయం మమత పెద్ద అన్నయ్య రమేష్‌కు రాఖీ కట్టి వచ్చింది. అలాగే తన చిన్న అన్నయ్య రమేష్‌కు రాఖీ కట్టేందుకు ఆయన వద్దకు వెళ్లగా.. అతను రాఖీ కట్టించుకొనేందుకు ఒప్పుకోలేదు. తాను కట్టించుకోనని తేల్చి చెప్పేశాడు. దీంతో మమత రాఖీ కట్టించుకోవాల్సిందేనని పట్టుబట్టింది. పలుమార్లు రాఖీ కట్టుకోవాలని కోరినా తన అన్న వినలేదు.
Also Read: Hyderabad: సెల్ఫీ తీసుకుంటూ లైవ్‌లో ఉరేసుకున్న వ్యక్తి.. కారణం తెలిసి పోలీసులు షాక్!
చెల్లెలి పోరు ఎక్కువ కావడంతో అన్న రమేష్ పట్టించుకోకుండా ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయాడు. అయినా పట్టు వదలని మమత.. తన అన్న సెల్ ఫోన్‌కు ఫోన్ చేసింది. అయినా రమేష్ కావాలనే ఉద్దేశపూర్వకంగా స్పందించలేదు. అదే సమయానికి తల్లిదండ్రులు కూడా ఉపాధి పనుల నిమిత్తం పొలానికి వెళ్లిపోయారు. దీంతో మమత ఒక్కటే ఇంట్లో ఉంది. అన్న స్పందించడం లేదని మనస్తాపానికి గురైన మమత.. తాడుతో ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
అయితే, ఇంట్లో 10 రోజులుగా వాళ్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే అన్నాచెల్లెళ్ల మధ్య వ్యక్తి గతంగా మనస్పర్థలు ఏర్పడినట్లు కాలనీవాసులు వెల్లడించారు. రాఖీ పండగ రోజు విషాదం అన్నా చెల్లెళ్ల బంధ విడిపోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. మమత తండ్రి బసవన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు జహీరాబాద్ పోలీసులు తెలిపారు.
Also Read: Rakhi 2021: రాఖీ కట్టిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, రెండు గంటల్లోనే శవంగా.. అసలేం జరిగిందంటే..
Also Read: Hyderabad Crime News: మరో వ్యాపారి కిడ్నాప్, హత్య.. పూడ్చిపెట్టిన మిత్రులు! కారణం ఏంటంటే..