Hyderabad Crime News: మరో వ్యాపారి కిడ్నాప్, హత్య.. పూడ్చిపెట్టిన మిత్రులు! కారణం ఏంటంటే..
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారిని సంగారెడ్డి జిల్లాలో చంపేశారు. మధుసూధన్ రెడ్డి స్నేహితులే కిడ్నాప్ చేసి, హతమార్చినట్లుగా తెలుస్తోంది. అయితే, ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు మూలంగా తెలుస్తోంది.
వ్యాపారుల కిడ్నాప్, హత్య ఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని చార్మినార్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మధుసూదన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఈయన్ను సంగారెడ్డి జిల్లాలో చంపేశారు. మధుసూధన్ రెడ్డి స్నేహితులే కిడ్నాప్ చేసి, హతమార్చినట్లుగా తెలుస్తోంది. అయితే, ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు మూలంగా తెలుస్తోంది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు మధుసూధన్ రెడ్డిని స్నేహితులే కిడ్నాప్ చేసినట్లుగా భావిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆయన్ను చార్మినార్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి సంగారెడ్డిలో చంపినట్లుగా పోలీసులు తెలిపారు.
Also Read: Huzurabad: ఈటల రాజేందర్‌కు గట్టి షాక్.. హుజూరాబాద్‌లో మరో కీలక పరిణామం
మధుసూదన్ రెడ్డి వద్ద ఆయన ముగ్గురు స్నేహితులు ఇది వరకే రూ.40 లక్షల నగదును అప్పు తీసుకున్నారు. ఆ డబ్బు తీసుకొని చాలా కాలం అవ్వడంతో మధుసూధన్ రెడ్డి తన డబ్బులు ఇవ్వమని అడిగారు. ఆయన పదే పదే అడుగుతుండడంతో ఈ నెల 19న మధుసూదన్ రెడ్డిని స్నేహితులే కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ ముగ్గురూ అతడిని సంగారెడ్డి తీసుకెళ్లి అక్కడే చంపి పూడ్చి పెట్టారు. నిందితుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. చంపిన మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
మృతదేహం వెలికితీత
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం, దిగ్వాల్ శివారులో హత్య చేసి పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. మృతుడు సిద్దిపేట జిల్లా, చిన్నకోడూర్ మండలం, రామంచ గ్రామానికి చెందిన ఎడ్ల మధుసూదన్ రెడ్డిగానే పోలీసులు గుర్తించారు. కొన్నాళ్లుగా ఈయన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మధుసూదన్ రెడ్డిని ఈ నెల 19న గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత స్నేహితులే అని పోలీసులు తేల్చారు. మధుసూదన్ రెడ్డి పలు దొంగతనాలు, హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు భావించారు. మరింత సమాచారం కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read: Karimnagar: ఒకే కాన్పులో అక్కకు నలుగురు, చెల్లికి ముగ్గురు.. మరో అవాక్కయ్యే ట్విస్ట్ కూడా..
Also Read: Raksha Bandhan: ఆవు పేడతో అద్భుత రాఖీలు.. అబ్బో! వీటిని ట్రై చేస్తే నిజంగా ఎన్ని ఉపయోగాలో..