ఎంపీ సంతోష్ కుమార్‌కు తన చెల్లెలు కవిత సహా మరో సోదరి రాఖీ కట్టారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీతక్కకు రేవంత్, ఆయన సతీమణి స్వీట్లు తినిపించారు.
తాము టీనేజ్‌లో ఉండగా రాఖీ కట్టించుకున్న ఫోటోను కూడా ఎంపీ ట్వీట్ చేశారు.
‘‘ప్రతి ఆడబిడ్డ.. ఆత్మవిశ్వాసంతో.. ఆర్థిక స్వావలంబనతో.. అన్ని రంగాలలో ఎదగాలని.. మనసారా కోరుకుంటూ.. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
రాఖీ పూర్ణిమ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ కనమల విజయ, మున్సిపల్ చైర్మన్ గాంధే రాధిక-శ్రీనివాస్, ఇల్లంతకుంట ఎంపీపీ పాపని-వెంకటేష్, వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకా-తిరుపతి రెడ్డి, హుజురాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణీ-సురేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. పటాన్ చెరు కార్పోరేటర్ 10 ఏళ్లుగా మంత్రి హరీశ్ రావుకు క్రమం తప్పకుండా రాఖీ కడుతున్నారు.
రాఖీ పండుగ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు పలువురు రాఖీ కట్టారు.
మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టారు.
ప్రగతి భవన్‌లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి.
టీఆర్ఎస్ మహిళా నేతలంతా మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టేందుకు ఆదివారం ప్రగతి భవన్‌కు వచ్చారు.
అందరు నేతలు మంత్రికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
అనంతరం తన చేతికి కట్టిన రాఖీలను చూపుతూ మంత్రి కేటీఆర్ ఇలా ఫోటోకు ఫోజిచ్చారు.
ఈటల రాజేందర్ అన్నకు అండగా ఉంటామని అన్న కష్టం మా కష్టం.. అని బీజేపీ నాయకురాలు తుల ఉమ అన్నారు. నియోజకవర్గంలో ఉన్న అక్కాచెల్లెళ్లు అందరం ఆయన వెన్నంటే ఉంటామని ఉమ అన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఉమ రాఖీ కట్టారు. ప్రజలందరికి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రక్షా బంధన్ పండుగ సోదర సోదరీమణుల ఆత్మీయతకు, అనురాగానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌కు తన సోదరి శ్రీదేవి రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
Republic Day Celebrations 2023: రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - జెండా ఎగుర వేసిన గవర్నర్
KCR Chadar To Ajmer Dargah: అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం కేసీఆర్
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేష్
Pawan Kalyan : కొండగట్టు అంజన్న సన్నిధిలో అంజనీ పుత్రుడు, వారాహికి ప్రత్యేక పూజలు
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?