Hyderabad: సెల్ఫీ తీసుకుంటూ లైవ్‌లో ఉరేసుకున్న వ్యక్తి.. కారణం తెలిసి పోలీసులు షాక్!
తాను ప్రేమలో విఫలం అయ్యానంటూ, ఆమె మోసం చేసిందంటూ కలత చెందిన ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటూనే ఉరేసుకున్నాడు. వనస్థలిపురంలో ఈ ఘటన జరిగింది
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ప్రేమలో విఫలం అయ్యానంటూ, ఆమె మోసం చేసిందంటూ కలత చెందిన ఆయన సెల్ఫీ తీసుకుంటూనే ఉరేసుకున్నాడు. అయితే, ఇక్కడ విచిత్రం ఏంటంటే.. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉండడం విస్మయం కలిగిస్తోంది. తన ప్రియురాలు సహా అయినా వాళ్లు కూడా తనను మోసం చేశారని ఏడుస్తూ బాధితుడు ఉరేసుకున్నాడు. అంతకు ముందు అతను ఫేస్ బుక్ లైవ్ కూడా ఆన్ చేసి అందులో మాట్లాడడం గమనించదగ్గ విషయం.
‘‘నేనొక అమ్మాయిని ప్రేమించాను.. ఆమె మోసం చేసింది. నా స్నేహితులు కూడా మోసం చేశారు. అందుకే నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను’’ అని ఓ వ్యక్తి ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వెల్లడించిన వివరాల ప్రకారం.. ముండ్లమూరు మండలం, పసుపుగల్లు గ్రామానికి చెందిన షేక్ బ్రహ్మం అనే 36 ఏళ్ల వ్యక్తి ట్రాన్స్ పోర్టు బిజినెస్ చేస్తుంటాడు. ఇతనికి సొంతగా లారీలు ఉన్నాయి. ఇతనికి భార్య ఖాసీంబి ఉన్నారు. పదేళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల వయసున్న కూతురు కూడా ఉంది. మోసపోవడం సహా ఆర్థికంగా బాగా నష్టపోవడంతో ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Gold-Silver Price: దిగొచ్చిన బంగారం.. వెండి కూడా అదే దారిలో.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..
లాడ్జికి వెళ్లి ఆత్మహత్య
షేక్ బ్రహ్మం శనివారం ఉదయం తన స్నేహితుడు వేణు గోపాల్‌తో కలిసి వనస్థలిపురం వీఎంఆర్ లాడ్జ్ అండ్ బార్‌లో రూం అద్దెకు తీసుకున్నారు. మధ్యాహ్నం వరకూ ఇద్దరు కలిసి బాగా తాగి గదికి వెళ్లి పడుకున్నారు. తిరిగి సాయంత్రం బార్‌కి వచ్చి మళ్లీ మద్యం తాగుతుండగా.. షేక్ బ్రహ్మం తన గదికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. తాను ప్రేమించి మోసపోయానని, స్నేహితులు కూడా మోసం చేశారని వాపోయాడు. ఇక తాను చనిపోతున్నానంటూ సీలింగ్ ఫ్యానుకు లుంగీ కట్టి ఉరి వేసుకున్నాడు. ఆ సమయంలో స్నేహితులు, బంధువులు ఫోన్ చేసినా ఎత్తలేదు. సెల్ఫీ వీడియో ఆన్ చేసి దూరంగా పెట్టాడు. తాను ఉరేసుకొని కుర్చీ తన్నేసిన వీడియో కూడా ఫోన్‌లో రికార్డయింది.
మరోవైపు, స్నేహితుడు వేణుగోపాల్ తన స్నేహితుడు ఎంతకీ కిందకు రాకపోవడంతో ఫోన్ చేశాడు. స్పందించకపోవడంతో గదికి వెళ్లాడు. కిటికిలోంచి చూస్తే ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. లాడ్జి సిబ్బంది గది తలుపులు తెరిచి చూసే సరికి అప్పటికే చనిపోయి ఉన్నాడు. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలాన్ని సందర్శించి బ్రహ్మం మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బ్రహ్మం మృతికి కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Also Read: Viral Video: ఛీ.. పాడు.. పానీపూరీలో ఏం కలిపాడో చూడండి.. అసహ్యించుకుంటారు!