By: ABP Desam | Updated at : 23 Aug 2021 08:47 AM (IST)
death
విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. రాఖీ పండుగ రోజు ఓ సోదరుడికి, వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. రాఖీ కట్టిన చెల్లెలు రెండు గంటల్లోనే విగత జీవిగా మారిపోవడం ఆమె సోదరుడితో పాటు వారి కుటుంబాన్ని కూడా నిశ్చేష్ఠులను చేసింది. విజయవాడలోని అరండల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాలివీ..
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి రాఖీ పండుగ రోజున విజయవాడలో అత్తగారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అన్నయ్య ఆమె ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకొని అప్పుడే ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే.. చెల్లెలు చనిపోయిందని వార్త చెవిన పడింది. దీంతో వారి కుటుంబానికి నోట మాట రాలేదు. చెల్లెలి ఇంటికి వెళ్లి చూడగా.. అప్పటికే మృతదేహాన్ని మార్చురీ బాక్సులో ఉంచారు. దీంతో వేదన తట్టుకోలేక భోరుమన్నారు. అయితే, అత్తింటివారే తమ బిడ్డ మరణానికి కారణమని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్... నేటి నుంచి పది రోజుల పాటు
కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన ఉష అనే 23 ఏళ్ల యువతి రెండేళ్ల క్రితం అరండల్‌పేటకు చెందిన ఫణి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త ఉద్యోగం మెడికల్ రిప్రజెంటేటివ్. కాగా, ఉష బీటెక్ చదవడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అయితే, ఇదే ఆమె పాలిట శాపమైనట్లుగా స్థానికులు భావిస్తున్నారు. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నావంటూ తరచూ ఆమెను అత్తింటివారు వేధిస్తుండేవారని, దీంతో ఆమె తీవ్ర మానసిక వేదకు గురయ్యేదని స్థానికులు చెప్పారు. అయితే, కుటుంబ సభ్యులు కూడా ఉషను ఒత్తిడికి గురిచేసే వారని ఉష అన్నయ్య ఆరోపించారు.
రాఖీ పండుగ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో చెల్లెలి ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుని వెళ్లానని సోదరుడు బోరున ఏడ్చాడు. తర్వాత రెండు గంటల్లోనే ఉష చనిపోయిందని చెప్పారంటూ వాపోయాడు. ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయిన ఉషను ఆసుపత్రికి తీసుకువెళ్లామని, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని భర్త, కుటుంబ సభ్యులు చెబుతున్నట్లుగా ఆమె సోదరుడు చెబుతున్నాడు. యువతి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
Also Read: Hyderabad: సెల్ఫీ తీసుకుంటూ లైవ్‌లో ఉరేసుకున్న వ్యక్తి.. కారణం తెలిసి పోలీసులు షాక్!
జార్ఖండ్‌లో ఘోర అగ్నిప్రమాదం - వైద్యదంపతులు సహా ఆరుగురు మృతి
UP Crime News: భర్త నాలుకను కొరికి పడేసిన భార్య, అసలేం జరిగిందంటే?
Delhi Hit And Drag Case: ఢిల్లీలో మరో హిట్ అండ్ డ్రాగ్ కేసు - 350 మీ. ఈడ్చుకెళ్లిన కారు, ఒకరు మృతి
Hyderbad Crime : ఆన్లైన్ లో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ కు రప్పించి, వ్యాపారి నుంచి డైమండ్ కొట్టేసిన కేటుగాడు
BBC Documentary Row: ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ వివాదం, ఢిల్లీ వర్సిటీ వద్ద రచ్చ రచ్చ - పలువురు విద్యార్థుల అరెస్ట్
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!