అన్వేషించండి

Hyderabad: హైదరాబాద్‌లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్... నేటి నుంచి పది రోజుల పాటు

నేటి (సోమవారం) నుంచి కనీసం పది రోజుల పాటు మెగా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ మరో చరిత్ర సృష్టించేందుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్‌‌తో పాటు యావత్ దేశం, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉంటేందుకు నేటి (సోమవారం) నుంచి కనీసం పది రోజుల పాటు మెగా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 

ఇప్పటి వరకు అర్హులైన వారు కూడా వ్యాక్సిన్ వేసుకోని వారి కోసం ఈ మెగా డ్రైవ్. అర్హులైన పౌరులందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున  వాక్సినేషన్ కార్యక్రమానికి  శ్రీకారం చుట్టింది. వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డు‌లు ఉమ్మడిగా ఈ వ్యాక్సిన్ ఉద్యమాన్ని చేపట్టాయి. ఈ ఉద్యమం కోసం గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ పెద్దన్న పాత్ర వహించనుంది. జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్న 4,846 కాలనీలు, బస్తీలు, కంటోన్మెంట్లు, కాలనీల్లో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే 18ఏళ్లకు పైబడిన వారు 70 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. మిగిలిన 30 శాతంతో పాటు ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోని వారు ఉంటే వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. దీనిలో భాగంగా  జీహెచ్ఎంసీ పరిధిలో 175 ప్రత్యేక సంచార వైద్య కోవిడ్ వాక్సిన్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా కంటోన్మెంట్ పరిధిలో మరో 25 వాహనాలను వైద్య ఆరోగ్య శాఖతో కలిపి  ఏర్పాటు చేసింది. 

సోమవారం నుంచి కనీసం పది రోజుల పాటు ఈ స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. ఈ వాక్సిన్ కార్యక్రమానికి ఆదివారమే జీహెచ్ఎంసీ సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ, ఎంటమాలజి బృందాలకు చెందిన సిబ్బంది ఇంటింటికి వెళ్లి వాక్సిన్ వేసుకోని వారి జాబితాను సిద్ధం చేస్తోంది. ఈ జాబితాను వారు ఆరోగ్య సిబ్బందికి అందజేస్తారు. దీనితో పాటు వాక్సిన్ తీసుకొని పౌరులకు తమ కాలనీలో ఏ రోజైతే  ప్రత్యేక వాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తారో ఆ వివరాలను వారికి అందజేయనున్నారు. వ్యాక్సిన్ వేసే వివరాలను వారికి అందజేయనున్నారు. 

కాలనీలు, బస్తీల్లో అర్హులైన వారికి వాక్సిన్ పూర్తయిన అనంతరం, ఆయా కాలనీలు, బస్తీలకు మరో ప్రత్యేక బృందం వెళ్లి వంద శాతం వాక్సిన్ పూర్తయిన అంశాన్ని పరిశీలిస్తారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో "మాకాలనీ/ బస్తీలో వంద శాతం అర్హులైన వారికి వాక్సిన్ పూర్తయింది" అనే బ్యానర్‌ను కూడా ప్రదర్శిస్తారు. ఈ కాలనీ సంక్షేమ సంఘాలకు 100 శాతం వాక్సిన్ పూర్తి చేసినందుకు జీహెచ్ఎంసీ ద్వారా ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందచేస్తారు. 

ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా చేపట్టిన ఈ 100  శాతం వాక్సినేషన్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు కూడా పర్యవేక్షిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి లు కూడా ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. కాగా, ఈ వంద శాతం వాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయడానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరిని భాగస్వామం చేయాలని సి.ఎస్. సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. 

టాప్ హెడ్ లైన్స్

అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget