Andhra Pradesh crime news: ఉద్యోగం ఇప్పిస్తానని లాడ్జికి తీసుకెళ్లి... నగ్న వీడియోలు తీశాడు ... తర్వాత కూడా బెదిరిస్తూ...
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ మహిళను నమ్మించి...లాడ్జిలో అత్యాచారం చేశాడో ప్రబుద్ధుడు. నగ్న వీడియోలు తీసి అందరికీ చూపిస్తాని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఉద్యోగం విషయంపై చర్చిద్దామని గుంటూరు తీసుకొచ్చాడు. విశ్రాంతి తీసుకుందాని చెప్పి లాడ్జికి తీసుకెళ్లే అత్యాచారం చేసి, నగ్న వీడియోలు తీశాడు. బాధితురాలు పోలీసులు ఆశ్రయించడంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
లాడ్జిలో అత్యాచారం
హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఓ మహిళకు మాయమాటలు చెప్పి, ఉద్యోగ విషయం మాట్లాడదామని గుంటూరుకు తీసుకెళ్లాడు ఓ కేటుగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని లాడ్జికి తీసుకెళ్లాడు. ఆ లాడ్జిలో ఆమెపై అత్యాచారం చేసి, నగ్న వీడియోలు తీశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Also Read: YS Viveka Case: వైఎస్ వివేకా హంతకులెవరు?... ఆచూకీ చెబితే 5 లక్షలు నజరానా
జీరో ఎఫ్ఐఆర్
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అత్యాచారం చేశాడని ఓ మహిళ ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేసిన ప్రకాశం పోలీసులు ఘటన జరిగింది గుంటూరులో కాబట్టి కొత్తపేట పోలీసులకు కేసు బదిలీ చేశారు. శుక్రవారం కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మహిళను అదే ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్య పరిచయం పెంచుకున్నాడు.
Also Read: AP High court: అంతిమ సంస్కారానికి హుందాతనం... ఆర్టికల్ 21లో భాగమే... ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ఇంటర్నెట్ పెడతానని బెదిరింపులు
ఆ మహిళ ఉద్యోగ ప్రయత్నాల కోసం హైదరాబాద్ వచ్చింది. అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆమెను నమ్మించాడు. గత నెలలో 11వ తేదీన ఉద్యోగం విషయంపై మాట్లాడదామని ఆమెను గుంటూరు తీసుకెళ్లాడు. విశ్రాంతి తీసుకుందామని చెప్పి రైలుపేటలోని ఓ లాడ్జికి వెళ్లాడు. విశ్రాంతి తీసుకునే క్రమంలో తనను అత్యాచారం చేశాడని, నగ్న వీడియోలు తీసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినా, తాను పిలిచినప్పుడు రాకపోయినా నగ్న వీడియోలు ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అప్పటి నుంచి ఆ వీడియోలతో బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె దర్శి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్శి పోలీసులు గుంటూరు కొత్తపేటకు ఈ కేసును బదిలీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు.