By: ABP Desam | Updated at : 21 Aug 2021 07:59 AM (IST)
దళిత బాలికపై అత్యాచారం కేసు(ప్రతీకాత్మతచిత్రం)
గుంటూరు జిల్లా రాజుపాలెంలో దళిత బాలికపై అత్యాచారం కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. బాలికపై వరుసకు మామయ్య అయ్యే వ్యక్తే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతడ్ని పోలీసులు అరెస్టు- చేశారు. రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపిన వివరాల ప్రకారం.. రాజుపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో ఉంటున్న ఓ దళిత బాలిక కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు ఆస్థమా, కిడ్నీ సమస్యలు ఉన్నాయి. బాలిక తల్లిదండ్రులు గుంటూరులో ఉంటారు. బాలిక చిన్నతనం నుంచి అమ్మమ్మ, తాతయ్యల వద్ద రాజుపాలెంలో ఉంటుంది. అక్కడకు సమీపంలోనే వరుసకు మామయ్య అయ్యే గల్లా లాబాన్ ఆ బాలికను తన పిల్లలతో ఆడుకునేందుకు పిలిచేవాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
ఆడుకోవడానికి పిలిచి అత్యాచారం
కొద్దిరోజుల కిందట బాలిక అమ్మమ్మ మృతిచెందింది. ఈ నెల 18న ఆమె పెద్దకర్మ కార్యక్రమాలు జరిగాయి. కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమంలో ఉండగా లాబాన్ బాలికను తన పిల్లలతో ఆడుకోవడానికి పిలిచాడు. ఎప్పటిలాగే వెళ్లిన ఆమెను గదిలో బంధించి అరుపులు, కేకలు ఎవరికీ వినిపించకుండా నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
రెండు గంటల్లోనే అరెస్ట్
ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి పోలీసు కేసు పెట్టలేదు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్‌గున్నీ వెంటనే కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. దిశ డీఎస్పీ రవిచంద్ర, పిడుగురాళ్ల రూరల్ సీఐ పి.వీరాంజనేయులు, ఎస్సై అమీర్, మహిళా పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడడంతో వారు 19వ తేదీ మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన రెండు గంటల్లోనే నిందితుడు గల్లా లాబాన్‌ను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.
గతంలోనూ అఘాయిత్యం
ఈ ఘటనలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలు వచ్చాయని ఎస్పీ తెలిపారు. లాబాన్ గతంలో కూడా ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసిందన్నారు. లాబాన్ తో పాటు సంజీవ్ లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ ఘటన జరిగిన రోజు సంజీవ్ కూడా అక్కడ కనిపించడంతో బాలిక బంధువులు ఇద్దరూ కలిసి అత్యాచారం చేసి ఉంటారని భావించారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనతో సంజీవ్‌కు సంబంధం లేదని తెలిసిందన్నారు. అయినా ఏ1గా లాబాన్, ఏ2గా సంజీవ్ పేర్లు చేర్చినట్లు తెలిపారు. ఇద్దరి డీఎన్‌ఏను పరీక్షలకు పంపామన్నారు. పూర్తి ఆధారాలతో నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు చేసి రెండు గంటల్లో నిందితుడిని పట్టుకున్న డీఎస్పీ, సీఐ, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ విశాల్ గున్నీ అభినందించారు.
Also Read: Weather Updates: రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు... ఏపీ, తెలంగాణలపై ఉపరితల ఆవర్తనం ప్రభావం
Konaseema Name Change: అట్టుడుకుతున్న కోనసీమ, జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన ఉధృతం - పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మాహత్యాయత్నం
Allegations On Jeevita : జీవిత ప్రమాదకరమైన లేడీ - డబ్బులు ఎగ్గొట్టి ఆరోపణలు చేస్తున్నారన్న గరుడవేగ నిర్మాతలు !
YS Sharmila Son : కుమారుడి విజయంపై వైఎస్ షర్మిల ఎమోషనల్ - వారసుడు ఏం సాధించారంటే ?
Breaking News Live Updates : దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు హైకోర్టుకు బదిలీ, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం
Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !
Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
Navjot Singh Sidhu: లొంగిపోవడానికి సమయం కోరిన సిద్ధూ- నో చెప్పిన కోర్టు!