News
News
X

YS Viveka Case: వైఎస్ వివేకా హంతకులెవరు?... ఆచూకీ చెబితే 5 లక్షలు నజరానా

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల సమాచారం ఇస్తే నజరానా ఇస్తామని సీబీఐ ప్రకటించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన ఇచ్చింది.

FOLLOW US: 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణ 77 రోజులు దాటిన తర్వాత ఈ కేసులో నిందితుల ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షల రూపాయల  బహుమతి ఇస్తామని సీబీఐ పత్రికా ప్రకటన ఇచ్చింది.  దీంతో ఈ కేసులో సీబీఐ ఇంత వరకూ జరిపిన విచారణలో తగిన క్లూ దొరకలేదని భావించాల్సివస్తోందని ఈ కేసు పురోగతిని పరిశీలించినవారు అంటున్నారు. చివరాఖరుకు సీబీఐ వివేకా హత్య కేసులో సరియైన సమాచారం ఇచ్చినవారికి రూ.5లక్షలు బహుమానం ఇస్తామని పేర్కొంది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చింది. సాధారణ ప్రజల నుంచి కూడా ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చని సూచించింది. ఎస్పీ, డీఎస్పీలకు వివరాలు తెలియజేయాలంటూ వారి ఫోన్ నెంబర్లను పత్రికా ప్రకటనలో ఇచ్చింది.

Also Read: Jagan Sharmila Rakhi : జగన్‌కు రాఖీ కట్టేందుకు షర్మిల వెళ్తారా..?

అసలేం జరిగిందంటే...

2019 మార్చి 15 అర్థరాత్రి వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆ కేసులో ఏపీ పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేపట్టింది. వివేకా కుమార్తే అభ్యర్థనతో హైకోర్టు ఉత్తర్వులతో ఆ తర్వాత కేసు సీబీఐకి బదిలీ అయింది. 2020 జూన్ 9న ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ కరోనా కారణంగా కొన్నాళ్లు ఏపీకి నేరుగా వచ్చి విచారణ చేపట్టలేదు. ఇటీవల ఏపీకి వచ్చి అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇప్పటి వరకు సునీల్ కుమార్ యాదవ్ అనే పేరు మాత్రమే ఈ కేసులో ప్రముఖంగా వినిపించింది. అతడిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల్ని కూడా విచారించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం గాలించారు. 

Also Read: AP High court: అంతిమ సంస్కారానికి హుందాతనం... ఆర్టికల్ 21లో భాగమే... ఏపీ హైకోర్టు కీలక తీర్పు

వైసీపీ ఎంపీ తండ్రి విచారణ

ఇటీవల వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ విచారణకు పిలిపించడంతో కలకలం రేగింది. అటు కడప సెంట్రల్ జైలులో కూడా మరికొందరిని సీబీఐ అధికారులు విచారణకు పిలిపించారు. కానీ ఎవరి దగ్గర నుంచి సరైన సమాచారం రాబట్టలేకపోయారు. ఇప్పటి వరకు కేసు విచారణలో పురోగతి కనిపించి ఉంటే కచ్చితంగా ఈ వివరాలు కోర్టుకి సమర్పించేవారు. కానీ సీబీఐ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని తెలుస్తోంది. దీంతో చివరిగా సీబీఐ పత్రికా ప్రకటన ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. హత్య జరిగి రెండేళ్లు గడిచినా ఇంకా నిందితులెవరో తేలలేదు. చివరకు సీబీఐ కూడా ఈ కేసులో ఏమీ చేయలేక నిందితుడి ఆచూకీ చెబితే 5 లక్షల నజరానా ఇస్తామని పత్రికలలో ప్రకటన ఇచ్చింది.

Also Read: Huzurabad News: హుజూరాబాద్‌‌లో ఏం నడుస్తుంది? ఇంఛార్జిలతో కేసీఆర్ రివ్యూ, కీలక సూచనలిచ్చిన సీఎం

Published at : 21 Aug 2021 09:31 AM (IST) Tags: jagan ap govt viveka murder case cbi viveka murder Cbi reward ys vivekananda

సంబంధిత కథనాలు

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!

Nellore Fish Curry Recipe : నెల్లూరు చేపల పులుసు, ఎందుకంత ఫేమస్?

Nellore Fish Curry Recipe : నెల్లూరు చేపల పులుసు, ఎందుకంత ఫేమస్?

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి 

Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి 

Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి

Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి

టాప్ స్టోరీస్

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Dogfishing : అమ్మాయిలతో డేటింగ్‌కు కుక్క పిల్ల రికమండేషన్

Dogfishing : అమ్మాయిలతో డేటింగ్‌కు కుక్క పిల్ల రికమండేషన్