Huzurabad News: హుజూరాబాద్‌లో ఏం నడుస్తుంది? ఇంఛార్జిలతో కేసీఆర్ రివ్యూ, కీలక సూచనలిచ్చిన సీఎం
సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. హుజూరాబాద్‌లో వ్యూహాలు, దళిత బంధు పథకం గురించి ఉపఎన్నిక ఇన్‌ఛార్జిలకు దిశానిర్దేశం చేశారు.
![Huzurabad News: హుజూరాబాద్‌లో ఏం నడుస్తుంది? ఇంఛార్జిలతో కేసీఆర్ రివ్యూ, కీలక సూచనలిచ్చిన సీఎం CM KCR reviews over Huzurabad Bypoll, dalitha bandhu and directs against Eatala Rajender Huzurabad News: హుజూరాబాద్‌లో ఏం నడుస్తుంది? ఇంఛార్జిలతో కేసీఆర్ రివ్యూ, కీలక సూచనలిచ్చిన సీఎం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/16/1463da1427bed3a0169806cde40efc36_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టే ప్రస్తుతం రాజకీయాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. హుజూరాబాద్‌లో వ్యూహాలు, దళిత బంధు పథకం గురించి ఉపఎన్నిక ఇన్‌ఛార్జిలకు దిశానిర్దేశం చేశారు. దళిత బంధు పథకం గొప్పదని.. దీని ఫలాలు లబ్ధిదారులకు అందాలని సీఎం ఆకాంక్షించారు. హుజూరాబాద్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరాల్సిందేనని సీఎం దిశా నిర్దేశం చేశారు. ప్రచారంలో ఎక్కడా తగ్గకూడదని.. మన గెలుపు ఖాయం అని, మెజార్టీపైనే దృష్టి సారించాలని సీఎం చెప్పారు.
ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మేయర్ సునీల్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళితబంధు అమలుకు మంచి స్పందన వస్తుందని ఉప ఎన్నిక ఇన్‌చార్జీలు సీఎంకు చెప్పారు. దీనికితోడు నియోజకవర్గంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం, ప్రత్యర్థులపై రాజకీయదాడి, రాజకీయ వ్యూహాలు, కదలికలు, వేస్తున్న అడుగులపై సీఎంకు నివేదిక ఇచ్చారు.
Also Read: Vijayashanthi: ఒవైసీ గారూ.. వెళ్లి తాలిబన్లతో చర్చలు జరిపి రండి.. విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్
హుజూరాబాద్‌లో జరుగుతున్న రాజకీయ, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రస్తుతం జనం ఏమనుకుంటున్నారనే విషయం సీఎంకు మంత్రులు వివరించారు. ఈనెల 16న హుజూరాబాద్‌లోని శాలపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో 15 మంది లబ్ధిదారులకు దళితబంధు చెక్కులు అందజేయడంతో అమలుపై అపోహలు తగ్గాయని చెప్పారు. గత శుక్ర, శని, ఆదివారాల్లో దళితబంధు అమలుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చెలరేగిన ఆందోనళలు సోమవారం నాటికి లేవని చెప్పారు. లబ్ధిదారుల్లో తగ్గిన అసంతృప్తికి అదే సంకేతమని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం కూడా హుజూరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అక్కడ పెండింగ్ పనుల కోసం సుమారు రూ.1,500 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చే దళిత బంధు పథకం ఎలాగూ ఉంది. అంతేకాక, హుజూరాబాద్ నియోజకవర్గంలో భారీగా రాజకీయ పార్టీలకు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు మకాం వేసినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల కదలికలు, ఆ పార్టీల విషయంలో ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేయడంలో నిమగ్నమయ్యాయి.
Also Read: Taliban in Kabul: అరాచకంగా తాలిబన్ల తీరు.. మూసేసిన భారత ఎంబసీల్లోకి చొరబడి వాటిని ఎత్తుకెళ్లారు
Also Read: Suresh Gopi: నన్ను ‘ఆవు పేడ’ అని అంటున్నందుకు గర్వంగా ఉంది.. నటుడు, ఎంపీ స్ట్రాంగ్ కౌంటర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)