Taliban in Kabul: అరాచకంగా తాలిబన్ల తీరు.. మూసేసిన భారత ఎంబసీల్లోకి చొరబడి వాటిని ఎత్తుకెళ్లారు
అఫ్గాన్‌లో ఉన్న ప్రముఖ నగరాలుగా ఉన్న కాందహార్, హేరత్‌లలో ఇప్పటికే మూసేసి ఉన్న ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాల్లోకి చొరబడి తాలిబన్లు తనిఖీలు చేశారు.
అఫ్గానిస్థాన్‌ను దురాక్రమించుకున్న తాలిబన్లు అక్కడ వ్యవహరిస్తు్న్న తీరు ఆందోళనకరంగా ఉంటోంది. వారు చేస్తున్న ప్రతి పని అనుమానాస్పద రీతిలో తారసపడుతోంది. తాజాగా వారు తాలిబన్లు బుధవారం ప్రధాన నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో సోదాలు జరిపారు. ప్రముఖ నగరాలుగా ఉన్న కాందహార్, హేరత్‌లలో ఇప్పటికే మూసేసి ఉన్న ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాల్లోకి చొరబడి తాలిబన్లు తనిఖీలు చేశారు. లోపల కప్‌బోర్డులు, అల్మారాలు, సొరుగుల్లో ఉన్న కీలక దస్త్రాలను పరిశీలించారు. అక్కడ ఎలాంటి పత్రాలు లభించకపోవడంతో ఆ కాన్సులేట్ల వద్ద ఉన్న వాహనాలను ఎత్తుకెళ్లినట్లుగా ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. మరోవైపు జలాలాబాద్, కాబుల్‌లో ఉన్న దౌత్య కార్యాలయాల్లో తాలిబన్లు సోదాలు చేశారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు.
ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, వాణిజ్య బంధాలను కోరుకుంటున్నట్లుగా తాలిబన్లు పైకి చెబుతున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం తమ అసలు స్వభావాన్నే ప్రదర్శిస్తున్నారు. తాలిబన్ల దురాక్రమణ తర్వాత భారత్, అమెరికా సహా చాలా దేశాలు తమ ఎంబసీలను ఖాళీ చేసేసి, అందులోని సిబ్బందిని తీసుకెళ్లిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న ఆ కార్యాలయాల్లోకి తాలిబన్లు చొరబడి కీలక పత్రాల కోసం తనిఖీ చేస్తున్నారు.
Also Read: మనుషుల కంటే ముందే అంతరిక్షానికి వెళ్లిన ఆ కుక్క, కోతులు ఏమయ్యాయి?
అంతర్జాతీయ వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాబుల్‌లో ఆనస్ హక్కానీ నేతృత్వంలో ఏకంగా 6 వేల మంది తాలిబన్ సాయుధులు మోహరించి నగరాన్ని తమ నియంత్రణలో ఉంచుకున్నారు. ఓ ఉగ్రసంస్థ, తాలిబన్ గ్రూపునకు డిప్యూటీ లీడర్‌గా ఉన్న సిరాజుద్దీన్ హక్కానీకి ఈ ఆనస్ హక్కానీ సోదరుడు. ఇతను అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కార్జై సహా హెచ్‌సీఎన్ఆర్ (హై కౌన్సిల్ ఫర్ నేషనల్ రీకాన్సిలేషన్) ఛైర్మన్ డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లాను కలిశాడు. దీన్ని బట్టి వారిద్దరినీ కూడా తాలిబన్లు తమ నియంత్రణలోనే ఉంచుకున్నట్లుగా భావిస్తున్నారు. అధ్యక్ష భవనాన్ని అధికారికంగా తాలిబన్ నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు అప్పగించేలా.. కర్జై, అబ్దుల్లాతో చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని క్వెట్టాలో ఉన్న సిరాజుద్దీన్ హక్కానీ నుంచి ఆదేశాలు అందిన మేరకు అధ్యక్ష భవనం అప్పగింతపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Taliban Crisis: తాలిబన్లు.. ఎంత పనిచేశారయా? భారత్ లో రేట్లు ఆకాశానికే!
గత ఆదివారం కాబుల్‌ను తాలిబన్లు తమ గుప్పిట్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిస్థితులు క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారడంతో భారత్.. అఫ్గాన్‌లోని తమ దౌత్య సిబ్బందిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చేసింది. అక్కడ ఉన్న భారత పౌరులను కూడా స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టింది.
Also Read: Afghan Footballer Death: విమానం నుంచి జారిపడి అఫ్గాన్ నేషనల్ ఫుట్ బాలర్ మృతి
Also Read: Afghanistan Crisis Update: అయ్యో పాపం.. పసిపిల్లలను కంచెపై నుంచి విసిరేస్తున్న తల్లులు!