Afghan Footballer Death: విమానం నుంచి జారిపడి అఫ్గాన్ నేషనల్ ఫుట్ బాలర్ మృతి
ఓ ప్రమాదంలో అఫ్గానిస్థాన్ జాతీయ ఫుట్ బాలర్ జాకీ అన్వారీ చనిపోయాడు. కాబూల్ నుంచి బయలుదేరిన యూఎస్ విమానంలో జాకీ ఎక్కాడు. ఆ విమానం నుంచి పడిపోయి జాకీ మరణించినట్లు సమాచారం.
అఫ్గానిస్థాన్ జాతీయ ఫుట్ బాలర్ జాకీ అన్వారీ మృతి చెందాడు. కాబూల్ విమానాశ్రయం నుంచి సోమవారం బయలుదేరిన యూఎస్ విమానంలోకి ఎక్కిన అన్వారీ అందులోనుంచి జారి పడి చనపోయాడు. ఈ మేరకు అఫ్గాన్ న్యూస్ ఏజెన్సీ అరియానా తెలిపింది.
తాలిబన్లు అఫ్గానిస్థాన్ ను వశం చేసుకున్న తర్వాత వేలాదిమంది కాబూల్ ను విడిచి వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు. టేకాఫ్ అవుతున్న విమానాలను సైతం ఎక్కి ప్రయాణం చేశారు. అలానే యూఎస్ఎఫ్ బోయింగ్ సీ-17 విమానం ఎక్కిన జాకీ.. అందులోనుంచి పడిపోయాడు. ఆయన మృతిని స్పోర్ట్స్ జనరల్ డైరక్టరేట్ ధ్రువీకరించింది.
Our deepest condolences go out to the family, friends and teammates of young Afghan national team footballer Zaki Anwari, who reportedly died in a fall from a U.S. plane at Kabul airport on Monday. pic.twitter.com/2DgulUw1HD
— FIFPRO (@FIFPRO) August 19, 2021
అఫ్గానిస్ఖాన్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న అనంతరం భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశం నుంచి బయటపడేందుకు ప్రజలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాబూల్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం నుంచి ముగ్గురు ప్రయాణికులు కిందపడి దుర్మరణ చెందారు. విమానం లోపల చోటు లేకపోవడంతో వీరంతా విమానం రెక్కలపై కూర్చున్నారు. విమానం గాలిలో టాకాఫ్ అయిన కాసేపటికే వారిలో ముగ్గురు కింద పడి మరణించగా.. దీనికి సంబంధించిన వీడియో అందరినీ కంటతడి పెట్టించింది. అయితే సీ-17 గ్లోబ్‌మాస్టర్ సైనిక విమానంపై ఎక్కిన కొందరు దాన్ని వీల్ భాగంలో కూడా దాక్కున్నట్లు అమెరికా వెల్లడించింది. వారికి సంబంధించిన శరీర భాగాలు కనిపించాయని వైమానిక దళం పేర్కొంది.
Exclusive- A clear video (from other angle) of men falling from C-17. They were Clinging to some parts of the plane that took off from Kabul airport today. #Talibans #Afghanistan #Afghanishtan pic.twitter.com/CMNW5ngqrK
— Aśvaka - آسواکا News Agency (@AsvakaNews) August 16, 2021