IND in IRE, 2 T20Is, 2022 | 2nd T20I | Malahide Cricket Club Ground, Dublin - 28 Jun, 09:00 pm IST
(Match Yet To Begin)
IRE
IRE
VS
IND
IND

Suresh Gopi: నన్ను ‘ఆవు పేడ’ అని అంటున్నందుకు గర్వంగా ఉంది.. నటుడు, ఎంపీ స్ట్రాంగ్ కౌంటర్

తనను ‘ఆవు పేడ’ అని పిలుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని బీజేపీ ఎంపీ, నటుడు సురేష్ గోపీ వ్యాఖ్యానించారు. అంతకు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు ఇలా దీటైన కౌంటర్ ఆయన ఇచ్చారు.

FOLLOW US: 

నటులు, రాజకీయ నాయకులు కొన్ని సందర్భాల్లో చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆ మాటలపై ఎవరైనా మనోభావాలు దెబ్బతిని విమర్శలు చేస్తే, కొందరు అందుకు దీటుగా కూడా స్పందిస్తుంటారు. వారు ఇచ్చే కౌంటర్‌కు అవతలి వారి మైండ్ బ్లాంక్ అవ్వొచ్చు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ బీజేపీ ఎంపీ విషయంలో జరిగింది. ఆయన సినీ నటుడు కూడా. సినీ నటుడిగా తమిళ, మలయాళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో ప్రేక్షకులను మెప్పించి కొన్నేళ్ల క్రితమే రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలు, వాటిపై వచ్చిన విమర్శలకు ఆయన ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

తనను ‘ఆవు పేడ’ అని పిలుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని బీజేపీ ఎంపీ, నటుడు సురేష్ గోపీ వ్యాఖ్యానించారు. అంతకు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు ఇలా దీటైన కౌంటర్ ఆయన ఇచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘నన్ను ‘ఆవుపేడ’ అని పిలుస్తున్నందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. నిజం చెప్పాలంటే నన్ను ఆవు పేడ అని పిలుస్తున్నందుకు నాకింకా ఎంతో గర్వంగా ఉంది’’ అని నటుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపీ ఆనందం వ్యక్తం చేశారు. ః

Also Read: Vijayashanthi: ఒవైసీ గారూ.. వెళ్లి తాలిబన్లతో చర్చలు జరిపి రండి.. విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్

అసలేం జరిగిందంటే..
ఇటీవలే కొచ్చిలోని కాలూర్‌లో విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోవు రక్ష యాత్ర ప్రారంభోత్సవానికి ఎంపీ, నటుడు సురేష్ గోపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘ్‌ పరివార్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరవడం కొన్ని వర్గాల నుంచి విమర్శలకు తావిచ్చింది. దీంతో కొందరు సోషల్‌ మీడియాలో విమర్శలు చేశారు. సురేష్‌ గోపి ఒక ‘ఆవు పేడ’ అని విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అయినా సరే వాటిని పట్టించుకోనని, అనే వాళ్లు ఎన్ని అయినా అనుకోవచ్చంటూ సురేష్ గోపీ ఆ విమర్శకులకు బదులిచ్చారు. స్వామి వివేకానంద కల్చరల్‌ సొసైటీతో వీహెచ్‌పీ అనుసంధానమై కేరళలో ఈ  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆవుల సంరక్షణ, సేంద్రియ సాగు, పాల ఉత్పత్తి పెంచడంతో పాటు ప్రజలు సంప్రదాయమైన లైఫ్ స్టైల్ అలవాటు చేసుకొనేలా ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

Also Read: Taliban in Kabul: అరాచకంగా తాలిబన్ల తీరు.. మూసేసిన భారత ఎంబసీల్లోకి చొరబడి వాటిని ఎత్తుకెళ్లారు

కేరళకు చెందిన నటుడు సురేష్ గోపీ.. విక్రమ్ నటించిన ‘ఐ’ సినిమాలో తెలుగులో చివరిగా కనిపించారు. అందులో ఆయన డాక్టర్ పాత్ర పోషించారు. హీరో పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే పాత్రలో నటించారు. 1986లో సినిమాల్లోకి వచ్చిన ఆయన ఇప్పటిదాకా 250కి పైగా చిత్రాల్లో నటించారు.

Also Read: Gold-Silver Price: మరింత ఎగబాకిన పసిడి ధర.. దిగొచ్చిన వెండి, మీ నగరంలో నేటి ధరలివీ..

Also Read: Warangal News: వరంగల్‌లో కన్నింగ్ లేడీ, యువకుడి ఆత్మహత్య.. ముగ్గులోకి దింపి కిలాడీ ప్లాన్, అవాక్కైన పోలీసులు

Published at : 21 Aug 2021 07:45 AM (IST) Tags: Rajya Sabha MP Suresh Gopi actor suresh gopi comments cow dung sangh parivar

సంబంధిత కథనాలు

Corona Cases: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 11,793 మందికి వైరస్

Corona Cases: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 11,793 మందికి వైరస్

Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు

Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు

AAI Junior Executive Recruitment: సైన్స్‌లో డిగ్రీ చేసిన వాళ్లకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆహ్వానం- లక్షన్నర వరకు జీతం

AAI Junior Executive Recruitment: సైన్స్‌లో డిగ్రీ చేసిన వాళ్లకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆహ్వానం- లక్షన్నర వరకు జీతం

PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ

PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ

Wanted Bride Posters : పెళ్లి కూతురు కావాలని ఊరి నిండా జగన్ పోస్టర్లు - పిల్ల దొరుకుతుందా ?

Wanted Bride Posters :  పెళ్లి కూతురు కావాలని ఊరి నిండా జగన్ పోస్టర్లు - పిల్ల దొరుకుతుందా ?

టాప్ స్టోరీస్

TS Inter 2nd Year Results 2022: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

TS Inter 2nd Year Results 2022: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

Telangana New Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం, హాజరైన సీఎం కేసీఆర్

Telangana New Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం, హాజరైన సీఎం కేసీఆర్

నీళ్ల ట్యాంక్ ఎక్కిన ఎమ్మెల్యే కొడుకు - పాన్ ఇండియా ఫ్యాన్స్ వెతుకుతారా?

నీళ్ల ట్యాంక్ ఎక్కిన ఎమ్మెల్యే కొడుకు - పాన్ ఇండియా ఫ్యాన్స్ వెతుకుతారా?

Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!

Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!