అన్వేషించండి

Gold-Silver Price: మరింత ఎగబాకిన పసిడి ధర.. దిగొచ్చిన వెండి, మీ నగరంలో నేటి ధరలివీ..

భారత మార్కెట్‌లో బంగారం ధరలు పెరగ్గా వెండి ధర మాత్రం అతి అస్వల్ప తగ్గుదల నమోదు చేసింది. గ్రాముకు రూ.0.30 పైసలు చొప్పున తగ్గింది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.62,200 గా ఉంది.

భారత మార్కెట్‌లో బంగారం ధరలు శనివారం నాడు (ఆగస్టు 21) పెరిగాయి. ఆగస్టు 21న బంగారం ధరలో గ్రాముకు రూ.27 మేర పెరిగింది. దీంతో భారత మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ రూ.46,400 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.47,400గా ఉంది. మొత్తానికి గత వారం రోజులతో పోలిస్తే బంగారం ధర కాస్త పెరిగింది.

భారత మార్కెట్‌లో బంగారం ధరలు పెరగ్గా వెండి ధర మాత్రం అతి అస్వల్ప తగ్గుదల నమోదు చేసింది. గ్రాముకు రూ.0.30 పైసలు చొప్పున తగ్గింది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.62,200 గా ఉంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో వెండి ధర గ్రాముకు రూ.0.40 పైసలు వరకూ తగ్గింది. ఇక్కడ కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.67,000 వరకూ ధర పలుకుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 21న పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ, ఏపీల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.15 చొప్పున పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,280 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.44,250 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.67,000గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉండనున్నాయి. 

ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 21న రూ.44,250 అయింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,280గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,400గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,100 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,000 కు తగ్గింది.

Also Read: Warangal News: వరంగల్‌లో కన్నింగ్ లేడీ, యువకుడి ఆత్మహత్య.. ముగ్గులోకి దింపి కిలాడీ ప్లాన్, అవాక్కైన పోలీసులు

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 21న ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.44,250, 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.48,280గా ఉంది. ముంబయిలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,710గా ఉంది.

ప్లాటినం ధరలో భారీ తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం ఆగస్టు 21న కాస్త పెరిగింది. గ్రాముకు రూ.29 వరకూ పెరిగి తాజా ధర రూ.2,323గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,230 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.

అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Also Read: Wedding Viral Video's: బుల్లెట్ బండి డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేశారు కదా.. ఇక ఈ పెళ్లి వైరల్ వీడియోలు చూసి నవ్వేసుకోండి

Also Read: Medak Murder: ధర్మాకర్ శ్రీనివాస్ హత్య కేసులో కీలక మలుపు.. ఆమె పాత్రపై పోలీసుల ఆరా..

Also Read: Tolet Fine : టూలెట్ బోర్డు పెట్టినా ఫైనేస్తారా ? వేస్తారు .. ఎక్కడోకాదు హైదరాబాద్‌లోనే..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget