Medak Murder: ధర్మాకర్ శ్రీనివాస్ హత్య కేసులో కీలక మలుపు.. ఆమె పాత్రపై పోలీసుల ఆరా..
రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్ హత్య కేసులో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో చనిపోయిన ధర్మాకర్ శ్రీనివాస్ భార్యనే పోలీసులు అనుమానిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం మెదక్ జిల్లాలో కారు డిక్కీలో ఒక మృతదేహం లభ్యం కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. శవాన్ని కారు డిక్కీలో వేసి ఆ కారును దుండగులు కాల్చేశారు. కారు ఇంజిన్ నెంబరు ఆధారంగా రిజిస్ట్రేషన్ నెంబరును గుర్తించి చనిపోయిన వ్యక్తి అదే జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, సినిమా థియేటర్ ఓనర్ అయిన ధర్మాకర్ శ్రీనివాస్ అని గుర్తించారు. అయితే, ఈ కేసు తొలుత మిస్టరీగా ఉండగా.. ఆ తర్వాత కొద్ది రోజులకు అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. ఆర్థిక పరమైన లావాదేవీలు ఈ హత్యకు మూలకారణంగా పోలీసులు గుర్తించారు.
అయితే, తాజాగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్ హత్య కేసులో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో చనిపోయిన ధర్మాకర్ శ్రీనివాస్ భార్యనే పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. హత్యకు ముందు రోజు శివ అనే వ్యక్తి ధర్మాకర్ శ్రీనివాస్‌తో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ భార్యకు శివ సోదరుడు. దీంతో పోలీసుల అనుమానం శ్రీనివాస్ భార్యపైకి మళ్లింది.
కేసు వివరాలివీ..
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో ధర్మాకర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కారు డిక్కీలోనే శవంగా పడిఉన్నాడు. పైగా ఆ కారు పూర్తిగా దగ్ధమై ఉండడంతో ఆయన శవం కూడా పూర్తిగా కాలిపోయి ఉంది. అటవీ సమీపంలో ఈ ఘటన జరిగి ఉండగా.. ఆలస్యంగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని అతని నోటిలో అమర్చిన పెట్టుడు దంతాల ఆధారంగా ఆయన భార్య గుర్తించారు. ఆ తర్వాత తన భర్త మరణంపై ఆమె వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు మీడియాతో మాట్లాడిన ఆయన భార్య తన భర్తకు వివాహేతర సంబంధాలున్నాయని, తరుచుగా గొడవ అయ్యేదని చెప్పడంతో ఈ హత్య ఆ సంబంధాల వల్ల అని పోలీసులు భావించారు. ఆ తర్వాత ఆర్థిక లావాదేవీల వల్ల అని గుర్తించారు.
Also Read: Indira Shoban Resigns: వైఎస్ షర్మిలకు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా, మళ్లీ పాత గూటికే వెళ్తారా?
నిందితులు వీరే..
శ్రీనివాస్, నిఖిల్, శివ, పవన్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ధర్మాకర్ శ్రీనివాస్‌ను హత్య చేసినట్లుగా నిర్ధారణ అయిందని ఘటన జరిగిన రెండో రోజు ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు. ప్రధాన నిందితుడు శివగా తేలిందని అన్నారు. అయితే, హత్యకు కారణం, మూలం మాత్రం పూర్తిగా నిర్ధరణ కాలేదన్నారు. శ్రీనివాస్ గొంతు కోసి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో ఉందని ఎస్పీ తెలిపారు. తాజాగా ఈ కేసులో అనుమానం ఆయన భార్యపైనే రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: Hyderabad: ఇంట్లోకి చొరబడి దొంగతనం.. కానీ మంచోడట! అవాక్కైన బాధితుడు.. ఎలాగంటే..
Also Read: Taliban in Kabul: అరాచకంగా తాలిబన్ల తీరు.. మూసేసిన భారత ఎంబసీల్లోకి చొరబడి వాటిని ఎత్తుకెళ్లారు