IPL Auction 2026: ధోని స్టార్ అయ్యే టైంలో పుట్టారు.. ఇప్పుడు కెప్టెన్ కూల్‌తో డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటారు
IPL Mini Auction | 19 ఏళ్ల కార్తీక్, 20 ఏళ్ల వీర్ లను చెన్నై సూపర్ కింగ్స్ CSK ఐపీఎల్ మినీ వేలంలో 14.2 కోట్లు పెట్టి కొంటుందని ఎవరూ ఊహించలేదు.

CSK IPL Auction 2026 | అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ పుట్టిన సమయానికే మహేంద్ర సింగ్ ధోని ఒక స్టార్ అయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సంవత్సరాల్లో 'కెప్టెన్ కూల్' విజయాల చరిత్ర రాస్తున్నప్పుడు, ఈ ఇద్దరు క్రికెటర్లు పిల్లలే. ఒకరు 19 సంవత్సరాల వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కార్తీక్, మరొకరు 20 సంవత్సరాల ఎడమచేతి వాటం స్పిన్ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్. 5 సార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ వారిపై ఒక్కొక్కరిపై ఏకంగా రూ. 14 కోట్ల 20 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందని ఎవరూ భావించలేదు. కానీ నేడు ఆ యువ ఆటగాళ్లు ధోనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనున్నారు. దాంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ధోని, సంజు సామ్సన్ ఉండగా కార్తీక్ ఆడే అవకాశం వస్తుందా లేదా ప్రశాంత్ వీర్ రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా తయారవుతాడా అనేది ప్రశ్నార్థకంగా మారాయి. వీటికి కాలమే సమాధానం చెబుతుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంది. అనుభవంపై ఎల్లప్పుడూ దృష్టి సారించే చెన్నై జట్టు, ఐపీఎల్ 2026 మినీ వేలంలో యువ ఆటగాళ్లపై ఎక్కువ పెట్టుబడి పెట్టింది. అయితే జట్టు నిర్వహణ, కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్రకారం సీఎస్కే ఫ్రాంచైజీ మరికొన్నేళ్లకు సంబంధించి జట్టును సిద్ధం చేస్తోంది.
ఐపీఎల్ జట్లు దగ్గరగా తెలిసిన వారికి, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో 15 సంవత్సరాలుగా ఉన్న ఎ.ఆర్. శ్రీకాంత్, స్థానిక, అంతర్జాతీయ టాలెంట్ గుర్తించడంలో కీలక పాత్ర పోషించారని తెలుసు. ఇప్పుడు అతను చెన్నై జట్టుకు టాలెంట్ ఉన్న యువ ఆటగాళ్ల కొనుగోలుకు బాధ్యత వహించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 21 మ్యాచ్‌ల అనుభవం ఉన్న ప్రశాంత్ వీర్, కార్తీక్‌లను ఎంచుకున్నారు. వచ్చే ఐపీఎల్ నాటికి సీఎస్కే ఫ్రాంచైజీ వీరిని జట్టుకు తగ్గట్లుగా మలుచుకుంటుందని తెలిసిందే.





















