By: ABP Desam | Updated at : 30 Jul 2022 02:03 PM (IST)
ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో సాహితీ సంస్థ భారీ మోసం
Real Estate Fraud : ప్రీలాంచ్ పేరుతో తక్కువ ధరకే ఫ్లాట్లంటే అందరూ ఎగబడి డబ్బులు కట్టేశారు. నెలల గడుస్తున్నా... నిర్మాణం ప్రారంభించలేదు. చెప్పిన గడువు పూర్తయిపోయింది. కానీ పునాదులు కూడా వేయలేదు. అంతేనా ఇప్పుడా స్థలం కూడా అమ్మసేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. దీంతో డబ్బులు కట్టిన వందల మంది బాధితులు లబోదిబోమంటున్నారు. రతియల్ ఎస్టేట్ కంపెనీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు.
అమీన్‌పూర్ దగ్గర 23 ఎకరాల్లో వెంచర్
హైదరాబాద్ శివారులో అమీర్ పూర్ దగ్గర 23 ఎకరాల్లో వెంచర్ వేసింగి సాహితీ ఇన్ఫ్రాటెక్ కంపెనీ. విస్తృతంగా ప్రచారం చేసింది. ఆరు టవర్లు.. పది టవర్లు నిర్మిస్తామని చెప్పుకుంది. ఆకర్షణీయమైన ప్రకటనలు చేసింది. ఈ వెంచర్ లో మొత్తం 4300 ఫ్లాట్లు ఉంటాయని చెప్పి.. 2019 జూన్ లో ఫ్రీ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. భారీ ఎత్తున ప్లాటన్లు విక్రయించింది. ఫ్రీ లాంచ్ లో 1200 మందికి పైగా కస్టమర్లు ఫ్లాట్ కొనుగోలు చేశారు. 2023 మార్చ్ కంత ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే గడువు ముగిసే దశకు వస్తున్నా.. ఇప్పటి దాకా నిర్మాణం ప్రారంభించలేదు. కేవలం స్థలం చదును చేసి వదిలేసింది.
ప్రిలాంచ్ పేరుతో డబ్బులు మొత్తం ముందే కట్టించుకున్న వ్యాపారులు
ఎలాంటి బ్యాంక్ లోన్లు లేకుండా ముందుగా డబ్బులు కట్టిన వారికే ప్రీలాంచ్ ఆఫర్లు అనిచెప్పడంతో చాలా మంది బాధితులు వివిధ మార్గాల్లో డబ్బులు సేకరించి కంపెనీకి కట్టారు. కానీ ఇప్పుడు కంపెనీ అడ్డగోలుగా మోసం చేయడానికి సిద్ధం కావడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. చెప్పిన దాని ప్రకారం ప్లాట్లు మాకు అప్పగించమని అడిగితే యాజమాన్యం బెదిరింపులకు దిగుతోంది. డబుల్ బెడ్ రూం కి 25 లక్షలు ట్రిబుల్ బెడ్ రూం కి 35 లక్షలు వసూలు చేసిన యాజమాన్యం తమను నట్టేట ముంచిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. మొత్తంగా 2000 బాధితుల నుంచి ఇప్పటిదాకా 1500 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు వ్సతున్నాయి.
గడువు ముగుస్తున్నా కనీసం కన్‌స్ట్రక్షన్ ప్రారంభించని సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎం డి లక్ష్మీనారాయణ
సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎం డి లక్ష్మీనారాయణ. అధికార పార్టీ నేతలు.. ఇతర రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ డబ్బులు తిరిగి ఇవ్వాలని అంటున్న వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. ప్రిలాంచ్ సమయంలో చాలా మాటలు చెప్పారు.. తర్వాత కూడా రకరకాల ప్లాన్లు చెప్పారు. ఈ వ్యవహారం తేడాగా ఉండటంతో కొంత మంది తమ ప్లాట్లను రద్దు చేసుకున్నారు. వారికి కూడా అరకొరగానే డబ్బులు ఇచ్చారు. అసలు నిర్మాణం చేపట్టకపోగా భూమిని కూడా అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలియడంతో బాధితులు రగిలిపోతున్నారు. పోలీసులు కూడా మా పిర్యాదు పట్టించుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు.
ఇప్పుడు స్థలం కూడా అమ్మేసేందుకు ప్రయత్నాలు
బంజారాహిల్స్‌లోని సాహితి ఇన్ఫ్రా టెక్ వద్ద పెద్ద ఎత్తున బాధితులు గుమికూడారు. అక్కడ కంపెనీ ప్రతినిధులు పెద్దగా అందుబాటులో లేరు. డబ్బులు తిరిగి ఇప్పించాలని ఎక్కువ మంది కోరుతున్నారు.
తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!
భార్యకు కు.ని. ఆపరేషన్ అన్నాడు- పిల్లల్ని ఖూనీ చేశాడు
Vijayawada: విజయవాడలో 9 అంతస్తుల కొత్త బిల్డింగ్, అన్ని కోర్టులు అందులోనే - ప్రారంభించనున్న CJI
Vizag Murders: మరోసారి ఉలిక్కిపడ్డ విశాఖ, నడ్డిరోడ్డుపై రౌడీషీటర్ హత్య!
Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !
Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
Koppula Eashwar: సుప్రీంకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్కి చుక్కెదురు, 2018 నాటి కేసులో కీలక మలుపు