Nidigunta Aruna: 28 లక్షల ఫ్లాట్ 3లక్షలకే ఇవ్వాలని మెడపై కత్తిపెట్టి బెదిరింపులు - నెల్లూరు అరుణ సెటిల్మెంట్ కేస్ ఇదే !
Nellore Lady Donఛ నెల్లూరులో ఓ ఫ్లాట్ సెటిల్మెంట్ కేసులో నిడిగుంట అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. 28 లక్షల ఫ్లాట్ మూడు లక్షలకే ఇవ్వాలని యజమాని మెడపై కత్తి పెట్టి బెదిరించినట్లుగా కేసు నమోదు అయింది.

Police arrest Nellore Nidigunta Aruna: నెల్లూరు లేడీ డాన్‌గా ప్రచారం పొందుతున్న నిడిగుంట అనే మహిళకు కోర్టు పధ్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. కారు ఢిక్కీలో దాక్కుని పారిపోతున్న ఆమెను అద్దంకి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆమెపై ఓ సెటిమెంట్ కేసు నమోదైన కేసులో అరెస్టు చేశారు. అపార్ట్మెంట్ ఓనర్ తో ఫ్లాట్ కొనేందుకు రూ.28 లక్షల బేరం కుదుర్చుకుని రూ.3 లక్షలు మాత్రమే చెల్లించిన అరుణ ..మిగతా డబ్బులు చెల్లించకుండా యజమానిని బెదిరించింది. 2024లో కొంతమంది వ్యక్తులతో కలిసి ఓనర్ ని బెదిరించి..మెడపై కత్తి పెట్టి తనపేరు మీదకి ఫ్లాట్ మార్చిలని బెదిరింపులకు పాల్పడిందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
గత వారం నెల్లూరు జైల్లో జీవిత ఖైదు పడిన కరుడుగట్టిన నేరస్తుడు అయిన శ్రీకాంత్ కు పెరోల్ లభించింది. రెండు జిల్లాల ఎస్పీలు పెరోల్ ను వ్యతిరేకించారు. ఆయన ఓ సారి జైలు నుంచి పారిపోయాడని..అత్యంత తీవ్రమైన నేరాలు చేసే వ్యక్తి అని.. బయటకు వెళ్తే మళ్లీ నేరాలు చేస్తారని ఎస్పీలు స్పష్టం చేశారు. అయితే ఆయనకు పెరోల్ ఇస్తూ నేరుగా హోం సెక్రటరీ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీనికి కారణం నిడిగుంట అరుణ పెద్ద ఎత్తున లాబియింగ్ చేయడమేనన్న ఆరోపణలు వచ్చాయి.
తర్వాత మెల్లుగా అరుణ గురించిన వివరాలన్నీ బయటకు వచ్చాయి. వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఆమె రెండు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను గుప్పిట పెట్టుకుని పెద్ద ఎత్తున దందాలు చేసిందని.. దిశ యాప్ ప్రచారకర్తగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు జీవిత ఖైదీగా ఉన్న రౌడీషీటర్ శ్రీకాంత్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు పరిచయం పెంచుకుని అతనితో జైలు నుంచే సెటిల్మెంట్లు చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో శ్రీకాంత్ జైలు నుంచి పరారయ్యారు. పోలీసులు పట్టుకోలేదు. చాలా కాలం తర్వాత లొంగిపోయారు తరవాత ఆయనకు పెరోల్ వచ్చింది.
పోలీసు ఉన్నతాధికారులను గుప్పిట పట్టుకుని.. కొంత మంది ప్రజా ప్రతినిధుల సిఫారసులతో ఆమె.. నెల్లూరులో సెటిల్మెంట్లు చేయించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.. ఇప్పుడు కూడా శ్రీకాంత్ కు పెరోల్ రావడానికి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫారసు చేశారని అంటున్నారు. వారెవరు అన్నదానిపై స్పష్టత లేకపోయినా.. నేరుగా హోంసెక్రటరీ నుంచి ఉత్తర్‌వులు రాడవంతో చాలా పెద్ద స్థాయిలోనే అరుణ ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆమె దందాలపై ఇప్పటికే ఆరోపణలు ఉండటంతో.. కేసుల్ని బయటకు తీసిన పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టు సమాచారం కూడా ఆమెకు ముందుగానే తెలిసింది. పోలీసు వర్గాల్లో ఇప్పటికీ ఆమెకు పట్టు ఉందని.. అందుకే ముందుగానే అరెస్టు సమాచారం తెలియడంతో కారు ఢిక్కీలో దాక్కుని .. సెల్ఫీ వీడియో తీసి.. మీడియాకు విడుదల చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను అద్దంకి వద్ద అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించింది.





















