Nellore Aruna Arrest: రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్ట్ - తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో
Nellore aruna srikanth | ఏపీలో సంచలనం రేపిన రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ పై దర్యాప్తు జరుగుతుండగానే అతడి ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు.

Rowdy sheeter srikanth lover aruna arrest | నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టించిన రౌడీషీటర్ శ్రీకాంత్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నాడు పోలీసులు అరుణను అద్దంకి సమీపంలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరుణపై కోవూరు ప్రాంతంలో ఒక ప్లాట్ యజమానిని బెదిరించిన కేసులో కేసు నమోదైంది. ఈ కేసులో అరుణను అరెస్ట్ చేసిన నేడు స్థానిక కోర్టులో ఆమె హాజరుపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగు రోజుల కిందట ఓ సీఐకి అరుణ ఫోన్ చేసి బెదిరించిన ఘటనను పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఆమె సీఐని భయపెట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం.
వైసీపీ హయాంలో సెటిల్మెంట్లు, అక్రమ లావాదేవిలు..
వైసీపీ ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో రౌడీషీటర్ శ్రీకాంత్ సహకారంతో అరుణ పలు నేర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సెటిల్మెంట్లు, బెదిరింపులు, అక్రమ డబ్బుల లావాదేవీల్లో వీరి పాత్రపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ప్రస్తుతం అరుణ పూర్తి వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనతో నెల్లూరు జిల్లాలో మరోసారి రౌడీషీటర్ల వ్యవహారంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందండి..😂😂#ysjagan #trending#aruna #ycptrolls #andhrapradesh #tdpat175 pic.twitter.com/3xptsvcTwG
— tdpat 175 (@Tdpat175) August 19, 2025
రౌడీషీటర్ శ్రీకాంత్‌కు బెయిల్‌తో యవ్వారం వెలుగులోకి..
జీవిత ఖైదు ఎదుర్కొంటున్న రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఎట్టకేలకు అరెస్ట్ అయింది. అరెస్టుకు ముందు ఆమె కార్ డిక్కీలో దాక్కుని అరుణ సెల్ఫీ వీడియో తీసింది. ఈ పరిస్థితుల్లో తనను ప్రెస్, మీడియానే కాపాడాలి అని వీడియోలో కోరింది. పలు కేసుల్లో నిందితుడు శ్రీకాంత్ కు కూటమి ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసింది. అనంతరం హాస్పిటల్‌లో శ్రీకాంత్ అరుణ రాసలీలల వీడియో బయటకు రావడం దుమారం రేపింది. పెరోల్ మంజూరులో టిడిపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్, హోం శాఖ పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి. ఓ మహిళ ఎమ్మెల్యేలతో పరిచయాలు పెంచుకుని ఏకంగా సీఐలను భయపెట్టడం, జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న తన ప్రియుడు శ్రీకాంత్‌కు బెయిల్ తెచ్చుకోవడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నిందితుడు శ్రీకాంత్ కు మంజూరు చేసిన పెరోల్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ క్రమంలో పోలీసులు అరుణను అరెస్ట్ చేశారు.
టీడీపీ అండతోనే రౌడీషీటర్‌కు పలుమార్లు బెయిల్..
రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రావడంలో సంతకాలు ఎవరెవరు చేశారో హోంమంత్రి అనిత ఎందుకు చెప్పడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సిఫార్సు చేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు అడిగితే నీళ్లు నమిలారని ఎద్దేవా చేశారు. పెరోల్ ఎలా వచ్చిందో అనవసరం అని హోం మంత్రి అన్నారు. రౌడీషీటర్ శ్రీకాంత్, అరుణపై విచారణ జరుపుతామని అనిత చెప్పగా.. ఇప్పటికే కూటమి ప్రభుత్వం రెండుసార్లు శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చిందని, టీడీపీ నేతల అండతోనే రౌడీ షీటర్ బయటకొచ్చాడని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది.






















