అన్వేషించండి

AP New Ration Card List: ఏపీలో కొత్త రేషన్ కార్డుల జాబితా విడుదల, మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

AP Smart Ration Cards | ఏపీ ప్రభుత్వం ఆగస్టు 25న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది. రేషన్ కార్డులో మీ పేరు ఉందో లేదో ఇప్పుడు ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

 New Ration Cards In Andhra Pradesh | అమరావతి: తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీలోని కూటమి ప్రభుత్వం సైతం కొత్త రేషన్ కార్డులపై ఫోకస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 25వ తేదీ నుంచి 31 వరకు అర్హులైన లబ్ధిదారులకు జారీ అయిన ఈ  కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయనున్నారు. ఈ మేరకు ఏపీ పౌర సరఫరాల శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

4,29,79,897కి చేరిన లబ్దిదారులు

 ఈ కార్యక్రమంలో ఏపీ సర్కార్ మొత్తం 1,45,97,486 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుందని సమాచారం. వీటితో కలిపితే రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్దిదారుల సంఖ్య 4,29,79,897కి చేరిందని అధికారులు తెలిపారు. ఈ స్మార్ట్ కార్డులు ఆధునిక సాంకేతికతతో రూపొందించారు. స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ పెద్ద ఫోటో, కుటుంబసభ్యుల పేర్లు, QR కోడ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. దీని ద్వారా లబ్ధిదారుల గుర్తింపు మరింత తేలిక అవుతుందని సర్కార్ చెబుతోంది. కొత్త స్మార్ట్ కార్డుల ఆధారంగా లబ్ధిదారులు సెప్టెంబర్ నెల నుంచి రేషన్ సరుకులు పొందుతారని అధికారులు తెలిపారు.

రేషన్ సరుకుల పంపిణీకి ప్రభుత్వం స్పష్టమైన సమయాలను ప్రభుత్వం పేర్కొంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకులు తీసుకొవచ్చు. 
అందులో ఉదయం: 8:00 AM నుంచి 12:00 PM వరకు, 
సాయంత్రం: 4:00 PM నుంచి 8:00 PM వరకు
లబ్ధిదారులు ఈ సమయాల్లో తమ సమీప రేషన్ దుకాణాలను సందర్శించి సరుకులు తీసుకోవాలని అధికారులు సూచించారు. 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు, అలాగే ప్రభుత్వం పింఛన్లు పొందే దివ్యాంగులకు, ప్రతి నెలా 26 నుంచి 30 తేదీల మధ్య ఇంటి వద్దనే సరుకులు అందజేస్తారు.

మీ రేషన్ కార్డులో సభ్యుల పేర్లు, క్యూ ఆర్ కోడ్ 
మీ రేషన్ కార్డులో కుటుంబ పెద్ద పేరు, క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. మీరు రేషన్ కార్డులోని సభ్యుల వివరాలను ఇప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం ఇందుకోసం చర్యలు చేపట్టింది. ఆగస్టు 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ప్రభుత్వం కార్డుదారుల వివరాలు తెలుసుకునేందుకు సైతం వీలు కల్పించింది. అందుకోసం కేవలం కొన్ని స్టెప్స్‌ పాటిస్తే సరిపోతుంది.

రేషన్ కార్డు వివరాలు చెక్ చేసుకునే విధానం
- ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ https://aepos.ap.gov.in/SRC_Trans_Int.jsp లింక్‌ను ఓపెన్ చేయాలి
- అందులో మీ రేషన్ కార్డు నెంబర్‌(Ration Card Number)ను ఎంటర్ చేయండి
-  ఆ తరువాత Submit బటన్ పై క్లిక్ చేయండి
- మీ కొత్త రేషన్ కార్డులోని సభ్యుల వివరాలు మీకు స్క్రీన్ పై కనిపిస్తాయి. మీరు ఈ రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు 

ఏపీలో రేషన్ కార్డుల పంపిణీ హైలైట్స్
- ఆగస్ట్ 25 నుండి 31 వరకు ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ
- మొత్తం 1,45,97,486 స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
- తాజాగా జారీ చేసిన కార్డులతో కలిపి మొత్తం రేషన్ లబ్ధిదారుల సంఖ్య 4,29,79,897కి చేరింది.
- స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ పెద్ద ఫోటోతో పాటు కుటుం సభ్యుల పేర్లు, QR కోడ్ వంటి సెక్యూర్ ఫీచర్లు ఉన్నాయి 
- కొత్త కార్డుదారులు సెప్టెంబర్ నుంచి రేషన్ సరుకులు పొందుతారు

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Net Zero Village: ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
Junior Doctors Stipend: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget