Viral News: మంటగలిసిన మానవత్వం! రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, సంతూర్ సబ్బుల కాటన్లు ఎత్తుకెళ్లిన జనం
Mancherial News | మంచిర్యాల జిల్లాలో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీలో ఉన్న సంతూర్ సబ్బుల కోసం జనం ఎగబడ్డారు.

Adilabad News Today | లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లక్సెట్టిపేటమున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డ మరొకరిని ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఒక్కొకటిగా వాహనాలు పంపిస్తున్నారు.
రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీలో సంతూర్ సబ్బుల లోడ్ ఉండటంతో స్థానికులు ఆ లారీలో ఉన్న సంతూర్ సబ్బుల కోసం ఎగబడ్డారు. గుంపులు గుంపులుగా వెళ్లి మరి సంతూర్ సబ్బుల కాటన్లు ఎత్తుకెళ్లారు. అనంతరం పరిస్థితిని గమనించి పోలీసులు వారిని అదుపు చేశారు. పోలీసులు వచ్చిన తరువాత లారీలో ఉన్న మిగతా సంతూర్ సబ్బులను ఎత్తుకెళ్లకుండా జాగ్రత్తపడ్డారు.

ప్రమాదంలో గాయపడిన వారిని పట్టించుకోకుండా లారీలో ఉన్న సంతూర్ సబ్బుల కాటన్లు కోసం జనాలు గుంపులుగా వచ్చి ఎత్తుకెళ్లడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. కొంచెమైనా మానవత్వం లేదా అని వీడియో, ఫొటోలు చూసిన వారు విమర్శిస్తున్నారు.





















