OYO Crime: గచ్చిబౌలి ఓయో రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో బ్యూటీషియన్ మృతి - సీసీ కెమెరాలే కీలక సాక్ష్యం
Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలి ఓయో హూమ్ లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు అనుమానాస్పద అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Young woman died in OYO Gachibowli : హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఓయో హోటల్‌లో అనూష అనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆత్మహత్యగా భావించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అనూహ తల్లిదండ్రులు... ఆత్మహత్య కాదని.. ఆమెకు అలాంటి ఆలోచనలు లేవని.. ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనూష హైదరాబాద్‌కు చెందిన వారు. ఆమె బ్యూటీషియన్ గా పని చేస్తున్నారు. గతంలో పెళ్లి అయింది కానీ.. భర్తతో సరిపడకపోవడంతో విడిగా ఉంటోంది. తల్లిదండ్రులతోనే కలిసి ఉంటూ బ్యూటీషియన్ గా పని చేసుకుంటోంది. అయితే ఆమె 22వ తేదీన స్నేహితుల్ని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింద. కానీ మళ్లీ రాలేదు. చివరికి హోటల్ లో చనిపోయిన స్థితిలో ఉందని ఫోన్ రావడంతో కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు.
సాధారణంగా ఓయో రూముల్లో ఫ్రెండ్స్ ను కలిసేందుకు వెళ్లరు. ఎవరో నమ్మకమైన మిత్రుడు లేదా మిత్రురాలు వచ్చి కలుస్తామంటేనే ఆమె ఓయో రూమ్ కు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ఆ రూమ్ కు ఎవరు వచ్చారు.. ఎవరు వెళ్లారు అన్నదానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సీసీ టీవీఫుటేజీ ఇతర వివరాలు సేకరిస్తున్నారు. వివాహ జీవితంలో ఏర్పడిన ఇబ్బందుదల కారణంగా మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. పూర్తిగా ఆత్మహత్య తరహాలోనే మరణం ఉండటంతో .. పోలీసులు ఆ దిశగా కూడా ద ర్యాప్తు చేస్తున్నారు.
అనూష ఆన్ లైన్ ద్వారా సేవలు అందిస్తారు. ఆమెను ఎవరైనా బ్యూటీషియన్ సేవల కోసం ఓయో రూమ్ కు పిలిపించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూమ్ అనూష పేరు మీద తీసుకోలేదని చెబుతున్నారు. ఆ రూమ్ లో అనూష ఒంటరిగా ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా వచ్చారా అన్నదానిపై స్పష్టత వస్తే చాల వరకూ కేసు చిక్కు ముడి వీడియో అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఓయో రూముల విషయంలో ఇటీవల కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. రూమ్ తీసుకున్న వారి పూర్తి వివరాలతో పాటు జంటలుగా వస్తే.. కూడా పూర్తి వివరాలు తీసుకుంటున్నారు. ఈ వివరాలతో పోలీసులు దర్యాప్తు వేగంగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
అయితే అనూష.. తన కాళ్లపై తాను నిలబడిందని ... ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆమెకు లేదని తల్లిదండ్రులు అంటున్నారు. అనూష ఫోన్ తో పాటు ఇతర గాడ్జెట్స్ ద్వారా హిస్టరీని తెలుసుకుని అనుమానాస్పద అంశాలు ఏమైనా ఉంటే పోలీసుల దర్యాప్తు మరింత చురుగ్గా ముందుకు సాగుతుందని అంచనా వేస్తున్నారు.





















